సింహ రాశి
- ఆదాయం 2, వ్యయం 14
- రాజపూజ్యం 2, అవమానం 2
మీ పేరులోని మొదటి అక్షరం మా, మీ, మూ, మే, మో, టూ, టి, టే - లలో అయిననూ, లేక మీరు మఖ 1, 2, 3, 4, పాదాలు; పబ్బ 1,2,3,4 పాదాలు; ఉత్తర 1వ పాదంలో జన్మించివుంటే మీది సింహరాశి.
సింహరాశి వారికి ఈ సంవత్సరము బాగానే వుంటుంది. ఆర్ధికంగా పుంజుకుంటారు. కుటుంబంలో పరిస్టితులుకూడా బాగా మెరుగుపడతాయి. సమాజంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన దానికన్న ఎక్కువ లాభాలే వస్తాయి. జీవిత భాగస్వామి చక్కని సహకారం అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలుకూడా బాగా సాగుతాయి. రాజకీయ నాయకులకు, ఐటి రంగంలోని వారికి, డాక్టర్సు లాయర్లకు మంచి అభివృద్ధి ఎదురు చూస్తోంది. శ్రమ అధికంగా వుంటుంది. నిద్ర కొరవడుతుంది. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పపోవచ్చు.
జనవరి: ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. శుభకార్యం జరుగుతుంది. ఉత్తాహంగా వుంటారు. ఉన్నతస్టాయి వ్యక్తుల పరిచయంవల్ల పనులు సజావుగా పూర్తవుతాయి. వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. కవులకు మెరురైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కాంట్రాక్టర్లుకూడా మంచి కంట్రాక్టులు పొందగలుగుతారు.
ఫిబ్రవరి : ఆర్దికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యకార్వాలు చేపడతారు. వాయిదాపడుతున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మెరురైన ఫలితాలు కలుగుతాయి. ఇంటాబయటా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. ఐనా వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తారు.
మార్చి: ఊహించని విధంగా కొంత సొమ్ము మీ చేతికి వస్తుంది. నూతన వస్తువులు, (బంగారం కొంటారు. విందులలో పాల్గొంటారు. ఆత్మీయులకు సహాయం అందిస్తారు. 90 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చుపెట్టడం సరైన పనికాదని గ్రహంచండి.
ఏప్రిల్: తలపెట్టిన కారాలు పూర్తిచేస్తారు. రాజకీయ నాయకులకు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి, కుటీర పరిశ్రమలు నిర్వహించేవారికి మంచి ఆదాయం వస్తుంది. రాజకీయ నాయకులను ఉన్నత పదవులు అలంకరిస్తాయి. క్రొత్త వ్యక్తులను తొందరగా నమ్మకండి. అలాగే ఆస్పి విషయంలో వ్యర్థంగా నష్టపోకుండా జాగ్రత్త పడిండి.
మే: తలపెట్టిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ధనలాభం వుంది. నూతనవస్తువులు కొంటారు. ఆలయ దర్శనం వుంది. కోర్టుల చుట్టూ తిరిగి అలసట చెందే అవకాశం వుంది. గొడవలు పెట్టుకునే స్వభావాన్ని విడచిపెట్టండి.
జూన్ :భాగస్వామ్మ వ్యాపారాలు సజావుగా సారిపోతాయి. అభివృద్దికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. ఉద్మోగంలో ప్రమోషన్ వస్తుంది. ఇతరుల అభిప్రాయాలు గౌరవిస్తారు. పాత మిత్రులను కలుస్తారు. వాళ్లతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు ఎక్కువౌతున్నా ఏదో విధంగా అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. కుటుంబంలో సభ్యులమధ్య మమతానురాగాలు పల్లవిస్తాయి
జూలై: శ్రమ ఎక్కువగా వుంటుంది. ఆదాయంకూడా బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. కాంట్రాక్టర్లకు మంచి జప్టందాలు కుదురుతాయి. స్తేహితులద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకొని ఆనందిస్తారు. బంధువుల ఇంట్లో జరిగే వేడుకలకు వాజరవుతారు. దైవభక్తి పెరుగుతుంది.
ఆగస్ట్: బంధువులు, సోదరులు సహకరిస్తారు. భవిష్పత్తును దృష్టిలో వుంచుకొని నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యక్తులతో పరిచయం మ్ అభివృద్దికి ఎంతగానో ఉపయోగ పడతుంది. కుటుంబ సభ్యులను సంతోషపరచడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. పనులు బాగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపగలరు.
సెప్టెంబర్: బక తీపికబురు మీ చెవిలో పడుతుంది. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. అలసటగా అనిపించినా ఆనందానికి లోటు వుండదు. చక్కని అవకాశాలు వస్తాయి. వాటిని చక్కగా వినియోగపరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి.
అక్టోబర్ : కుటుంబ సభ్యులతో సరదగా, సంతోషంగా గడుపుతారు. పరిస్థితులు ప్రోత్సాహ కరంగా వుంటాయి. ఆస్తుల వ్యవహారం బక కొలిక్కివన్తుంది. వృత్తిపరమైన బాథ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతనత్వాన్ని కోరుకుంటారు. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వుండండి. అందర్నీ తొందరపడి నమ్మేయడం తెలివైనపని కాదు. పరాయి స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి.
నవంబర్ : బంధుమిత్రులను కలుసుకొని ఆనందిస్తారు. దూరప్రాంతంనుండి వచ్చే జక వార్త మీ మనసును ఆనందంతో నింపేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పలు తీరుస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ప్రత్యేకించి విద్యార్దులకు ఈ నెల మరింత బాగుంటుంది.
డిసెంబర్ : తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, తత్సలితంగా శరీరం అలసిపోతుంది. అందువల్ల ఆరోగ్యంమీద టీ కన్నేసి ఉంచండి. ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురౌతాయి. మీ తరపున ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. నిలిచిపోయిన పనులు మెల్లగా మొదలౌతాయి.