కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 26
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మనజ్లినాం |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః నమాచరన్ ॥
బుద్ధిభేదం - బుద్ధిని కలతపెట్టడం; న జనయేత్ - చేయకూడదు; అజ్ఞానాం - అజ్ఞానుల; కర్మసజ్గినాం - కర్మాసక్తులైనవారు; జోషయేత్ - అతడు సంధించాలి; సర్వ - అన్ని; కర్మాణి - కర్మలను; విద్వాన్ - విద్వాంసుడు; యుక్తః - నెలకొని; సమాచరన్ - చేన్తూ.
అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో వనిచేస్తూ అతడు (క్రమంగా కృష్ణభక్తిభావన వృద్ధి అయ్యేందుకు) వారిని నానారకాల కర్మలలో నెలకొల్పాలి.
భాష్యము ; “వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః:” ఇదే సమస్త వేదకర్మల ఉద్దేశ్యము. సకల కర్మలు, సర్వ యజ్ఞాలు, లౌకికకర్మల నిర్దేశాలతో పాటుగా వేదాలలో చెప్పబడిన ప్రతీదీ జీవిత చరమగమ్యమైన శ్రీకృష్ణుని అర్థం చేసికోవడానికే ఉద్దేశించబడ్డాయి. కాని బద్ధజీవులకు ఇంద్రియభోగాన్ని మించి ఏదీ తెలియదు కాబట్టి వేదాలను వారు అదే ఉద్దేశ్యంతో అధ్యయనము చేస్తారు. అయినా వేదకర్మల ద్వారా కామ్యకర్మలు, ఇంద్రియభోగము నియంత్రించబడడం వలన మనిషి క్రమంగా కృవ్ణభక్తిభావనకు ఎదుగుతాడు. అందుకే కృష్ణభక్తిభావనలో ఆత్మదర్శియైనవాడు ఇతరులను వారి కర్మలలో లేదా అవగాహనలో కలతపెట్టకుండ కృష్ణసేవలోనే సమన్త కర్మఫలాలను ఏ విధంగా సమర్పించవచ్చునో చూపే విధంగా పనిచేయాలి. ఇంద్రియభోగానికే పనిచేసే అజ్ఞాని ఏ విధంగా వని చేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకునే విధంగానే
కృష్ణభక్తిభావనలో ఉన్న విద్వాంసుడు వనిచేయాలి. అజ్ఞానిని అతని కర్మలలో కలతపెట్టకపోయినా, కొద్దిగా కృష్ణభక్తిభావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వేదవిధానాల కొరకు ఎదురు చూడకుండ నేరుగా భగవత్సేవలో నెలకొల్పాలి. అట్టి అదృష్టవంతునికి వేదకర్మలను అనుసరించవలసిన అవనరమే లేదు. ఎందుకంటే విధ్యుక్తధర్మపాలన ద్వారా మనిషి పొందే ఫలాలన్నింటిని ప్రత్యక్ష కృష్ణభక్తిభావన ద్వారా అతడు పొందగలుగుతాడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 27
ప్రకృతేః క్రియమాణాని గుణ్జైః కర్మాణి సర్వశః
అహంకారనిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥
ప్రకృతేః - ప్రకృతి; క్రియమాణాని - చేయబడే, గుణైః - గుణాలచే; కర్మాణి - కర్మలకు; సర్వశః- అన్నిరకాలైన; అహంకార విమూఢ - మిథ్యా కారమునే విమోహీతుడయ్యే; ఆత్మా - జీవాత్మా; కర్తా - కర్తను; అహం - నేను; ఇతి = అని; మన్యతే - భావిస్తాడు,
మిథ్యాహంకార ప్రభావము. వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములదే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు.
భాష్యము : ఒకే స్థాయిలో పనిచేసే కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు, భౌతికభామలో ఉన్నవాడు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే స్థితిలో పనిచేస్తున్నట్లు కనిపించినా వారి స్థితుల మధ్య అపారమైన భేదం ఉంటుంది. భౌతికభావనలో ఉన్నవాడు మిథ్యాహంకారం వలన తననే ప్రతిదానికి కర్తనని నమ్ముతాడు. భగవంతుని పర్యవేక్షణలో పనిచేసే ప్రకృతి చేతనే దేహ విధానం తయారైందని అతనికి తెలియదు. తుట్టతుదకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననే జ్ఞానము ఆ లౌకికునికి ఉండదు. మిథ్యాహంకారములో ఉన్న వ్యక్తి ప్రతీదీ స్వతంత్రంగా చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటాడు. అదే. అతని అజ్టానానికి చిహ్నము. ఈ స్థూలసూక్ష్మ దేహాలు భగవదాజ్ఞ మేరకు ప్రకృతిచే సృష్టింపబడినాయని, తన దేహకర్మలను, మానసిక కర్మలను కృష్ణభక్తిభావనలో కృష్ణసేవలో నియోగించాలని అతనికి తెలియదు, భగవానుడు హృపీకేశుడని, అంటే దేహీంద్రియాలకు ప్రభువని అజ్ఞాని విస్మరిస్తాడు. ఎందుకంటే .ఇంద్రియభోగంలో ఇంద్రియాల చిరకాల దుర్వినియోగం కారణంగా అతడు నిజానికి మిథ్యాహంకారమువే విమోహితుడయ్యాడు. ఆ. మిథ్యాహంకారమే. శ్రీకృష్ణునితో ఉన్నట్టి సత్యమని అతడు మరచిపోయేటట్లు చేస్తుంది.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 28
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |.
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్ఞతే ॥
తత్త్వనిత్ - పరతత్త్వాన్ని తెలిసినవాడు; తు - కాని; మహాబాహో = ఓ మహాబాహువులు కలవాడా; గుణకర్మ - భౌతికప్రభావంలో ఉన్న కర్మల; విభాగయోః - భేదాలను; గుణాః - ఇంద్రియాలు, గుణేషు - ఇంద్రియభోగంలో; వర్తన్త - నెలకొన్నాయి; ఇతి - అని; మత్వా - భావించి; న సజ్జతే - ఆసక్తుడు కాడు.
ఓ మహాబాహో! పరతత్త్వజ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు, కామ్యకర్మకు ఉన్నట్టు భేదాలను చక్కగా తెలిసికొని ఇంద్రియాలలోను, ఇంద్రియభోగంలోను నెలకొనడు.
భాష్యము : పరతత్త్వాన్ని ఎరిగినవాడు భౌతికసాంగత్యంలో తన హేయమైన స్థితిని అర్థం చేసికొంటాడు. తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని, అంశనని, భౌతికసృష్టిలో తాను ఉండకూడదని అతనికి తెలుసు. నిత్యానంద జ్ఞానస్వరూపవుడైన భగవంతుని, అంశగా తన నిజస్వరూపాన్ని తెలిసికొని అతడు ఏదో కారణంగ్యాతాను జీవిత భౌతికభావనలో చిక్కుపడ్డానని అర్థం చేసికొంటాడు. విశుద్ధ అస్తిత్వస్థితిలో అతడు తన, కర్మలన్నింటినీ దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తితోనే జోడించాలి. అందుకే అతడు కృష్ణ భక్తిభావనా కర్మలలోనే నెలకొని, సమయానుగుణంగా, కలిగేవి తాత్మాలికమైనవి, అయిన ఇంద్రియ కలాపాల పట్ల సహజంగానే అనాసక్తుడౌతాడు. తన భౌతికజీవస్థితి భగవంతుని పరమ నియంత్రఖలోనే ఉన్నదని, అతనికి తెలుసు. అందుకే అతడు నానారకాల భౌతికకర్మ ఫలాలచే కలతచెందడు.. వాటిని అతడు, భగవత్కరుణగా భావిస్తాడు. పరతత్త్వాన్ని మూడు స్వరూపాలలో అంటే బ్రహ్మముగా పరమాత్మునిగా భగవానునిగా తెలుసుకొన్నవాడు శ్రీమద్భాగవతాన్ని బట్టి తత్త్వవిత్తుగా పిలువబడతాడు ఎందుకంటే భగవంతుని సంబంధములో తన నిజస్థితిని కూడ అతడు ఎరిగి ఉంటాడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 29
ప్రకృతేర్గుణసమ్మూఢా: సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నావిదో మందాన్ కృత్న విన్న విచాలయేత్ ॥
ప్రకృతేః - ప్రకృతి యొక్క; గుణ - గుణాలచే; సమ్మూఢాః - భౌతిక తాదాత్మ్యముచే మూఢులై; సజ్జన్తే - నెలకొంటారు; గుణకర్మను - భౌతికకలాపాలలో; తాన్ - వారిని; అకృత్స్నవిదః -అల్పజ్ఞానము కలిగిన జనులు; మందాన్ - ఆత్మానుభూతి గురించి తెలిసికోవడంలో సోమరులు; కృత్స్నవిత్ - నిజమైన జ్ఞానంలో ఉన్నవాడు; న విచాలయేత్ - కలతపెట్టకూడదు,
ప్రకృతి గుణములదే మోహితులై అజ్ఞానులు భౌతికకర్మలలోనే పూర్తిగా నెలకొని ఆసక్తులౌతారు. కాని కర్తల అఙ్ఞానారణంగా ఆ కర్మలు అల్పమైనవేయైనా జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు.
భాష్యము: జ్ఞానహీనులైన జనులు స్థూలమైన భౌతిక చైతన్యంతో తాదాత్మ్యము చెంది భౌతిక ఉపాధులతో నిండి ఉంటారు. ఈ దేహము భౌతికప్రకృతి వరము. అయితే దేహభావనకే మరీ ఆసక్తుదైనవాడు మందుడు, అంటే ఆత్మావగాహన లేనట్టి ఆలనుడు అని పిలువబడతాడు, అజ్ఞానులు దేహమునే అత్మగా భావిస్తారు, ఇతరులతో ఉన్నట్టి దేహనంబంధాలను వారు బంధుత్వమని అనుకుంటారు. ఏ ప్రదేశంలో దేహము లభించిందో అదే వారికి పూజాధ్యేయము. ధర్మకార్యాల ఉద్ధేశం నిర్వహించడం వరకేనని వారు భావిస్తారు. సంఘసేవ, జాతీయత, పరోవకారము అనేవి' అట్టి లౌకిక ఉపాధులతో కూడిన వ్యక్తుల కొన్ని కార్యాలు. అటువంటి ఉపాధుల ప్రభావంలో వ హ్రు నర్వదా భౌతికరంగంలో తలమునకలై ఉంటారు. అటువంటివారికి ఆధ్యాత్మికొనుభూతి ఒక మిథ్య కనుక అందులో వారికి ఇష్టము ఉండదు. అయినా అధ్యాత్మిక జీవనములో జ్ఞానవికాసం చెందినవారు అట్టి లౌకికవ్యక్తులను కలితపెట్టకూడదు. మనిషి తన అధ్యాత్మిక కలాపాలను నిశ్శబ్దంగా చేసికోవడమ్మే ఉత్తమము. మోహగ్రస్తులైన ఉపకారపనుల వంటి ప్రాథమిక నీతినూత్రాలలో నెలకొల్పవచ్చును.
అజ్ఞానులు కృష్ణభక్తిభావనలోని కార్యాలను అర్థం చేసికోలేరు. అందుకే వారిని కలతపెడుతూ కాలొన్ని వృథా చేసికోవద్దని కృష్ణభగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కాని భగవంతుని ఉద్దేశం బాగా తెలిసినవారు అయిన కారణంగా భక్తులు ఆ దేవదేవుని కంటే ఎక్కువ కరుణ గలవారై ఉంటారు. అందుకే వారు అజ్ఞానుల దగ్గరకు వెళ్ళి వారిని మనిషికి అత్యంత అవసరమైనట్టి కృష్ణభక్తిభావనా కర్మలలో నెలకొల్పడానికి యత్నించడం వంటి నానారకాలైన సాహసాలను చేస్తుంటారు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 30
మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్ధ్యస్వ విగతజ్వరః ॥
మయి - నాకు; సర్వాణి - అన్నిరకాలైన; కర్మాణి - కర్మలను; సన్నస్య = వూర్తిగా సమర్పించి; అధ్యాత్మ - పూర్తి ఆత్మజ్ఞానంతో; చేతసా - చేతనతో; నిరాశీః - లాభాపేక్ష లేకుండ; నిర్మమః - మమత్వము లేకుండ; భూత్వా - అయి; యుద్ద్యస్య - యుద్ధము చేయవలసింది; విగతజ్వరః - మత్తు లేనివాడవై.
అందుకే అర్జునా! నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండ, మమత్వము లేకుండ. నీ కర్మలన్నిరటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుధ్ధము చేయవలసింది.
భాష్యము : భగవద్గీత ఉద్దేశాన్ని ఈ శ్లోకము వంగా నూవిన్తున్నది. సై సైనిక సిక్యయళ్షణలే
లోగా విధి నిర్వహాణ చేయడానికి మనిషి వూర్తిగా కృష్ణభక్తిభావనాయుతుడు కావలసి ఉంటుందని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఇటువంటి ఆదేశము పరిస్థితిని కొంత జటిలం చేసినా శ్రీకృష్ణునిపై ఆధారపడే విధులను నిర్వర్తించాలి. ఎందుకంటే అదే జీవుని సహజస్థితి.. జీవుని నిత్యమైన సహజస్థితి భగవానుని కోరికలకు ఆధీనుడై ఉండడమే కనుక ఆ దేవదేవుని సహకారము లేకుండ అతడు సుఖభాగుడు కాలేడు, అందుకే యుద్ధం చేయమని అర్జునుడు సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణునిచే ఆదేశింపబడ్డాడు.
భగవంతుని ప్రీతి కొరకు ప్రతియొక్కరు సమస్తాన్ని త్యాగం చేసి, అదే సమయంలో మమత్వం లేకుండ విధ్యుక్షధర్మాలను నిర్వహించాలి. అర్జునుడు భగవంతుని ఆజ్ఞను గురించి ఆలోచించవలసిన పని లేదు, కేవలము అతడు దానిని అమలుపరిస్తే చాలు. దేవదేవుడే ఆత్మలన్నింటికీ ఆత్మ అందుకే స్వంత ఆలోచన లేకుండ పూర్తిగా ఒక్క పరమాత్ముని పైననే ఆధారపడేవాడు, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పూర్తిగా కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు ఆధ్యాత్మ చేతనుడని పిలువబడతాడు. '' నిరాశీ: ” అంటే మనిషి యజమాని ఆదేశం మేరకే పనిచేయాలి గాని ఫలితాలను ఆశించకూడదని అర్థము. డబ్బును లెక్కపెట్టే గుమాస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కించినా పైసానైనా తనదిగా చెప్పుకోడు. అదేవిధంగా ఈ వ్రవరచంలో ఏదీ కూడ ఏ వ్యక్తికీ చెందినది కాదని, అంతా భగవంతునికే చెందినదని మనిషి గుర్తించాలి. ఇదే “మయి” (నాకు) అనే దాని నిజమైన అర్ధము. అటువంటి కృష్ణభక్తిభావనలో మనిషి పనిచేసినప్పుడు నిక్కముగా, దేనిపైనా మమత్వము చూపించడు. ఈ భావనే “నిర్మమ”(ఏదీ నాది, కాదు) అని పిలువబడుతుంది. బంధుత్వములో నామమాత్ర బంధువుల పట్ల ఎటువంటి ఆలోచన లేకుండ అటువంటి కఠినమైన ఆదేశాన్ని అమలువరచడంలో ఏదేని విముఖత ఉంటే దానిని వెంటనే విడిచిపెట్టాల్. ఈ ప్రకారంగా మనిషి “విగతజ్వరుడు” అంటే కలత లేనివాడు, మత్తు లేనివాడు అవుతాడు. తన గుణము, స్తితిని బట్టి ప్రతియొక్కడు ఒక ప్రత్యేకమైన కర్మ చేయవలసి ఉంటుంది. పైన చెప్పబడినట్లు అటువంటి కర్మలన్నింటినీ కృష్ణభ్తభావనలో చేయాలి: అదే 'మనిషీని మక్తిమార్గం వై వైపుకు నడిపిస్తుంది.