Syamala Dandakam |
శ్యామలా దండకమ్
కాళిదాసమహాకవి స్వయంగా అమ్మవారిని దర్శించి తన అనుభవాన్ని స్తోత్రరూపంలో చెప్పిన ఒక అద్భుతమైన దండకం శ్యామలాదండకం. సంస్కృతసాహిత్యంలో దండకం అనే ప్రక్రియ ఒకటి ఉంది. మళ్ళీ ఆ దండక ప్రక్రియని దేశభాషల్లోకి తీసుకొన్నవాళ్ళు తెలుగువాళ్ళు మాత్రమే. మనకి అనేక దేవతలపై దండకాలు ఉన్నాయి. ఈ దండకం ఒక గద్యంలా సాగుతూ మంచి ప్రవాహంలా వెడుతూ ఉంటుంది. విక్రమార్కుడు పాలించిన కాలంలో ఉజ్జయినీ నగరంలో జరిగిన ఘట్టం ఇది. ఉజ్జయినీ శక్తిపీఠాలలో ఒకటి. జ్యోతిర్లింగాలలో కూడా మహాకాళేశ్వరుడుగా పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అమ్మవారు మహాకాళేశ్వరీగా ఉంది. కాళిదాసు అమ్మవారిని దర్శించిన ఆలయం గురించి ఇప్పటికి అక్కడివారు చెప్తూ ఉంటారు.
కాళిదాసు జన్మతః పెద్దపండితుడు కాదు. గురుకృపవల్ల అమ్మవారు ఆయన్ని అనుగ్రహించదలచి ఆయన నాలుకపై బీజాక్షరాలు వ్రాసి తన దర్శనాన్ని ప్రసాదించింది. తరువాత ఆయన మహాకవి అయ్యాడు. అమ్మవారు కాళిదాసుకి ఎలాంటి దర్శనం ఇచ్చారో మనకి శ్యామలాదండకంలో కనపడుతుంది. శ్యామలాదేవికి శ్రీవిద్యలో ప్రధాన స్థానం ఉంది. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు "భజేశ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోస్సధా శ్యామావార్తాళీసంసేవ్యాం భవానీ లలితాంబికాం" అని చెప్తారు. శ్రీచక్రంలో అమ్మలలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి ఉంటారు. శ్యామలాదేవిని లలితాసహస్రంలో “గేయచక్రరథారూడ మంత్రిణీపరిసేవితా” (69నామం) “మంత్రిణిన్యస్తరాజ్యధూ:”(786వ నామం) అని రెండుమార్లు ప్రస్తావిస్తారు.
ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి!!౧!!
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ⠺⠟⠞
వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ⠟⠺⠺
స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ⠟⠟⠟
దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణిద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే,
సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే,
శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీనద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే,
కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందేహకృచ్చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే,
ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే భాస్వరే,
వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే,
దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే నిర్మలే,
పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే,
కుంద మందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగకర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే,
కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకహృత్కంథరే సత్కలామందిరే మంథరే, దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నవీరాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే,
రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే,
విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః సత్కృతే,
వాసరారంభవేలాసముజ్జృంభమాణారవిందప్రతిచ్ఛన్నపాణిద్వయే సంతతోద్యద్ద్వయే,
దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీధీసముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే,
హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే,
లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే,
చారుశింజత్కటీసూత్రనిర్భత్సితానంగలీలాధనుశ్శింజినీడంబరే దివ్యరత్నాంబరే,
పద్మరాగోల్లసన్మేఖలాభాస్వరశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే
వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే,
కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే,
నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంజసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే,
దేవ దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని కోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మద్వయే అద్వయే,
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నసింహాసనే,
శంఖపద్మద్వయోపాశ్రితే ఆశ్రితే,
దేవి దుర్గావటుక్షేత్రపాలైర్యుతే,
మత్తమాతంగ కన్యాసమూహాన్వితే,
మంజులామేనకాద్యంగనామానితే,
భైరవైరష్టభిర్వేష్టితే, దేవి వామాదిభిః శక్తిభిస్సంశ్రితే, లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సేవితే,
భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితే,
మాతృకామండలైర్మండితే, యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే,
ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే, ఛందసామోజసా భ్రాజసే,
యోగినాం మానసే ధ్యాయసే, గీతవిద్యానుయోగాతు తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే,
భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే, విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే,
సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే,
సర్వవిద్యావిశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠముల్లోల్లసద్వర్ణరేఖాన్వితం
కోమలంశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకాభం శుకం లాలయంతీ పరిక్రీడసే,
పాణిపద్మద్వయేనాదరేణఽక్షమాలాగుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీ యేన సంచింత్యసే
తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్,
యేన వాత్వం సనాథా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్త్రియః పూరుషాః సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే,
తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,
సర్వతీర్థాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ తత్త్వాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వదీక్షాత్మికే, సర్వ ముద్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వ రూపే, జగన్మాతృకే, హే జగన్మాతృకే పాహిమాం పాహి దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో నమః!!