Indian cow changes destiny line of country |
భారతీయ ఆవు ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం. ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు, మన దేశీ ఆవు ఆరోగ్యం, సంస్కారం.
సమృద్ధిలకు జనని వంటిది. 1947లో భారత జనాభా దాదాపు 33 కోట్లు. గో సంపద 60 కోట్లుగా వుండేది. కానీ… ఇప్పుడు మన గో సంపద దగ్గర దగ్గరగా 14 కోట్లు మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే రోజురోజుకీ మన దేశలో గోవుల పెంపకం తగ్గిపోతోంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు మనం దగ్గరవుతున్నాం.
స్వాతంత్రం అనంతరం రాజకీయ నేతలు శ్వేతక్రాంతి, హరిక్రాంతి పేరుతో చేసిన ప్రయోగాలన్నీ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టాయి. హరిత విప్లవం పేరుతో యూరియా, డీఏపీ, పురుగుల మందుల వాడకం విపరీతంగా పెరిగింది. రైతులు అధిక దిగుబడుల కోసం పొలాల్లో క్రిమిసంహారక మందులను విరివిగా వాడుతున్నారు. అవి పంట భూముల్ని నిస్సారం చేస్తున్నాయి. రోజురోజుకీ దిగుబడులు తగ్గి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.హరిత విప్లవం మనిషిని రోగ గ్రస్తునిగా, రైతుని పేదవానిగా తయారు చేసింది.
శ్వేత క్రాంతి పేరుతో మన దేశానికి తీసుకొచ్చిన సంకర జాతి విదేశీ ఆవుల ద్వారా అనేక రకాల రోగాలు వస్తున్నాయి. వాటి పాలు తాగరాదని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ పాలలో మార్పిన్ అనే విషం వుంటుందని, అది మనిషిని అనేక రకాల ప్రమాదకర రోగాల బారిన పడేస్తుందని హెచ్చరిస్తూనే వస్తున్నారు.
ఆధునిక కాలంలో రైతులు చాలా మంది ట్రాక్టర్‌తో దున్నుతున్నారు. అయితే.. మన భారత నేలల్లో ట్రాక్టర్ వాడకం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల భూమి ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. అంతేకాదు.. దీని వల్ల భూమి కలుషితమవుతుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల అనేక రోగాలు వచ్చిపడతాయి. దీనికి బదులుగా ఎద్దుల సాయంతో పొలం దున్నితే మంచిది. ఎద్దులను ఉపయోగించి, నాగలితో భూమిని దున్నవచ్చు. తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందినప్పుడే గిట్టుబాటు అవుతుంది. కావున దేశీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అలా జరగాలంటే ఎరువులు మనవి, విత్తనాలు మనవి కావాలి. రైతు బయటి నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటన్నింటికీ పరోక్ష ఆధారం మాత్రం భారతీయ ఆవు. కాబట్టి ప్రతి రైతు ఇంట్లో రెండు ఆవులు, ఒక జత ఎద్దులు వుండాలి. నిత్యం ఆవు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.పైగా పేడను పొలాల్లో చల్లడం వల్ల భూమి సారవంతం చేయడంతో పాటు క్రిమి సంహారిణిలాగా కూడా ఉపయోగపడుతుంది. తద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడులు సైతం పొందవచ్చు.
ఆవు ద్వారా భారత దేశ భాగ్యాన్ని మార్చేయవచ్చు
1) రోగ రహిత భారత్ :
ఆవు నడిచే వైద్యుడి వంటిది. మనిషికి వచ్చే సమస్త రోగాలు పంచగవ్య వల్ల నివారించుకోవచ్చు. ఈ విషయం వైద్యపరంగా ఎప్పటి నుంచో శాస్త్రీయంగా రుజువు కూడా అయ్యింది.
2) రుణముక్త భారత్ :
మనమందరం ముందుగా ఒక సంకల్పం తీసుకోవాలి. ఎలాంటి విదేశీ వస్తువులను ఉపయోగించరాదని. ఇలాంటి దృఢమైన సంకల్పం ద్వారా రాబోయే కొన్ని సంవత్సరాలలో మన అప్పులన్నీ తీరిపోతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా అవుతుంది. ఆవు పేడతో దాదాపు 300 రకాల వస్తువుల్ని మనమే తయారు చేసుకోవచ్చు. వాటిని ఉపయోగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కూడా వున్నాయి.
3. కలుషిత రహిత భారత్ :
ఒక గ్రాము ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 100 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 1 గ్రాము నెయ్యితో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే ఓజోన్ అధిక మోతాదులో పెరుగుతుంది.
4. నేర రహిత భారత్ :
మన దేశీ ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి మొదలైనవి మనిషిలో సాత్విక గుణాన్ని పెంచుతాయి. అదే విదేశీ ఆవుల నుంచి వచ్చే పాలు, వాటితో చేసిన పదార్థాలు తామసిక గుణాన్ని పెంచుతాయి. అందువల్ల వ్యక్తి కోపగ్రస్తుడు, నేర ప్రవృత్తి కలిగిన వాడుగా అవుతున్నాడు. కనుక భారతీయ ఆవు పాలు తాగేవారు సాత్విక ప్రవృత్తి కలిగిన మేధోసంపన్నులు అవుతున్నారు. 1947 కంటే ముందు ఇప్పుడున్నన్ని పోలీస్ స్టేషన్లు లేవు. ఎందుకంటే అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా ఆవుండేది.
5) పోషకార లోపం లేని భారత్ :
మన దేశీ ఆవు పాలు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. మన దేశంలో ఎంతో మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిదారులకు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని, ప్రతి కుటుంబానికి రెండు ఆవులను ఇస్తే ఆ పాలు తాగి, వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అంతేకాకుండా ఆ పాలను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటారు. ఆవు పేడ వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది.
6) విషరహిత భారత్ :
ఇప్పుడంతా కలుషితమే. గాలి, నీరు, పాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కలుషితాలే. గోపోషణ ద్వారా వాటన్నింటినీ శుద్ధి చేయవచ్చు. గోమూత్రం, పేడ ద్వారా నిస్సారంగా వున్న నేలను సారవంతం చేయవచ్చు.
7) ప్రపంచానికి అన్నపూర్ణగా భారత్ :
ఆవు పేడ, మూత్రం ద్వారా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తే మనం ప్రంచానికి ఆహార ధాన్యాలను అందించవచ్చు. భారత్‌లో దాదాపుగా 20 నుంచి 25 కోట్ల హెక్టార్ల భూమి వ్యవసాయ యోగ్యంగా వుంది. ఈ భూమికి సరైన నీటి వసతి కల్పిస్తే ఏడాదికి రెండు పంటలు తీయవచ్చు.
8) ఇంధన యుక్త భారత్ :
మన దేశంలోని అన్ని గ్రామాలకు స్వదేశీ పరిజ్ఞానంతో విద్యుత్‌ను రెండు రకాలుగా సరఫరా చేయవచ్చు. 1. ఎద్దులతో నడిచే జనరేటర్ ద్వారా ,2. గోబర్ గ్యాస్ ద్వారా. వీటితో పాటు సీబీజీ (కంప్రెస్డ్ బయోగ్యాస్) ద్వారా కూడా వాహనాలను నడపవచ్చు. గుజరాత్‌లోని వడోదరాలో డా. భరత్ భాయ్ పటేల్ గోబర్ గ్యాస్ యంత్రం ద్వారా 7000 కిలోల గోబర్ గ్యాస్‌ను ప్రతిదినం తయాచు చేస్తున్నారు. ఒక కిలో గోబర్ గ్యాస్ ద్వారా 40 కిలోమీటర్ల దూరం కారు నడుపుతున్నారు.
9) అందరికీ ఉద్యోగ అవకాశాలు :
భారత్‌లో నేడు పంచగవ్యతో రాఖీలు, దూప్ బత్తి, ఫినాయిల్, షాంపూ మోదలైన 300 రకాల వస్తువులు తయారవుతున్నాయి. గ్రామీణంలో వుండే వారికి శిక్షణ ఇచ్చి, గ్రామంలోనే వస్తువులను తయారు చేయడం నేర్పించి, వారిని వారి కాళ్లపైనే నిలబడేట్లు గోసేవా విభాగం చేస్తోంది. ఈ రకంగా భారతీయ ఆవు ద్వారా సుఖవంతమైన, సంపన్నమైన, స్వావలంబి అయిన, సంస్కార భరిత భారత్‌ను నిర్మిద్దాం.
----vskandhra