Mithuna Rasi Phalaalu |
మిథునరాశి
- ఆదాయం 5, వ్యయం 5
- రాజపూజ్యం 3, అవమానం 6
మీ పేరులోని మొదటి అక్షరం కా, కి, కృ, కు, జ, జ్ఞా, చ, కే, కో,హ - లలో ఓకటి అయిననూ, లేక మీరు మృగశిర 3,4 పాదాలు; ఆరుద్ర 1,2,3,4 పాదాలు; పునర్వసు 1,2,3 పాదాలలో జన్మించివుంటే మీది మిథునరాశి.
మిథునరాశి వారికి ఈ ఏడు తొలి అర్ధభాగంలో మిశ్రమ, సామాస్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారికి ఈ యేడు సోదరుల సహకారం అందుతుంది. కోర్టు వ్యాజ్యాలు పరిష్కారం కాగలవు. ఆకస్మిక దూరప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు చక్కగా రాణిస్తారు. ఐ.టి. రంగంలో వుండేవారికి కూడా ఈయేడు చాలా బాగుంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు. శారీరక శ్రమ ఎక్కువగా వుంటుంది. రావలసిన బకాయిలు సరిగా వనూలు కాకపోవచ్చు. ఆదా యం సంతృప్తికరంగానే వున్నా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. సంవత్సరపు ద్వితీయ అర్ధభాగంలో పరిస్థితులు చాలా మెరుగుపడతాయి.
- జనవరి: వ్యాపారాలు జోరుగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులు లబిస్తాయి. మంచి గుర్తింపు ఫస్తుంది, దానధర్మాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేపడతారు. స్పెక్కులేషన్లు లాభిస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారితో సౌమ్యంగా మాట్లాడగలరు. బంధువులతో మనస్పర్థలు ఏర్పఢవచ్చ.
- ఫిబ్రవరి : ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యవహారాలు ఊపందుకుంటాయి. పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నం తీవ్రమౌతుంది. ఆలయాలు దర్శిస్తారు,
- మార్చి: పాతమిత్రులను కలుస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు వున్నాయి. ఇల్లు సందడిగా వుండబోతోంది. నూతన వస్తువులు కొంటారు. ఓ ఆకస్మిక ప్రయాణం మీకెంతో ఆనందాన్ని తెచ్చుపెడుతుంది. రైతులకు మంచి లాభాలు వస్తాయి. రాజకీయవేత్తలకు బాగుంది.
- ఏప్రిల్: పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. విందులలో పాల్గొని సందడి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో మోసపోకుండా మెలకువతోనూ పై అధికారులతో పేచీలు రాకుండా జాగ్రత్తగా మెలగండి.
- మే: అదృష్టం కలిసొస్తుంది. ఎంతో కాలంగా ఆగిపోయివున్న పనులు మళ్ళీచకచకా సాగుతాయి. నూతన మార్గాలద్వారా ఆదాయం అభిన్తుంది. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. కళాకారులకు, కవులకు గుర్తింపు దక్కుతుంది. విద్యార్థులు రాణిస్తారు.
- జూన్ : ముఖ్యమైన వ్యక్తులు పరిచయమౌతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. బంధువుల నహకారం లభిస్తుంది. కుటుంబంలో ప్రేమమయ వాతవరణం నెలకొంటుంది. ఉన్నతాధికారులు కొంచెం ఇబ్బంది పెడతారు. చికాకుగా వుంటుంది. కొన్ని పనులు వాయిదాపడతాయి.
- జూలై: ఆస్తి తగాదాలు కొలిక్కినస్తాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఆదాయం బాగానే వుంటుంది. మానసికంగా, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందివస్తాయి. సొంతగా ఇల్లు కట్టుకునే విషయం ఆలోచిస్తారు.
- అగష్టు: ధనలాభం కలుగుతుంది. ఇతరులకు ఉపకారం చేసి మంచి వ్యక్తిగా పేరు సంపాదిస్థారు కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ఇంట్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తగలవు. ఎవ్వర్నీ తొందరపడి నమ్మకండి. ఇష్టస్త్రీతో మృదువచనములు, సంతోషముగా, ఉల్లాసముగా వుంటారు.
- సెప్టెంబర్ : పై అధికారులవలన ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతాయి. ఇతరుల కోపానికి గురికాగలరు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించగలరు. నిద్రలేమి మిమ్మల్ని బాధించగలదు. ప్రతీ విషయంలోను ఆచితూచి వృవహరించచడం మంచిది. కొన్ని పనులు వాయిదాపడతాయి.
- అక్టోబర్ : అనిశ్చితి కొనసాగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడంవల్ల కొంత ధననష్టం జరుగుతుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగానే వుంటుంది. నెల ఆఖర్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కోర్టు కేసులు పరష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి.
- నవంబర్ : ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ధకాలిక సమస్యలు మరుగున పడిపోతాయి. శత్రు భాదలు కూడా తగ్గిపోతాయి. పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సొంతయిల్లు కట్టాలని ఆలోచిస్తారు. .
- డిసెంబర్ : పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయి. అన్ని విధాలుగౌ అభివృద్ధి చెందుతారు. . నూతన వస్తువులు, స్వర్ణాభరణాలు కొంటారు. కుటుంబంలో సుఖశాంతులు తాండవిస్తాయి. వ్యాపారాలు మంచిలాభాలు తెచ్చిపెడతాయి. శత్రుబాధలు సమసిపోతాయి. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తరువాతి పుట » కర్కాటక రాశి..