అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్టను యావత్ ప్రపంచం వీక్షించింది. ప్రపంచంలోని హిందూవులంతా సంబరాలు చేసుకున్నారు. అంతలా ప్రపంచంలో హిందూ మతం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని హిందూవులు ఆయా దేశాల్లో కీలక పదవులు పొందుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఎప్పటికప్పుడు హిందూ మతంపై భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఓ ప్రజాప్రతినిధి హిందూమతం ఉన్న అభిమానం, భక్తిని చాటుకున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలిసారి ఇలా జరగడం.
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్ అక్కడి సెనేటర్‌గా (ఎంపీ) ఎన్నికయ్యారు. సెనేటర్‌గా ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలో భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారి వరుణ్ ఘోష్ భగవద్గీతను ఉపయోగించారు. ఆస్ట్రేలియ పార్లమెంట్లో హిందూ మత పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసిన తొలి ఎంపీగా వరుణ్ ఘోష్ అరుదైన ఘనత సాధించారు. చిన్న వయసులో అక్కడి రాజకీయాల్లో ప్రవేశించి నేడు సేనేటర్ గా ఎన్నికయ్యాడు