మహాదేవ్ భక్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్సీటీసీ దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు. బాబా విశ్వనాథ్, కాశీ కారిడార్, వారణాసిలోని గంగా హారతి దర్శనం కోసం భారతీయ రైల్వే వచ్చే నెల నుంచి సూపర్ లగ్జరీ రైలును నడపబోతోంది.
దేవ్ దర్శన్ రైలు ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ మొదలవుతుందని అధికారులు అన్నారు. యాత్రికులు ఘజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్ నుంచి రైలు ఎక్కవచ్చన్నారు. ఆ క్రమంలో రాజ్‌కోట్, పాలన్పూర్, అజ్మీర్, రేవానీ, జోషిమఠ్, బద్రీనాథ్, రిషికేశ్, వారణాసి, కాంచీపురం, రామేశ్వరం, పూణే, నాసిక్, ద్వారకాధీష్ మీదుగా వెళ్లి ఢిల్లీలో ముగుస్తుంది.
17 రోజుల ప్రయాణంలో, జోషిమత్, రిషికేశ్, కాంచీపురం, రామేశ్వరం, పూణే, ద్వారకాధీష్, వారణాసి, నాసిక్‌లోని డీలక్స్ కేటగిరీ హోటళ్లలో ఒకటి నుంచి రెండు రాత్రి బస, జ్యోతిర్లింగ ఆలయాల సందర్శన ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే సూపర్ లగ్జరీ రైలులో ఏసీ-1 ధర రూ. 1,55,740 నుంచి 1,80,440 లక్షలు, ఏసీ-2 రూ. 1,44,325 నుంచి 1,67,725 లక్షలు, ఏసీ-3 రూ. 83,970 నుంచి 95,520. అన్ని కోచ్‌లలో ఎలక్ట్రానిక్ లాకర్, CCTV కెమెరాల సౌకర్యం కూడా ఉంటుంది.