ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం |
ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
- 16 అంకురార్పణం
- 17న ధ్వజారోహణ,
- 18న స్వామి వేణు గాన అలంకారము
- 19న వటపత్ర సాయి అలంకారం
- 20న నవనీత కృష్ణా అలంకారము
- 21న మోహిని అలంకారము
- 22న శివధనుర్భంగాలంకారము
అలాగే అత్యంత విశిష్ఠమైన స్వామి కళ్యాణం ఏప్రిల్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలతో పాటు కోదండరామ స్వామి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైనన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, భక్తులను అనుమతించాల్సిన విధానం, తాగునీరు, అన్నప్రసాదాల వితరణ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. వీటితో పాటు పలు ఆధ్యాత్మిక భావనను ఉట్టిపడేలా పలు కళాఖండాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.