Anandeshwar Bhairavnath Temple |
🛕మూడు దశాబ్దాల తర్వాత పూజలు🛕
32 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మా చిన్నతనంలో హవాన్ నిర్వహించడాన్ని చూసాము. ఆ తర్వాత చూడలేదు. ఇంత కాలం తరువాతైన ఈ కార్యక్రమం జరగటం సంతోషం. ఈ రోజు పరిస్థితులు బాగున్నాయి. స్వేచ్ఛగా ఆలయానికి రావడంతో పాటు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. మునపటి భయానక పరిస్థితులు ఇప్పుడు లేవని ఈ సందర్భంగా కాశ్మీరీ పండిట్లు పేర్కొంటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడి గారి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జమ్మూ కాశ్మీర్ లో రోజు రోజుకు మెరుగువుతున్న పరిస్థితులకు ఇలాంటి కార్యక్రమాలు అద్దంపడుతున్నాయి.
వీడియో క్రెడిట్ : PTI (Press Trust Of India)