Vrushaba Rasi |
వృషభరాశి
- ఆదాయం 2, వ్యయం 8
- రాజపూజ్యం 7, అవమానం 3
మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, నీ, వూ, నె, నో - లలో ఓకటి అయిననూ, లేక మీరు కృత్తిక 1,2,3,4 పాదాలు; మృగశిర 1,2, పాదంలో జన్మించివుంటే మీది వృషభరాశి.
వృషభరాశి వారికి ఈ ఏడాది చాలా బాగుంది. కృషికి తగ్గ ఫలితాలు అందుకుంటారు. సోదరులు చక్కని తోడ్పాటు అందిస్తారు. తోటి ఉద్యోగస్థులు కూడా బాగా సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుణ్యకార్యాలకై కొంత డబ్బు ఖర్చుపెడతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారగలవు. పంటలు బాగా పండుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్డులౌతారు. ఫ్యాన్నీ కిరాణా, వస్త్ర వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు చూస్తారు. కాంట్రాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు కూడా చక్కని ఫలితాలు చేజిక్కించుకుంటారు. జీవిత భాగస్వామితో సహనంతో సమస్యలను సజావుగా పరిష్కరించుకోవడం ఉత్తమం.
- జనవరి: తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిలిచిపోయిన పనులు కూడా పునప్రారంభిస్తారు. ఆలయాలు దర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చకూడా భారీగా వుంటుంది. తీరిక దొరకదు.
- ఫిబ్రవరి: బంధువులతో సంబంధాలు బలపడతాయి. నూతన వస్తువులు కొంటారు. వాహన యోగం గోచరిస్తుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన చర్జలు సంతృప్తి కలిగిస్తాయి. ఉహించని రీతిలో మంచి అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతతకు లోటు ఉండదు.
- మార్చి: ఖర్చులు అంచనాలను మించిపోతాయి. అయినా ఆర్థికంగా మెరుగైన స్తితిలోనే వుంటారు. అకాల నిద్ర, అకాల భోజనాలు తప్పవు. ఐనా ఆరోగ్యం బాగానే వుంటుంది. పరి మిమ్మల్షి పరీక్షించేవిగా ఉంటాయి. అయినా ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగకుంది.
- ఏప్రీల్: దూరప్రాంతం నుండి వచ్చే ఓ తీయని కబురు మీకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలలో చురుకుగా పాలుపంచుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు.
- మే: ఇది రచయిత్రులకు, రచయితలకు, కళాకారులకు చక్కని ప్రోత్సాహం, గుర్తింపు లభించే సమయం. బాకీలు తీరుస్తారు. విందులు, వివారాలతో ఆనందంగా గడుపుతారు. శ్రమకి తగ్గ ఫలితం పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి.
- జూన్ : నూతన పరిచయాలు మీలో నూతన ఉల్లాసాన్ని కలిగిన్తాయి. సొంతయిల్లు నిర్మించుకోవడం గురించి ఆలోచిస్తారు. ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వివాహ ప్రయత్తాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా అధిగమిస్తారు. దైవభక్తి, తాత్విక చింతన పెరుగుతాయి.
- జూలై: అర్థిక పరిస్థితి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఆశ్యర్యం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరులు సహకరిస్తారు. తల్లి ద్వారా లాభం కలుగుతుంది. వృత్తి సంతృప్తి కరంగా సాగుతుంది. ముఖ్యమైన విషయాలపట్ల బాగా ఆలోచించాకే దీ నిర్ణయానికి రండి.
- ఆగస్ట్: ఇంట్లో శుభకార్యాలు విజయవంతంగా నిర్వహిస్తారు. ఆలయాలు దర్శిస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. పనులను ప్రాధాన్యతాక్రమంలో చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్బం దెబ్బ తినవచ్చు. నోటిని అదుపు చేయకపోతే ఇబ్బందులు తలెత్తగలవు. కాబట్టి ఆచితూచి మాట్లాడే అలవాటు చేసుకోండి.
- సెప్టెంబర్: ఆటంకాలు ఎదురౌతాయి. పనులు ఆలస్యంగానే పూర్తవుతాయి. పరాయి స్త్రీలతో జాగ్రత్తగా మెలగండి. పుణ్యకార్భాలలో పాలుపంచుకుంటారు. దైవచింతన ఎక్కువౌతుంది. ప్రయాణా లలో జాగ్రత్త పాటించండి. ఉన్నత అధికారులతో మాటపడకుండా జాగ్రతపడండి. ఖర్చులు ఎక్కువవుతాయి. పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మొత్తమ్మీద ఈ నెల సాఫీగానే సాగిపోతుందని చెప్పాలి.
- అక్టోబర్ : ఆదాయం పెరుగుతుంది. వసతులు సమకూర్చుకుంటారు. బాధ్యతలు సవ్యంగా, సమగ్రంగా, సకాలంలో నెరవేరుస్తారు. శుభకార్యాల నిమిత్తం డబ్బు ఎక్కువగా వయమౌతుంది. మీకు మంచి ఆలోచనలైతే వుంటాయిగానీ వాటిని అమలులోకి తేవడం కష్టమౌతుంది.
- నవంబర్: ప్రముఖులతో పరిచయాలు పర్ణడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. మీ వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. కుటుంబ విషయాల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోగలరు. పనిభారం మిమ్మల్ని సతమతం చేస్తుంది.
- డిసెంబర్: అవకాశాలు దండిగా వస్తాయి. ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు చేయాల్షివుంటుంది. ఆదాయం బాగానే వుంటుంది. కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అందర్నీ కలుపుకొనిపోయే నైజం మీకు చాలా ఉపయోగపడగలదు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగే సూచనలు స్పష్టంగా కన్చిస్తున్నాయి.