సాలగ్రామంలో ఔషధ గుణం
హిందూ జీవన విధానంలో దేవతార్చన చాలా ముఖ్యమైనది. దేవతార్చన అంటే దేవాల యాల చుట్టూ తిరగడం కాదు. ప్రతి హిందువు తన ఇంట ఒక దైవ మందిరం ఏర్పరచుకోవాలి. ఈ రోజుల్లో ఇంట్లో ఇంటీరియర్స్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. కాని దేవుడికి స్థానం ఇవ్వడం లేదు. దైవమందిరం మన ఇంట్లో ఉంది అంటే, భగవంతుడు మన ఇంట్లో ఉన్నట్లే భావించాలి. మనం చేసే ప్రతి పనికి దైవమే సాక్షి. అందుకే మనం మంచి పనులు చేయాలి. మనిషిలో ప్రాణం ఉంది, చూపించగలమా? బాక్టిరియా కంటికి కనపడదు, అంతమాత్రాన లేదా? కరోనా సమయంలో జీవ సాంకేతిక నిపుణులు దీన్ని రకరకాలుగా చూపించారు. భగవంతుడు కూడా అంతే. ‘‘చూట్టూ గాలి ఉంది, దాన్ని ఫ్యాను రూపంలో బంధిస్తే గాలి ఉందంటున్నాం, అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ఒక చోట కేంద్రీకరిస్తే అది దేవాలయం అయింది’’ అంటారు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారు. ‘భగవతుడున్నాడా నువ్వు చూశావా’ అని నరేంద్రుడు అనేక మందిని అడిగాడు. రవీంద్రనాథ్ ఠాగూరు నాన్నగారు దేవేంద్రనాథ్ ఠాగూరును కూడా అడిగారు. ‘ఉన్నాడు, నేను చూడలేదు. కాని నువ్వు చూడగలవు’ అని ఆయన సమాధానమిచ్చారు.
Shaligram |
తరువాతి కాలంలో ఆయన గురువు శ్రీరామకృష్ణ పరమహంస గంగానదికి తీసుకు వెళ్ళి నరేంద్రుడి తలను నీళ్ళలో ముంచి ` కొంతసేపు ఉంచారు. నరేంద్రుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ తరువాత తలను పైకితీసి ` ఇలా తపిస్తే దేవుడు కనపడతాడు అని చెప్పాడు. భక్తి అనేది ఓ మానసిక పరిపక్వత. అంతా భగవంతుడిదే (రామమయం) అని భావించి వర్తించడమే అందుకు ప్రాథమికంగా కావాల్సిన అర్హత. అందుకే బుద్ధికి తోచిన కర్మచేసే కర్మసిద్ధాంతంవైపు నుంచి జ్ఞాన సిద్ధాంతంవైపు జనాన్ని నడిపించేందుకు శంకరులు సిద్ధమయ్యారు. పంచాయతన పద్ధతి ప్రవేశపెట్టారు. శివుడు, విష్ణువు, శక్తి గణేశుడు, సూర్యుడు ఈ ఐదుగురు దేవతలను పూజించే విధానం అనమాట.
హిందువుల్లో నాస్తికులు కూడా ఉండడం చూస్తాం. నాస్తికుడైన సూర్యుడిని పూజించడాన్ని ఒప్పుకోవాలసిందే. ఇతర మతాలలో లేని నాస్తిక వాదం హిందువులోనే కనపడుతుంది. కారణం మన జీవనవిధానం ఆ స్వేచ్ఛనిచ్చింది. అంత మాత్రం చేత నాస్తికవాదం పేర హిందూ దేవదేవతలను దూషించనక్కరలేదు. ఇలాంటి వారి పట్ల ఊదాశీనంగా ఉండడమే ఇవాళ హిందువుల అస్తిత్వానికి సవాలయింది. దేవతార్చనకు మందు స్నానమాచరించడం, తరువత పట్టు వస్త్రం దరించడం ` ఇదొక శ్రద్ధకు సంబంధించిన విషయం. మనల్ని పూజవైపు దృష్టి మళ్లించేలా చేస్తుంది. అందరికీ పట్టు వస్త్రాలు లేకపోవచ్చు. శుభ్ర వస్త్రం అయినా సరే. పూజలో మనం చేసే ఘంటానాధం చెవి మీద దానికి సంబంధించిన నములపైన మంచి ప్రభావం చూపిస్తుంది. చెవి మన పంచేంద్రియాలలో ఒకటి. అభిషేకం కోసం వాడే పంచామృతములలో ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కర, తేనెలతోపాటు అరటిపండు, టెంకాయ నీరు ఉంటాయి. అభిషేకం తరువాత దాన్ని సేవిస్తే ఇది అమృతమైన ఆహారం. పెద్దపెద్ద దేవస్థానాల్లో అర్చకులు దీన్ని రోజు సేవిస్తారట. అందుకే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అరటిపండు, కొబ్బరినీరు క్యాన్సరుకు, పెరుగు హృదయ రోగముల నివారణకు, ఆవుపాలు ధారణ శక్తికి (ఇంకా అనేక ఉపయోగములున్నాయి), నెయ్యి జ్ఞాపకశక్తికి, బలానికి, ఆయువు కోసం, కండపుష్టికి, తేనె దగ్గుకు, పైత్యానికి, రక్తవృద్ధికి ఉపయోగపడతాయి. దేవానామాజ్యమాహారం అని స్మృతివచనం. దేవతలకు కూడా నెయ్యి మంచి ఆహారం. అందుకే యజ్ఞయాగాది క్రతువులలో నెయ్యిని వాడతారు. తీర్థం తీసుకునేముందు చెప్పే మంత్ర ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణంÑ సమస్త పాపక్షయకరం.. పాదోదకం పావనం శుభం’ అంటారు. అదొక విశ్వాసం. అటువంటి జీవితం కోసం చేసే సంకల్పం అందులో ఓ నమ్రత ఉంది, నమ్మకం ఉంది.
దేవతార్చన కోసం మన దైవసన్నిధానంలో సాలగ్రామాన్ని ఉంచాలి. ఇదొక శిలా జాతికి చెందినది. నర్మదానదివద్ద, నేపాలులోని గండకా నది తీరములో ఇది దొరుకుతుంది. దీనికి ఔషధ గుణముంటుంది. అందుకే సాలగ్రామాన్ని అభిషేకించిన జలం మనం తీర్థంగా స్వీకరిస్తాము. అభిషేకము కూడా శంఖముతో చేస్తారు. శంఖమునుపయోగించడం మన పూజలో భాగం. తులసితో కూడిన సాలగ్రామ తీర్థమును శంఖము ద్వారా స్వీకరిస్తే చాలా రోగుములు పోతాయని పరమ పురుష సంహిత చెప్పింది. శంఖ ధ్వని కూడా విశిష్ఠమైనది. జగదీశ్చంద్ర బోస్ తన ప్రయోగాల ద్వారా శంఖనాదము వినబడినంత మేర విషక్రిములు నశిస్తాయని ఋజువు చేశారు. గంధము రాగద్వేషములను చెడు వాసనలు రాకుండ ఉండేందుకు, మరల పుట్టుక చావు ఉండకూడదను భావనతో అక్షతలు పూజలో వాడతాము.
పూజకు వాడే తులసి, మరేడు, కమల, మల్లి, విరజాజి, చెంగల్వ, చేమంతి, తామర, నంది వర్ధనము, పారిజాతం, మందారం, సంపెంగ మరువము, దవనము – అన్నింటిలో ఔషధిగుణాలున్నాయి. ధూపానికి వాడే సాంబ్రాణి, హారతిలో వాడే కర్పూరం సూక్ష్మ క్రిములను పోగొట్టేందుకు ఉపకరిస్తాయి. ఒక ఆరోగ్యవంతమైన, అహ్లాదమైన వాతావరణంతో దేవతార్చన సంపన్నమవుతుంది.
___vskandhra