Papmochani Ekadashi 2024 Pooja Vidhanam: హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం కృష్ణ పక్షంలోని ఏకాదశి నాడు పాపమోచని ఏకాదశిని జరుపుకుంటారు. పాపమోచని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇక అంతేకాక పాపమోచని ఏకాదశి తేదీ, ఆరోజు శుభ సమయం అలాగే పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
పాపమోచని ఏకాదశి 2024 తేదీ అలాగే శుభ సమయం వివరాలు ఇలా ఉన్నాయి
- శుక్రవారం, ఏప్రిల్ 5, 2024న పాపమోచని ఏకాదశి
- 6వ తేదీ ఏప్రిల్, పరానా సమయం - 06:05 AM నుండి 08:33 AM వరకు
- పారణ రోజున ద్వాదశి ముగింపు క్షణం - 10:19 AM
- ఏకాదశి తిథి ప్రారంభం - ఏప్రిల్ 04, 2024న 04:14 PM
- ఏకాదశి తిథి ముగుస్తుంది - ఏప్రిల్ 05, 2024న 01:28 PM
పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఏకాదశిని శ్రీ హరి స్వరూపంగా భావిస్తారు, అలా ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతర స్వర్గంతో పాటు ప్రాపంచిక సుఖాలు లభిస్తాయని నమ్ముతారు. ఇక పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి సైతం లభిస్తుంది. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల బ్రహ్మహత్య, బంగారం అపహరించడం, మద్యం సేవించడం వంటి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
పాపమోచని ఏకాదశి పూజా విధానం
- పాపమోచని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి.
- విష్ణువును ధ్యానిస్తూ ఉపవాస వ్రతం చేయాలి.
- విష్ణుమూర్తికి నీరు, పసుపు పుష్పాలు, పసుపు చందనం, అక్షితలు మొదలైన వాటిని సమర్పించండి.
- ఆ నైవేద్యం సమర్పించి తర్వాత దీపం వెలిగించండి.
- తర్వాత ఏకాదశి వ్రత కథను పఠించండి.
- చివరికి, హారతి ఇవ్వండి,
- ఇక ద్వాదశి రోజున పూజ చేసిన తర్వాత ఉపవాసం విరమించండి.
- రోజంతా ఏకాదశి ఉపవాసం ఉండి, ద్వాదశి రోజున బ్రాహ్మణులకు పున:పూజలు చేసి దానం చేసిన తర్వాత ఉపవాసం విరమించండి.