గాంధారి |
మహాభారతం - కాందహార్ మధ్య సంబంధం
గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, వాయువ్య పంజాబ్ ఉన్నాయి. మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం. ఇందులో కౌరవ, పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ. ఈ ఇతిహాసం ప్రకారం సుమారు 5500 సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబల రాజు పరిపాలించాడు. అతనికి గాంధారి, శకుని అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె గాంధారీకి హస్తినాపుర రాజ్యానికి యువరాజు అయిన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది.
గాంధారం - కాందహార్
మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే 100 మంది కుమారులు ఉన్నారు. వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. కురు క్షేత్ర యుద్ధానంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా, ఇరాక్‌లకు వలస వెళ్లారు. గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్ గా మారింది. ఇది మాత్రమే కాదు చంద్రగుప్తుడు, అశోకుడు, టర్కీ విజేత తైమూర్ , మొఘల్ చక్రవర్తి బాబర్ లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయిందని చారిత్రిక కథనం.
....SuryaKala