గురువు |
గురువు యొక్క పాత్ర
గురు గీత (17వ శ్లోకం)లో గురువును “చీకటిని పారద్రోలేవాడు” (గు, “చీకటి” మరియు రు, “తొలగించేవాడు”) అని సముచితంగా వర్ణించబడింది.
నిజమైన, దివ్య జ్ఞానసంపన్నుడైన గురువు, తాను స్వీయ-నియంత్రణ సాధించడం వలన, సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకత్వము అనుభూతము చెందినవాడు. అటువంటి గురువు సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అతని లేదా ఆమెను పరిపూర్ణత వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అర్హత కలవాడు అవుతాడు.
గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు పరమహంసగారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.”
గురువు దైవముతో సమానము.
హిందూ ధర్మం సూచించిన గురువులు వేదమును అధ్యయనము చేయు వాడు, వేదమును భోదించు వాడు, వేదములోని సందేహములను తీర్చు వాడు, మంత్రమును ఉపదేశించు వాడు, మంత్రమును వ్యాక్యానించు వాడు, శాస్త్రమును భోదించు వాడు, ధర్మమును బోధించు వాడు, నీతి శాస్త్రమును భోదించు వాడు, వ్రతమును ఉపదేశించిన వాడు, భయము నుండి కాపాడిన వాడు, అన్నము పెట్టిన వాడు, సంస్కరించిన వాడు, ఉపనయనము చేయించిన వాడు, తల్లి, తండ్రి, పెద్దన్న, మేన మామ, కన్యాదానము చేసిన మామ వీరందరూ గురువులే అని ధర్మశాస్త్రం చెప్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు