యోగసాధన |
ప్రకారాంతర కుండలినీ యోగ కథనం:
{ అథయోగం ప్రవక్ష్యామి యేన దేవమయో భవేత్ మూలపద్మే కుండలినీ యావన్నిద్రామితా ప్రియే తావత్ కించిన్న సిధ్యేత్ మంత్రతంత్రార్చనాదికం స్వాపకాలో వామవాహః ప్రబోధో దక్షిణావహః మంత్రిణాం స్వాహకాలే తు జపోఽనర్థఫలప్రదః
ప్రబోధకాలం జానీయాత్ ఉభయోరపి పార్వతీ జాగర్తి యది సాదేవీ బహుభిః
పుణ్యసంచయైః తదా ప్రసాదమాయాంతి మంత్రయంత్రార్చనాదయః
యోగయోగాత్ భవేన్ముక్తిః మంత్రసిద్దిరఖండితా సిద్దే మనౌ పరావాప్తిరితి శాస్త్రస్య నిర్ణయః
జీవన్ముక్తశ్చ దేహంతే పరం నిర్వాణమాప్నుయాత్ సంసారోత్తరణం ముక్తిః యోగశబ్దేన కథ్యతే ప్రాణాయైమైః జపైః యోగైః త్యక్తనిద్ర జగన్మయీ}
తాత్పర్యం:
నేను చెప్పబోయే పద్దతిలో సాధన చేస్తే సాధకుడు దేవమయుడు అవుతాడు. మూలాధార చక్రంలో ఎంత వరకు కుండలినీ శక్తి నిద్రిస్తూ ఉంటుందో అంత వరకూ మంత్ర యంత్రాలను అర్చన చేసినా ఫలితాన్ని పొందలేడు. ఎడమ ముక్కులో, గాలి సంచరిస్తూ ఉండగా నిద్రించడమని, కుడి ముక్కులో గాలి సంచరిస్తూ ఉండగా మంత్రం మేల్కొనడమని భావించాలి. స్వాపకాలంలో అంటే ఎడమ ముక్కులో గాలి సంచరిస్తూ ఉన్నప్పుడు జపం చేసినా ఫలితం లేదు. కుండలినీ యొక్క ప్రబోధకాలాన్ని తెలియాలి. అనేక పుణ్యాల వలన ఆ కుండలినీ మేల్కొంటుంది. మంత్ర యంత్రముల అర్చన ఫలితం ఇస్తుంది. మంత్ర సిద్ది వలన పరబ్రహ్మ ప్రాప్తి. జీవన్ముక్తుడైన సాధకుడు దేహానంతరం పరమ నిర్వాణ లాభాన్ని పొందుతారు. సంసారాన్ని దాటడమే ముక్తి. ప్రాణాయామ, జప, యోగ, యజ్ఞాదుల ద్వారా, కుండలినీ నిద్రను విడిచి పెడుతుంది.