కర్కాటక రాశి
- ఆదాయం 14, వ్యయం 2
- రాజపూజ్యం 6, అవమానం 6
మీ పేరులోని మొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డూ, డే, డో, - లలో అయిననూ, లేక మీరు పునర్వసు 4వ పాదం; పుష్యమి 1,2,3,4 పాదాలు; ఆశ్లేష 1, 2, 3, 4 పదాలలో జన్మించివుంటే మీది కర్కాటక రాశి.
కర్కాటకరాశి వారికి ఈ సంవత్సరం సామాన్య మిశ్రమ ఫలితాలు కన్పిస్తున్నాయి. ఈ రాశికి చెందినవారు. తమ సోదరులనుండి, ఇతరులనుండి చక్కని సహాయము, సహకారం పొందగలరు. తల్లి తరఫు ఆస్తిపాస్తులు వస్తాయి. డాక్టర్లు, లాయర్సు, ఫ్యాన్సీ, కిరణా వ్యాపారస్థులు మంచి లాభాలు చూస్తారు. రాజకీయ నాయకులు, ఐ.టి. రంగ నిపుణులు బాగా రాణిస్తారు. ఈ రాశివారికి ఈ ఏడాది కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు వున్నాయి. పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమ అధికంగా వుంటుంది. ఆరోగ్యంకూడా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించడం ఎంటైనా అవసరం.
- జనవరి : మిమ్మల్ని అర్ధం చేసుకునే వ్యక్తులు పరిచయమౌతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. కావలసిన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. తలపెట్టిన పనులు పూర్తి కాగలవు. ఇతరుల సహాయం కోరడం తపష్టకపోవచ్చ. శారీరక శ్రమ అధికంగా వుంటుంది.
- ఫిబ్రవరి: ఆర్థికంగా బాగానే వుంటుంది. వ్యాపారాలు బాగానే సాగుతాయి. బకట్రెండు ఇబ్బందులు ఎదురైనా పనులు ముందుకు సాగుతాయి. ఖర్మలు ఎక్కువౌతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయభేదం ఏర్పడకుండా చాకచక్యంగా వ్యవహరించగలరు. అలాగే తొందరపడి కొత్త వ్యక్తులను నమ్మకండి.
- మార్చి: రావలసిన పైకం అందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. సంతృప్తిగా ఉంటుంది. ఖర్చలుమాత్రం అదుపుతప్పతాయి. అపరిచిత వ్యక్తులతో దూరంగా వుండడం మేలు. ఫై అధికారులవల్ల ఇభ్బిందులు ఎదురుకాగలవు.
- ఏప్రిల్: పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. బాకీలు రాబడతారు. శుభకార్యం జరుగుతుంది. స్టేహితుల, సన్నిహితుల సహాయ సహకారాలు సమకూరుతాయి. వ్యాజ్యాలు పరిష్కారం కాగలవు. ఉల్లాసంగా వుంటారు. బక విషయం మీ మనసును స్థిమితంగా వుంచదు.
- మే: కుటుంబ సభ్యుల సహకారంతో, బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాలుపంచుకుంటారు. సమయసూర్తి కనబరచి, సందర్భానుసారంగా వృవహరిస్తారు. క్రీడాకారులకి మంచి ప్రోత్సాహం దొరుకుతుంది. విద్యార్థులు చక్కని మార్కులు, ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది.
- జూన్: ప్రయాణాలవల్ల లాభం వుంటుంది. శుభవార్తలు వింటారు. విందులలో పాల్గొంటారు. ఎవ్వరినీ నులభంగా నమ్మవద్దు. ఎక్కువమందితో చనువుగా వుండకండి. అనేకమంది విషయంలో తగు దూరంలోనే వుండడం మంచిది. ఏదో బక విషయంలో మీకు కొరతగా, అసంతృప్తిగా వుంటుంది. కుటుంబ సభ్యులతో స్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త అవుసరం.
- జూలై : గొప్ట వ్యక్తులతో పరిచయం ఏర్చడుతుంది ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్థానచలనం కలిగే అవకాశం వుంది. ప్రయాణాలు లాభించవు. వ్యయప్రయాసలు ఎక్కువగా వుంటాయి. జాగ్రత్త మంచిది. పిల్లల చదువు పరంగా బక నిర్ణయానికి రాలేకపోతారు. సంయమనంతో, సదాలోచనలతో వ్యవహరిస్తే సంతోషానికి కొరత వుండదు.
- ఆగస్ట్: ప్రయాణాలవల్ల ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. బంధుమిత్రుల మథ్య విరిసే ఆప్కాయతానురాగాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. శుభకార్యం చేపడతారు. రైతులకు బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. అదే విధంగా కళాకారులు, చేతివృత్తులవారు. మంచి పురోగతి చూస్తారు. ఆరోగ్య విషయంలో ఏమరుపాటు మంచిదికాదు.
- సెప్టెంబర్: ఆదాయం బాగుంటుంది. రోజులు వేగంగా సాగిపోతాయి. ఏదో బక విషయంలో మిమ్మల్ని అసంతృప్తి వెంటాడుతుంటుంది. కొన్ని ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వుంటుంది. ముఖ్యమైన పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.
- అక్టోబర్: ఎవ్వరితోనూ గొడవలు విరోధాలు ఏర్టడకుండా జాగ్రత్త పడండి. పోరు నష్టం పొందు లాభం అని మరవకండి. సహనాన్ని సంయమనాన్ని కోల్పోవద్దండి. ముఖ్యమైన వ్యక్తుల పరిచయం ఒకింత ఉపకరిస్తుంది. ఆదాయం ఫరవాలేదు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువౌతుంది.
- నవంబర్ : పరిస్టితులు క్రమంగా మెరుగుపడతాయి. ఇంతవరకు సత్తనడకతో సాగుతున్న పనులు కొత్త ఊపవు అందుకుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. పెరిగిన బాధ్రతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు తీవ్రమవుతాయి.
- డిసెంబర్: రావలసిన పైకం సకాలంలో అందుతుంది. తోబుట్టువ్లల తోడ్పాటు దొరుకుతుంది. పనులు చకచకా సాగతాయి. వైద్యులు, విద్శార్డులు, రళాకారులు, చేతివృత్తులవారు తమ తమ రంగాలలో అభివృద్ధి చూస్తారు. ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా మెలకువగా వుండండి. ఇతరుల విషయంలో అనవసరంగా తలదూర్చి లేని పోని తలనెప్పి తెచ్చకోకండి.