UAEలో BAPS దేవాలయం |
ఈ ఆలయాన్ని చూసేందుకు వచ్చిన వారికి దుబాయ్లో ఘనస్వాగతం పలికారు. అందరి మెడలో దండలు వేసి ఘనం స్వాగతం పలికారు. ఈ సమయంలో BAPS ఆలయ ప్రాజెక్ట్ అధిపతి, స్వామి బ్రహ్మవిహారిదాస్ కూడా ఇక్కడ ఉన్నారు. BAPS దేవాలయం UAEలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం. అద్భుతమైన నిర్మాణం, శిల్పకళలతో ఇది చూడటానికి చాలా అందంగా ఉంది.
స్వామి బ్రహ్మవిహారిదాస్ చారిత్రక ప్రాధాన్యతను తెలియజేశారు
స్వామి బ్రహ్మవిహారిదాస్ ఆలయ చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ ప్రక్రియ గురించి రాయబారులందరికీ చెప్పారు. యుఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్ అతిథులు ఆలయాన్ని సందర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇలాంటి దేవాలయ నిర్మాణం అసాధ్యమనిపించినా ఇప్పుడు ఈ కల సాకారమయ్యే సమయం దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
UAEలో BAPS దేవాలయాన్ని సందర్శించిన 42 దేశాల దౌత్యవేత్తలు |
రాయబారులు ఆలయాన్ని కొనియాడారు
ఈ సందర్భంగా నేపాల్ రాయబారి తేజ్ బహదూర్ ఛెత్రి ఆలయాన్ని ప్రశంసించారు. ఈ ఆలయం ప్రజలకు ప్రేమ, సామరస్యం, సహనం గురించి బోధించే స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ దేవాలయం రాబోయే తరాలకు మంచి బహుమతిగా నిలుస్తుందని అన్నారు. కెనడా రాయబారి రాధా కృష్ణ పాండే కూడా ఆలయ కళాత్మకతను, రూపకల్పనను ప్రశంసించారు. ఈ దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. దీనితో పాటు, ఆలయ నిర్మాణం అత్యద్భుతం అంటూ కెనడా రాయబారి మహంత్ స్వామికి ధన్యవాదాలు తెలిపారు.
ఏఏ దేశాల నుండి అతిథులు వచ్చారంటే
ఈ ఆలయాన్ని సందర్శించిన రాయబారులు, సీనియర్ దౌత్యవేత్తలు అర్జెంటీనా, అర్మేనియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బోస్నియా, హెర్జెగోవినా, కెనడా, చాడ్, చిలీ, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, యూరోపియన్ యూనియన్, ఫిజీ, గాంబియా, జర్మనీ రాయబారిలతో పాటు సీనియర్ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. అంతేకాదు ఘనా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, మోల్డోవా, మాంటెనెగ్రో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, నైజీరియా, పనామా, ఫిలిప్పీన్స్, పోలాండ్, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, స్వీడన్, సిరియా, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుకె , US, జింబాబ్వే , జాంబియా నుండి రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. రాజకీయ నాయకులందరికీ చిన్నపిల్లల చేతుల మీదుగా అందమైన విగ్రహాన్ని బహుమతిగా అందించారు.
tv9