Ramchandra Paramhans - Head of Ram Janmabhoomi |
మహంత్ రామచంద్ర పరమహంసజీ మహారాజ్ | Ramchandra Paramhans - Head of Ram Janmabhoomi
శ్రీ రాములవారి పరమ సేవకులు పరమహంస మహారాజ్. అయోధ్య ఉద్యమ సమయంలో ఒక సంఘటన… మొదటిసారి సీతామఢి నుండి అయోధ్య వరకు సాగిన రామ-జానకి యాత్ర సమయంలో ప్పుడు పరమహంసగారు శంఖనాదం చేశారు. “ముందుకు సాగండి, గట్టిగా నినదించండి, జన్మభూమి తాళాలు తెరువండి, ఒకవేళా తాళాలు తెరువనియెడలా తను ఆత్మబలిదానం” చేసేసుకుంటానని నినదించారు. . ఈ ఉద్ఘోషణయే ఉద్యమానికి చాలా పెద్ద ఆధారభూతమైనది. పెద్ద సంఖ్యలో జనాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సంత్ సమాజం, అన్ని సంప్రదాయాలలో వారికి విశేష ప్రాధాన్యత ఉన్నది. ఒకసారి పరమహంస గారితో ఉత్తర భారతానికి చెందిన కొద్దిమంది శృంగేరి శంకరాచార్య గారి వద్దకెళ్ళారు. ఉద్యమానికి వారి ఆశీర్వాదం, మార్గదర్శనం, సహకారాన్ని కొరారు.
పరమహంస గారు ఈ విషయాన్ని ఏ విధంగానైతే శ్రీశంకరాచార్యగారి విషయాన్ని ప్రస్తావించారో వాటి ప్రభావంతో శంకరాచార్యులవారికి మేము మీ వెంటున్నమని చెప్పగలిగారు. వారి వాద పటిమ అద్భుతమైనది, తద్వారా వికటించే అంశాలను సునాయాసంగా సరిదిద్దగలిగేవారు. కేంద్రంలో అటల్ బిహారి వాజపేయి గారి ప్రభుత్వం వచ్చాక శిలాదాన విషయ ప్రస్తావన వచ్చింది. పరమహంసగారి దానికి నేతృత్వం వహిస్తు వుండిరి. ఒక రోజూ సాయంత్రం విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ ఒక వేల రామ కార్యం పూర్తికాకపోతే తన ప్రాణాలొదిలేస్తాను అని ఉద్వేగానికి లోనయ్యారు. అప్పుడు ఈ మాటలు అయోధ్యనే కాకుండా మొత్తం దేశాన్నే కదిలించివేసింది. అసలు శిలాదానం వెనుక వారి పెద్ద యోజన ఉండింది. వారు ఒక శిలాదానం చేయబూనిరి, ఒకవేళ వారే తన సంకల్పంలో కాస్త వెనుకంజ వేసి ఉంటే ఈ అంశమప్పుడే అంతంమయ్యుండేది.