శివ శక్తి |
ప్రకృతి విజ్ఞానం
యోగ, తంత్ర ఒక శక్తివంతమైన శాస్త్రం మరియు ఆ శాస్త్రం ప్రకారం, విశ్వం యొక్క ప్రధాన బాగంలో ' పరమతత్వం ' అని పిలువబడే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది. సృష్టి సమయంలో, అదే పరమాత్మ రెండు భాగాలుగా విబజించబడి ' శివుడు ' మరి శక్తి అని సూచించబడతారు.
శివుడు అంటే ఏమిటి? శక్తి అంటే ఏమిటి? శాస్త్రీయ దృక్కోణం నుండి పరిశీలిస్తే ఈ రెండూ కాస్మిక్ ఫండమెంటల్ ఎనర్జీకి సంబందించినవి. అసలు మూలం పరమాత్మ ఒక్కడే.
సృష్టి మరియు సృష్టించబడిన వస్తువుల మూలానికి ఏకైక కారణం శక్తివంతమైన శక్తి! ఇది భౌతిక శాస్త్రం యొక్క బావన. అయితే ఇది కొత్త కాదు. నిజానికి, ఈ బావన యొగ తంత్ర శాస్త్రం యొక్క సహకారం. ఇప్పుడు ధ్వని తరంగాలను కాంతి తరంగాలుగా మరియు కాంతి తరంగాలను ధ్వని తరంగాలు గా మార్చడం సులబం అయింది. ఇది భౌతిక శాస్త్రం యొక్క అతి పెద్ద ఏకైక విజయం. కానీ అది కూడా కొత్త లేక అసలైన అని చెప్పలేం. ఎందుకు అంటే పురాతన కాలంలో యోగా మరియు తంత్ర గురువులకు ఈ కళ గురించి పూర్తిగా తెలిసిన విషయమే. యోగా మరి తంత్ర లోని రెండు పదాలకు శ్రద్ద ఉండాలి. మొదటి పదం '' నాద ' మరియు రెండవ పదం ' బిందువు ' యోగ మరియు తంత్ర సాధనలు అన్నీ కూడా ఈ రెండింటిపై ఆధారపడి ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాద తత్వం, బిందువు తత్వం అనేవి ఆ పరమ తత్వానికి రెండు ప్రాధమిక రూపాలు. నాద అంటే ధ్వని మరియు బిందు అంటే కాంతి. నాద తత్వం నుంచి బిందు తత్వం ఉధ్భవించడం యోగ తంత్రోక్తం. ఈ సమయంలో భౌతిక శాస్త్రం ఈ దశలో స్థిరమైన పురోగతిని సాధిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.
పదార్దాలకు సంబంధించి భౌతిక శాస్త్రం యొక్క నూతన బావన శక్తి ఆధారితమైనది. శక్తి రెండు రకాలు - సంబావ్య శక్తి మరియు గతి శక్తి. సైన్స్ బాషలో, ఈ రెండు రకాల శక్తులను వరుసగా స్టాటిక్ ఎనర్జీ మరియు డైనమిక్ ఎనర్జీ అంటారు. స్దిర శక్తి పదార్దమే. డైనమిక్ ఎనర్జీ అంటే విడుదలైన లేక డైనమిక్ ఎనర్జీ కనిపించదు. యోగ తంత్ర స్టాటిక్ ఎనర్జీని ' శివ ' అని మరియు డైనమిక్ ఎనర్జీని 'శక్తి' అని పిలుస్తుంది. దాని ప్రకారం, మొత్తం జీవ ప్రపంచం శివ మరియు శక్తి యొక్క సమన్వయం లేదా కలయిక ద్వారా మాత్రమే సృష్టించబడింది. పైన చెప్పుకున్నట్లుగా , ఈ రెండూ విశ్వం యొక్క ప్రాథమిక శక్తులు.