Ratha Saptami |
రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమనుంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము. సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారు భారతీయులే.
ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామివారినీ పూజించాలి .
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్
రథ సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు పఠించే శ్లోకం
యద్యజ్ఞన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు |
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ ||
రథ సప్తమి నాడు స్నానం వేసేటప్పుడు జిల్లేడు అకు,రేగు పండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జస్మల నుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి.
శ్లోకపఠనం |
ఈ రోజే ముత్తయిదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోము ఈ రోజు మొదలుపెడతారు. ఈ రోజు ఎటువంటి పనులు తలపెట్టిన విజయం చేకూరుతుంది. ఆ రోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు నువ్వులనూనె రాసుకుని రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిన పెట్టుకుని “ఓం సూర్య దేవాయ నమః” అని స్వామి వారిని మనసులో తలుచుకుని స్నానం ఆచరిస్తే కామ క్రోధాది గుణములు అన్ని తొలగుతాయి. జిల్లేడుకు రవి, ఆర్క ఆనే పేర్లు కూడా ఉన్నాయి. సూర్యని కోసం అర్చనలు చేస్తాం కాబట్టి జిల్లేడు ఆకులకు ప్రాధాన్యత వచ్చింది. తరువాత చిక్కుడు ఆకులను రధము ఆకారములో తయారుచేసి ఆవు పాలతో తయారుచేసిన పొంగలిని స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. చిక్కుడు ఆకులో ఉండే పసరు ఆరోగ్యానికి మంచిది.
తిరుమలలో కూడా శ్రీ వేంకటేశ్వరుని రధసప్తమి రోజున మొదట సుర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనం పై ఊరెగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెదసేషవాహన, కల్పవృక్ష వాహన, స్వయంభూపాల వాహనములపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా అదే రోజు చేస్తారు.ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని ఎంతో కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని కనులారా దర్శించుకుని ఆనందపడతారు.
సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం.
సూర్య భగవానుడు |
సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమ భాస్కర
ధివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథమారుఢం సర్వలోక పితామహం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాంపుంజం వాయురాకాశ మేవచ
ప్రభుస్త్యం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూకపుష్ప సంకాశం హరకుండల భూషితం
ఏకచక్రధరం దేవం తం సతూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
శ్రీ విష్ణుం జగతాంనాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతేపుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్చతి ||
ఆదిత్య హృదయం
రచన: అగస్త్య ఋషి
ధ్యానమ్
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 ||
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోஉంశుమాన్ || 11 ||
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోஉదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12 ||
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || 14 ||
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోஉస్తు తే || 15 ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోஉభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||
ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ || 27 ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోஉభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోஉభవత్ || 30 ||
అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||