Draupadi Murmu who wrote a letter to Prime Minister Modi |
కోట్లాది మంది హిందువుల వందల ఏళ్లనాటి కల నెరవేర సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే అయోధ్యలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న శుభ తరుణాన్ని పురస్కరించుకొని దేశమంతా రామ నామంతో మార్మోగుతోంది.
దేశ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ఎందో ప్రముఖులు అయోధ్య బాట పడుతున్నారు. ఈ మహోన్నత క్రతువు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి ఓ లేఖను రాశారు. అయోధ్య రామ మందిరంలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఈ లేఖను రాసుకొచ్చారు. ఈ లేఖను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండయా ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానికి రాష్ట్రపతి ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నెలకొన్ని పండగ వాతావరణం భారతదేశ ఆత్మను ప్రతిబింభిస్తుందని ముర్ము లేఖలో పేర్కొన్నారు. ప్రభు శ్రీరామ అందించిన ధైర్యం, చేసే పనిపై ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి రాసిన లేఖ..
President Droupadi Murmu writes to Prime Minister Shri @narendramodi on the eve of Pran Pratishtha at Shri Ram Mandir in Ayodhya Dham. pic.twitter.com/r6sXXmdanT
— President of India (@rashtrapatibhvn) January 21, 2024
మనుషుల సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ ప్రేమ, గౌరవంతో చూడాలని ప్రభు శ్రీరామ గొప్ప సందేశాన్ని అందించారని ముర్ము పేర్కొన్నారు. శ్రీరామ ప్రజలకు న్యాయం, సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, ఇది ప్రస్తుతం మన దేశ పరిపాలనలో కనిపిస్తోంది అని అభిప్రాయపడ్డారు. ఇక నరేంద్ర మోదీ చేపట్టిన అనుష్టానం గురించి ప్రస్తావిస్తూ.. ‘మీరు చేపట్టిన 11 రోజుల అనుష్ఠానం ఒక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదు, ప్రభు శ్రీరామునికి త్యాగం, సమర్పణ అత్యున్నత ఆధ్యాత్మిక చర్య’ అని భారత రాష్ట్రపతి తన లేఖలో ప్రస్తావించారు.
President Draupadi Murmu who wrote a letter to Prime Minister Modi |
President Draupadi Murmu who wrote a letter to Prime Minister Modi |
Courtesy : tv9