భౌతిక శరీరం |
యోగులు భౌతిక శరీరంలో ఉండటానికి కారణం:-
ఏ సాధనా స్థితి మన యొక్క విధిని మరియు దాని శుభ మరియు అశుభ ఫలితాలను నాశనం చేయలేదని సత్యం కొంత. వాటి యొక్క వినాశనం ఆనందం ద్వారానే సాధ్యం. మరియు శరీరం ఆనందానికి అవసరం.
భౌతిక శరీరం యొక్క అన్ని ప్రత్యేకతలలో ఇది ఒకటి! అందుకే ఆనందం మహ నిర్వాణం అన్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒకే పని యొక్క శరీరం మాత్రమే కాదు. దానితో పాటు ఆనందమయ కోశం కూడా ఉంది. మన యొక్క సంచిత కర్మల ఫలితాలను లేక విధి కర్మలను ప్రస్తుత శరీరంలో ఆనందిస్తాం లేక అనుభవిస్తాం కొన్ని పనులు కూడా చేస్తాం. దాని ఫలితాలను అనుభవించాలంటే వచ్చే జన్మలో మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకోవాలి. శరీరం యొక్క ధర్మం చాలా సహజమైనది. దానిని అందరూ పాటించాల్సిందే. అది యోగి అయినా, భోగి అయినా, ఉన్నత స్థితిని పొందిన యోగులు తమ సంచిత కర్మ లేక ప్రారబ్థ కర్మ యొక్క శుభ అశుభ ఫలితాలను అనుభవించడానికి లేక శిష్యుల కోసం పరకాయ ప్రవేశం చేయడానికి ఇష్టపడరు. మళ్ళీ తల్లి గర్భంలో జన్మించి భరించి పునర్జన్మ ను అంగీకరించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే వీటి వల్ల ఆధ్యాత్మిక సాధన లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయం కూడా ఆలస్యం అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధన మార్గంలో గందరగోళం, విచలనం సృష్టించడమే కాకుండా, దారితప్పే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే యోగులు తమ ప్రస్తుత శరీరంలోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి హృదయము లో వారి యొక్క భౌతిక శరీరం పట్ల ఎటువంటి అనుబంధం లేక బంధం లేదు.
ఆత్మ శరీరం లో స్థితమై ఉండటం వలన, భౌతిక శరీరం పై సమయం, కాలం, వయసు ప్రబావం చాలా నెమ్మదిగా ఉంటుంది. సంచిత లేక ప్రారబ్థ కర్మ నాలుగు వందల సంవత్సరాల లలో క్షీణించబోతుంటే వారి భౌతిక శరీరం నాలుగు వందల సంవత్సరాల పాటు ఉంటుంది. ఇదే ప్రదాన కారణం.. చాలా అరుదుగా మాత్రమే పరకాయ ప్రవేశం చేస్తారు. వారు అన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా వారు కర్మలకు సాక్షీభూతంగా ఉంటారు. భోగ భాగ్యాలను అనుభవిస్తున్నా కూడా వాటితో అంటిపెట్టుకోకుండా ఉంటారు. లోకంలో జీవిస్తున్నా కూడా లోకంతో ఉండరు. వాస్తవానికి వారు భౌతిక ప్రపంచం లో జీవించి ఉన్నప్పటికీ వారు మరణించినట్లు ఉంటారు. దీనినే ప్రాణం నుంచి విముక్తి చేసి మహనందంలో ఉన్న స్థితి అంటారు.