శీతలా దేవి |
ఈరోజు శీతల అష్టమి
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు శీతల అష్టమి అంటారు. ఈ పండుగను బసోడా అని కూడా అంటారు. గ్రంథాల ప్రకారం, హోలీ అనంతరం ఎనిమిదో రోజున శీతల అష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి శీతల మాతను పూజించడం వల్ల అనేక రోగాలు, దోషాల నుండి విముక్తి పొందడంతోపాటు దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఈరోజున శీతల మాతకు పాత ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. శీతల అష్టమి తిథి, శుభ సమయం మరియు పూజా విధానాన్ని తెలుసుకోండి.
తేదీ, శుభ ముహూర్తం
- శీతలా అష్టమి మంగళవారం, ఏప్రిల్ 2, 2024
- శీతల అష్టమి పూజ ముహూర్తం - 06:07 AM నుండి 06:24 PM వరకు
- వ్యవధి - 12 గంటలు 17 నిమిషాలు
- శీతల సప్తమి సోమవారం, ఏప్రిల్ 1, 2024
- అష్టమి తిథి ప్రారంభం - ఏప్రిల్ 01, 2024న 09:09 PM
- అష్టమి తిథి ముగుస్తుంది - ఏప్రిల్ 02, 2024న 08:08 PM
పూజా విధానం
అష్టమి రోజున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తల్లి శీతల మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పువ్వులు, అక్షతలు, కుంకుమ, మేకప్ కిట్ ను సమర్పించండి. పాత ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి. దీపం వెలిగించి శీతల స్తోత్రాన్ని పఠించండి. చివరగా హారతి ఇచ్చి పూజను విరమించండి.