తేనె కన్న తెలుగు మిన్న |
"పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
“ తియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -
”
—చేరువేల భార్గవ శర్మ
“ జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
— వినుకొండ వల్లభరాయడు
“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”
— మిరియాల రామకృష్ణ
.... గౌతమి