Arunachaleswaram |
అరుణాచలేశ్వరంలో ఛైత్రమాస వసంతోత్సవం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఛైత్ర మాస వసంతోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ అరుణాచలేశ్వర స్వామి ఉన్నాములై అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అయ్యం కోనేరులో స్వామివారి తీర్థవారి జరుగుతుంది. అదే రోజు రాత్రి 12 గంటలకు 3వ ప్రహారంలోని బంగారు ధ్వజ స్తంభం వద్ద మన్మధ దహనం జరుగుతుంది. శివాలయంలో మన్మధ దహనం జరిగేది ఈ ఆలయ ప్రత్యేకత. తొలిరోజు ఉన్నాములై అమ్మవారికి అరుణాచలేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.