కృష్ణార్జున |
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 31
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః |
శ్రద్ధావన్తోనసూయన్తో ముచ్యన్తే తేపి కర్మభిః ॥
యే - ఎవరైతే; మే - నా; మతం - ఆదేశాలను; ఇదం - ఈ; నిత్యం - నిత్యకర్యగా; అనుతిష్ఠన్తి - సక్రమంగా నిర్వహిస్తారో; మానవాః - మానవులు; శ్రద్ధావన్త: - భక్తిశ్రద్ధలతో; అనసూయనతః - అసూయ లేకుండ; ముచ్యన్తే - ముక్తులౌతారు; తే - వారందరు; అపి - కూడ; కర్మభిః - కామ్యకర్మ బంధమునుండి;
నా అజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిన్తూ, శ్రద్దతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించేవారు కర్మబంధము నుండీ ముక్తులౌతారు.
భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆదేశమే సమస్త వేదజ్ఞానసారము, అందుకే అది, ఎటువంటి మినహాయింపు లేనట్టి నిత్యసత్యము. వేదాలు నిత్యమైనట్లుగా శ్రీకృష్ణభక్తిభావనా సత్యము కూడా నిత్యమై ఉన్నది. భగవంతుని పట్ల అసూయ లేకుండ మనిషి ఈ ఉపదేశము పట్ల దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. భగవద్గీత మీద వ్యాఖ్యానాలు వ్రాసినా శ్రీ కృష్ణుని, పట్ల విశ్వాసము లేని తాత్త్వికులు ఎంతోమంది ఉన్నారు. వారు ఏనాటికీ కర్మబంధం నుండి బయటపడ్డారు. కాని భగవంతుని నిత్య ఆదేశాల పట్ల దృఢమైన విశ్వాసము కలిగిన సామాన్యవ్యక్తి అట్టి ఆదేశాలను అమలు చేయలేకపోయినా.. కర్మబంధం నుండి ముక్తుడౌతాడు. కృష్ణభక్తి భావన ప్రారంభంలో
మనిషి భగవదాజ్ఞలను పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చును... కాని అతడు ఈ సిద్ధాంతము
పట్ల ద్వేషం లేనివాడై ఓటమి నిరాశలను పట్టించుకోకుండా శ్రద్ధతో పనిచేసే కారణంగా తప్పకుండా విశుద్ధ కృష్ణభక్తిభావనా స్థితికి చేరుకుంటాడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 32
యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్టన్తి మే మతం ।
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ॥
యే - ఎవరెతే; తు - అయినా; ఏతత్ - ఈ; అభ్యసూయన్లః - అసూయతో; న అనుతిష్ణన్తి - అనుసరించరో; మే - నా; మతం - ఆదేశాన్ని; సర్వజ్ఞాన - అన్ని రకాలైన జ్ఞానాలలో; విమూఢాన్ - పూర్తిగా మూఢులైన వారిగా; తాన్ - వారిని; విద్ధి - తెలిసికోవలసింది; నష్టాన్ - పూర్తిగా నష్టపడినవారు; అచేతసః - కృష్ణ భక్తిభావన లేకుండ.
కాని అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపనివారు సమస్త జ్ఞాన రహితులుగా, మూఢులుగా, పూర్ణత్వ యత్నాలలో నష్టపడినవారుగా భావించబడతారు.
భాష్యము : కృష్ణభక్తిభావనాయుతుడు కాకపోవడంలోని దోషము ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. వరమాధికారి ఆజ్జ పట్ల చూపే అవిధేయతకు శిక్ష ఉన్నట్లే, భగవదాజ్ఞ పట్ల అవిధేయతకు కూడ తప్పకుండ శిక్ష ఉంటుంది. అవిధేయుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా శూన్యహృదయం కారణంగా తనను గురించి పరబహ్మము పరమాత్ముడు భగవంతున్ని గురించి జ్ఞానహీనుడై ఉంటాడు. అందుకే జీవనపూర్ణత్వము గురించి అతనికి ఆశ ఉండదు.
కర్మయోగము - Karma Yogam - శ్లోకము - 33
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ।
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥
సదృశం - అనుసరించి; చేష్టతే - యత్నిస్తాడు; స్వస్యాః - తన; ప్రకృతేః - ప్రకృతి గుణాలను; జ్ఞానవాన్ - జ్ఞానవంతుడు; అపి - అయినప్పటికిని; ప్రకృతిం - ప్రకృతి; యాన్తి - పొందుతాడు; భూతాని - సకల జీవులు; నిగ్రహః - నిగ్రహము; కిం = ఏమి; కరిష్యతి - చేయగలుగుతుంది.
జ్ఞానవంతుడైనా తన స్వభావమును బట్టి పని చేస్తాడు. ఎందుకంటే ప్రతియొక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావమునే అనుసరిస్తాడు. ఇక నిగ్రహము ఏమి చేయగలుగుతుంది?
భాష్యము : ఏడవ అధ్యాయంలో (7.14) భగవంతుని ద్వారా ద్రువపరుపబడినట్లుగా మనిషి కృష్ణభక్తిభావనా దివ్యస్థితిలో నెలకొనకపోతే ప్రకృతి గుణాల ప్రభావం, నుండి ముక్తుడు కాలేడు. అందుకే లౌకిక స్థాయిలో మహోన్నత విద్యావంతుడైన వ్యక్తికైనా కేవలము సిద్ధాంతపరమైన జ్ఞానం ద్వారా లేదా ఆత్మను; దేహం నుండి వేరుపరచడం ద్వారా మాయాబంధము నుండి బయటపడడం అసాధ్యము. విజ్ఞానంలో ఎంతో పురోగతి చెందినవారుగా బయటకు ప్రదర్శించినా, లోపల లేదా ఏకాంతంలో దాటరానట్టి ప్రకృతి గుణాలకు పూర్తిగా ఆధీనులై ఉండే నామమాత్ర ఆధ్యాత్మికవాధులు ఎంతోమంది ఉన్నారు. చదువులో మనిషి గొప్ప పండితుడైనా సుదీర్ఘకాల ప్రకృతి సాంగత్యం కారణంగా బంధంలో ఉంటాడు. అతడు భౌతిక అస్తిత్వము దృష్ట్యా విహితకర్మలలో నెలకొని ఉన్నప్పటికిని కృష్ణ భక్తిభావన అతని భవబంధవిముక్తికి తోడ్పడుతుంది. అందుకే పూర్తిగా కృష్ణభక్తిభావనాయుతుడు కానిదే అతడు విధ్యుక్తకర్మలను విడిచిపెట్టకూడదు. తన కర్మలను అకస్మాత్తుగా విడిచిపెట్టి ఎవ్వడూ కృత్రిమంగా నామమాత్ర యోగి లేదా అధ్యాత్మికుడు కాకూడదు. అతడు తన స్థితిలోనే ఉండి ఉన్నతమైన శిక్షణలో కృష్ణభక్తిభావనను పొందడానికి యత్నించడమే ఉత్తమము. ఆవిధంగా అతడు శ్రీకృష్ణుని మాయాబంధాల నుండి ముక్తుడౌతాడు.
కర్మయోగము - Karma Yogam - శ్లోకము - 34
ఇంద్రియస్వేన్ద్రియస్యార్తే రాగద్వేషా వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్దినౌ ॥
ఇంద్రియస్య - ఇంద్రియాలకు; ఇంద్రియస్యార్దే - ఇంద్రియ విషయాలలో; రాగ - ఆసక్తి;
ద్వేషా - అనాసక్తి కూడ; వ్యవస్థితౌ - నియంత్రణలో ఉంటాయి; తయోః - వాటికి; వశం - వశుడు; న ఆగచ్భేత్ - కాకూడదు; తౌ - అని; హి - నిక్కముగా; అస్య - అతనికి; పరిపన్దినౌ - ఆటంకాలు.
ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానిక్తి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి. మార్గంలో ఆటంకాల వంటివి కనుక్ష అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు.
భాష్యము - కృష్ణభక్తిభావనలో ఉన్నవారు భౌతికేంద్రియ భోగంలో నెలకొనడానికి సహజంగానే విముఖులై ఉంటారు. కాని అటువంటి భావనలో లేనివారు శాస్త్రాల విధినియమాలను తప్పకుండ పాటించాలి. హద్దుమీరిన ఇంద్రియభోగము భౌతిక్ష బంధానికి కారణమౌతుంది. కాని శాస్త్రాల విధినియమాలను పాటించేవాడు ఇంద్రియవిషయాలచే బద్దుడు కాడు. ఉదాహరణకు మైథునభోగము బద్ధజీవునికి ఒక అవనరము. అది వైవాహికబంధ అనుమతితో ఒప్పుకోబడుతుంది. శాస్త్ర ఆదేశాలను బట్టి మనిషి తన భార్యతో తప్ప ఇతర ఏ స్త్రీతోను మైథుసక్రియలో పాల్గొనడం నిషేధింపబడింది. ఇతర స్తీలందరినీ అతడు తన తల్లితో సమానంగా భావించాలి. కాని అటువంటి ఆదేశాలు ఉన్నప్పటికినీ పురుషుడు ఇతర స్త్రీలతో మైథున సంబంధం కలిగి ఉండడానికి మైగ్గు చూపుతాడు. ఈ కోరికలను అణచి వేయాలి లేకపోతే అవి ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు అవుతాయి. భౌతికదేహము ఉన్నంతవరకు దేహావనరాలు నియమనిబంధనలతో పాటుగా అనుమతింపబడతాయి.
అయినా అటువంటి అనుమతులకు సంబంధించిన నియంత్రణ మీద మనం ఆధారవడకూడదు. అనాసక్తితోనే ఆ నియమనిబంధనలను మనిషి అనుసరించాలి. ఎందుకంటే నియమాలతో ఇంద్రియభోగాన్ని అనుభవించడం కూడ అతనిని తప్పుదోవ పట్టిస్తుంది. రాచమార్గాల పైన కూడ ప్రమాదం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కదా ! రాచమార్గాలను చక్కగా ఉంచినా సురక్షిత రహదారిపై ప్రమాదము ఉండనే ఉండదని ఎవ్వరూ పూఛీ ఇవ్వలేరు. భౌతికసాంగత్య కారణంగా ఇంద్రియభోగవాంఛ ఎంతోకాలం నుండి కొనసాగుతోంది. అందుకే సక్రమమైన ఇందద్రియభోగం ఉన్నప్పటికినీ పతనానికి అవకాశం ఉన్నది. కనుక సక్రమ ఇంద్రియభోగం పట్ల ఆసక్తిని కూడ అన్ని రకాలుగా వదలిపెట్టాలి. కాని కృష్ణ భక్రిభావన పట్ల ఆసక్తి అంటే సర్వదా శ్రీకృష్ణుని ప్రేమయుతసేవలో పనిచేయడం మనిషిని అన్ని రకాలైన ఇంద్రియ కలాపాల పట్ల అనానక్తుని చేస్తుంది. కనుక ఎవ్వడూ జీవితంలోని ఏ స్థితిలోనైనా కృష్ణభక్తిభావన పట్ల అనానక్తుడు కావడానికి ప్రయత్నించకూడదు. చిట్టచివరకు కృష్ణభక్తి్తావన స్థితిలో నెలకొనడమే అన్నిరకాలైన ఇంద్రియానక్తుల నుండి బయటపడడంలోని సంపూర్ణ ఉద్దేశము.