ఘనంగా గుడిమెలిగే పండుగ |
మేడారంలో గుడిమెలిగే సమయంలోనే ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు, గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం శుద్ది చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గుడి మెలిగే పండుగతో మేడారంలో మహా జాతరకు తొలి అడుగు పడుతుంది.
సమ్మక్క – సారక్క గద్దెల వద్ద అడవి నుండి తీసుకొచ్చిన ఎర్రమట్టితో అలుకుచల్లి రంగుల ముగ్గులతో అలంకరించారు.. అనంతరం ఆదివాసీ ఆచార సంప్రదాయం ప్రకారం అలంకరణ చేసిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాజాతరకు రెండు వారాల ముందు ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. అసలు జాతర ఫిబ్రవరి 21 నుండి జరుగుతుంది.. కానీ ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం రెండు వారాల పాటు పూజలు నిర్వహించి మాఘశుద్ద పూర్ణిమ నాడు సమ్మక్క సారక్క దేవతలను గద్దెలపై ప్రతిష్టించి జాతర నిర్వహిస్తారు.
G Peddeesh Kumar | Edited By: Jyothi Gadda tv9