Ratha Saptami Pooja Vidhanam |
రథసప్తమి షోడశోపచార పూజ
ధ్యానం:
ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి లేకున్నను, క్రియాశూన్యమయినను, నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము.
(పుష్పము చేతపట్టుకొని)
ఆవాహనం:
ఓం ఆదిత్యాయ నమః ఆవాహయామి /
ఆసనం:
ఓం ఆదిత్యాయ నమః పుష్పం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
ఓం ఆదిత్యాయ నమః పాద్యం సమర్పయామి.
(ఉదకమును విడవవలెను.)
అర్ఘ్యం:
ఓం ఆదిత్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
ఓం ఆదిత్యాయ నమః ఆచమనీయం సమర్పయామి.
(ఉదకమును విడువవలెను.)
స్నానం :
ఓం ఆదిత్యాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
పంచామృతస్నానం
ఓం ఆదిత్యాయ నమః క్షీరేణ స్నాపయామి .
(స్వామికి పాలతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః దధ్యా స్నాపయామి .
(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః అజ్యేన్న స్నాపయామి.
(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః / మధునా స్నాపయామి
(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః! శర్కరాన్ స్నపయామి.
(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః - ఫలోదకేన స్నాపయామి
(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః - శుద్ధోదకస్నానం సమర్పయామి.
(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)
వస్త్రం:
ఓం ఆదిత్యాయ నమః - వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం:
ఓం ఆదిత్యాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
ఓం ఆదిత్యాయ నమః గంధం విలేపయామి.
(గంధం చల్లవలెను.)
అక్షతలు
ఓం ఆదిత్యాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు సమర్పించవలెను)
అథాంగపూజ:
ఓం ఆదిత్యాయ నమః - పాదౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - జంఘే పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - జానునీ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - ఊరుం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - గుహ్యం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - కటిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - నాభిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - ఉదరం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - హృదయం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - హస్తౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - భుజౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - కంఠం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - ముఖం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - నేత్రాణి పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - లలాటం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - శిరః పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - మౌళీం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః - అథాంగ పూజయామి.
ధూపం:
ఓం ఆదిత్యాయ నమః - ధూపమాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
దీపం:
ఓం ఆదిత్యాయ నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
నైవేద్యం:
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)
ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
ఓం ఆదిత్యాయ నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
ఓం ఆదిత్యాయ నమః నీరాజనం సమర్పయామి.
అనంతరం ఆచమనీయం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,
త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.
శ్రీ ఆదిత్యాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అర్పణం::
శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //
మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు
శ్రీ ఆదిత్యాయ ప్రసాదం శిరసా గృహ్ణామి //
(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)
తీర్థస్వీకరణం:
శ్లో // అకాలమృత్యుహరణం - సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం - ఆదిత్యాయ పాదోదకం పావనం శుభం //
(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)
శుభం భూయాత్ ..
పూజా విధానము సంపూర్ణం.