Gaumata |
ధార్మిక, సాంస్కృతిక దృష్టితో పరిశీలించినప్పుడు గోపు అనాదికాలంనుండి హిందూ సమాజానికి అత్యంత ప్రీతిపాత్రము, శ్రద్ధా కేంద్రము, పూజార్హము అహింసా ప్రధానమైన మన సంస్కృతికి గోమాత కేంద్రబిందువుగాను నిలిచినట్లు దర్శనమిస్తుంది. అంతేగాక గోవు మన సామాజిక, ఆర్థిక జీవనానికి వెన్నెముకగానూ నిలిచినట్లు బోధపడుతుంది. గోరక్ష గోసేవ, వీటిని మన సామాజిక ఆకాంక్షలలో ఒక విడదీయలేని భాగంగా గుర్తించాము.
చారిత్రిక దృష్టితో పరికించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసనకాలంలోనే కనపడుతుంది. అంతకు ముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని నూట ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. అంతకు పూర్వం అది ఆక్రమించిన దేశాలన్నింటిలోనూ ఆయాదేశాల ధర్మ సంస్కృతులను నాశనం చేయడంలో అది కృతకృత్యమైంది. అయితే ఈ దేశంలో అది పూర్తి సాఫల్యమును పొందనప్పటికీ అందుకోసం అది అన్ని ప్రయత్నాలూ చేసింది. ఇస్లామును మించి ఆంగ్లేయుల కాలంలో విదేశ సంస్కారాలతో ఎదిగిన హిందువులు హిందూ వ్యతిరేకతలో ఇస్లామీ శక్తులకు సహాయకులుగానే నిలిచారు. హిందూ ధర్మ సంస్కృతుల చిహ్నాలైన ఆవులు, దేవాలయాలపైన బరితెగించి సమ్మెట పోట్లు పొడిచారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉన్నది. ఈ యుగంలో గోమాత అత్యంత దయనీయమైన స్థితికి గురియైపోయింది. ఈ నేలపై గోమాతయొక్క రక్తపునదులు ప్రవహింపజేయ బడుతున్నాయి.
ఆంగ్లేయులు గోమాంస భక్షకులు. వారు అవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా కొనసాగించారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలంపై అలికేవారు. కారణమేమంటే ఆ స్థలంలో మరెన్నడూ హిందువు మళ్ళీ దేవాలయం కట్టరాదని, తాము ముట్టడులు జరిపే సమయంలో చేజిక్కిన ప్రాంతంలోని బావులు, చెరువులు, నదులు, కాలువలలో గోవు మాంసాన్ని, రక్తాన్ని కలుపుతూండేవారు. కారణం విధిలేక హిందువులు తమ పాదాక్రాంతం కావాలని, హిందువులు విశేషించి బ్రాహ్మణులు, సాధుసంతుల నోళ్ళలో బలవంతంగా గోమాంసాన్ని కుక్కి వారిని మతాంతరీకరణకు గురి చేస్తుండేవారు. అయితే ఇన్ని ఘాతుకాలకు గురైనప్పటికీ హిందూ సమాజం సదా సర్వదా గోరక్ష కార్యంలో తన ప్రయత్నాలను మానలేదు.