అయోధ్య రామజన్మభూమి |
1528 – 2024 : అయోధ్య రామజన్మభూమిలో కీలక పరిణామాలు
కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఐదు వందల సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు చోటుచేసుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, మూడు అంతస్థులతో రూ.1100 కోట్ల వ్యయంతో అయోధ్యలో రామాలయం నిర్మించారు.అయోధ్యలో రాములోరిని దర్శించుకునే అపూర్వ ఘట్టం కోసం కోట్లాది మంది దశాబ్దాలుగా ఎదురుచూశారు. వారి నిరీక్షణ ఫలించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేవాలయంలో పత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు.వందలాది మతగురువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ, విదేశాల్లో దాదాపు 150 కోట్ల మంది లైవ్‌లో ఈ కార్యక్రమం వీక్షించారని అంచనా.
1528లో బాబ్రీ మసీదు నిర్మాణంమొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద కమాండర్‌గా చేసిన మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదు నిర్మించాడని చరిత్ర చెబుతోంది.హిందూ దేవాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదు నిర్మించడం వివాదానికి దారితీసింది. దశాబ్దాలపాటు మత ఘర్షణలకు బాబ్రీ మసీదు వేదికగా నిలిచింది. 1751లో మరాఠాల ఆధీనంలోకి అయోధ్య1751 సంవత్సరంలో అయోధ్య, కాశీ, మథుర ప్రాంతాలను మరాఠాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారని భారతీయ జనతా పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు బల్బీర్ పుంజ్ ట్రైస్ట్ విత్ అయోధ్య డీకోలజైనేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో రాసుకొచ్చారు.
1858లో రాముడి జన్మస్థలంగా నిహాంగ్ సిక్కుల డిమాండ్1858వ సంవత్సరంలో నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటాలకు దారితీసింది.1885లో చట్టపరమైన దావా1885 సంవత్సరంలో మొదటిసారిగా కోర్టులో దావా వేశారు. నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్, మసీదు ఆలయ ప్రాంగణంలో రామాలయం నిర్మించేందుకు అనుమతి కోరుతూ దావా వేశారు. కోర్టు ఆ దావాను కొట్టివేసింది. బ్రిటిష్ వారి పాలనలో ముస్లింలు, హిందువులు వేర్వేరుగా ప్రార్థనలు చేసుకునేందుకు ప్రార్థనా స్థలం చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు. దాదాపు 90 సంవత్సరాలు అలాగే కొనసాగింది.
1949 బాబ్రీ మసీదులో రామ్ లల్లా విగ్రహాలు1949 డిసెంబరు 22 రాత్రి బాబ్రీ మసీదు లోపల రామ్ లల్లా విగ్రహాలను ఉంచారు. స్థలం యాజమాన్యంపై న్యాయపోరాటం ప్రారంభించారు. మసీదులో విగ్రహాలు కనిపించాయని ప్రచారం జరిగింది. 1949లో కొందరు హిందువులు కోర్టును ఆశ్రయించారు. 1950 చట్టపరమైన దావాలుఅయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను పూజించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్మోహి అఖారా కోర్టులో దావా వేసింది.ఈ స్థలాన్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది.దీంతో సమస్య మరింత జఠిలమైంది.
1986 బాబ్రీ మసీదు తెరిచారు1986లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు తాళాలు తెరిచారు. లోపల హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించారు. ఆ నిర్ణయం దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 1990లో విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి డెడ్ లైన్ విధించింది. అప్పుడే బీజేపీ నేత ఎల్కే అఢ్వానీ రథయాత్ర ప్రారంభించారు. 1990 రథయాత్రబీజేపీ నేత అఢ్వానీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన రథయాత్ర చరిత్రలో నిలిచిపోయింది.
1992లో బాబ్రీ మసీదును కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. తరవాత దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. 1993,94లోనూ దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది చనిపోయారు. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. 1994లో వివాదాస్పద స్థలాన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. దీన్ని కొందరు ముస్లిం నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేంద్ర నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది.
2002లో అలహాబాద్ కోర్టులో విచారణ అయోధ్యలో రామాలయం ఉందనే విషయాన్ని తేల్చేందుకు భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. 2009లో లిబర్హాన్ కమిషన్ నివేదికబాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్రం నియమించిన లిబర్హాన్ కమిషన్ 16 సంవత్సరాలపాటు విచారించింది. 399 సమావేశాల తరవాత నివేదికను కేంద్రానికి అందజేసింది. 2009లో లిబర్హాన్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఎల్కే అఢ్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మరికొందరి బీజేపీ నేతల పేర్లను ఇందులో చేర్చింది. దాదాపు విచారణ 17 సంవత్సరాలు కొనసాగింది.
2019 సుప్రీంకోర్టు సంచలన తీర్పు
2019లో బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది.
2020లో రామమందిర నిర్మాణానికి పునాదిప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగష్టు 5న సుప్రీంకోర్టు కేటాయించిన స్థలంలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామమందిర నిర్మాణ పనులను చేపట్టింది. దీంతో సుదీర్ఘమైన వివాదాలకు తెరపడింది. 2024 జనవరి 22 అపూర్వ ఘట్టం2024 జనవరి 22 చరిత్రలో నిలిచిపోయింది. అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇనుము, ఉక్కు, సిమెంటు వాడకుండా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ద్వారా పాలరాతితో రూ.1100 కోట్ల వ్యయంతో అయోధ్యలో రామాలయం పూర్తి చేశారు. రేపటి నుంచి భక్తులను అనుమతించనున్నారు.
Courtesy : vskteam