కృష్ణార్జున |
భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు
రచన: అంబడిపూడి శ్యామసుందర రావు
ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు. కలి యుగములో సంభవించబోయే పరిణామాలను వివరిస్తాడు. ద్యాపర యుగము ముగిసి కలియుగము త్వరలోనే మొదలవుతుంది అని ముని వారికి వివరిస్తాడు.
- కలియుగములో జనులు అలవోకగా ఏమాత్రము జంకు లేకుండా అబద్దాలు ఆడటం ప్రారంభిస్తారు.
- కర్మకాండలు, దానధర్మాలు వారే స్యయముగా జరపకుండా వారి ప్రతినిధులచే జరిపించుకుంటారు.
- ప్రస్తుతము మనము బ్రాహ్మణుడు జపతపాలు చేస్తుంటే మనము “మమ”అనుకుంటూ క్రతువులను పూర్తిచేస్తున్నాము.
- బ్రాహ్మణులు శుద్రులు చేసే పనులు చేయటము ఆరంభిస్తారు.
- శుద్రులు ధనసంపాదనలో పడతారు.
- క్షత్రియులు క్షాత్ర ధర్మాన్ని విడిచి మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమవుతారు.
- బ్రాహ్మణులు వేదాలను అభ్యసించటం మాని సర్వభక్షకులుగా (మాంసాహారము, శాఖాహారము రెంటిని తింటూ) మారుతారు.
- శుద్రులేమో పూజలుపునస్కారాలో నిమగ్న మవుతారు.
- ఈ విధముగా ప్రపంచము అంతా తల్లక్రిందులుగా నడుస్తుంది. అంటే ఎవరు వర్ణ ధర్మాలు ఆచరించరు ఇవన్నీ వినాశనానికి గుర్తులు.
- అనేకమంది దుర్మార్గులు రాజ్యాలు ఏలుతారు. వారి తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు.
- ప్రజలు ఏవైతే పనులు చేయకూడదో ఆ పనులు చేస్తారు.
- చిన్న వయస్సులోనే మరణాలు సంభవిస్తాయి.
- శారీరకముగా బలహీనులుగా ఉండి శక్తివిహీనులుగా ఉంటారు.
- నిజము చెప్పరు.
- మానవుల జనాభా క్రమముగా తగ్గుతుంది జంతువుల సంఖ్య పెరుగుతుంది.
- ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తాయి.
- జాతుల మధ్య వైరములు పెరుగుతాయి పనిపాటలు చేసుకునే వారు చదువుకున్న వారిని వారి పేర్లతో సంభోదిస్తారు.
- చదువుకున్నవారు పనివారిని “అయ్యా”అని సంభోదించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.
- ఆహారానికి సువాసన రుచి వంటి లక్షణాల గురించి పట్టించుకోరు.
- ఆడవారు మంచి నడవడిని కోల్పోతారు.
- కరువునాటకాలు ఎక్కువ అవుతాయి.
- కూడళ్లలో వ్యభిచారులు ఎక్కువ అవుతారు.
- ఆడవారు చాలా మటుకు అణుకువను కోల్పోతారు.
- పాలఉత్పత్తి తగ్గుతుంది,
- పూలు తక్కువగా పూస్తాయి.
- విజ్ఞులను మేధావులను చంపిన వారిని అబద్దాలకోరులైన పాలకులు సత్కరిస్తారు ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
- బ్రాహ్మణులు వ్యాపారాలలో దిగి ఆస్తులు సంపాదించుకుంటారు.
- చాలామంది డబ్బుమీద ఆశతో దొంగ సాధువులు సన్యాసులుగా మారి చేయకూడని పనులను చేస్తారు. అంటే సురాపానం వేశ్యా సంపర్కము వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.
- ఆశ్రమాలు ఆశ్రమాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారతాయి.
- మనము ప్రస్తుతము చూస్తున్నది ఇవే. వర్షాలు సకాలములో పడక పంటల సరిగా పండవు.
- మనుషులు క్రూరముగా ఆలోచిస్తూ క్రూరమైన పనులు చేస్తారు.
- పగప్రతీకారాలలో ఆనందాన్ని అనుభవిస్తారు.
- భూమి అంతా పాపముతో నిండిపోతుంది.
- సత్పురుషులు ఎక్కువకాలం బ్రతకరు.
- చాలామంది ధనాన్ని అక్రమ మార్గాల్లో సంపాదిస్తారు.
- మంచివాడు సుఖముగా బ్రతకలేడు దొంగలు మోసగాళ్లు దుర్మార్గులు హాయిగా బ్రతుకుతారు.
- ప్రజలు బహిరంగ ప్రదేశాలలో కూడా అసభ్యముగా సంచరిస్తారు.
- వారు అనుకున్నది సాధించటానికి తప్పుడు మార్గాలను అవలంభిస్తారు.
- ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవటానికి ప్రజా ధనాన్ని దోచుకోవటానికి వెనుకాడరు.
- అడిగినా నిస్సుగ్గుగా తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తారు.
- జనసంచారాలలో దేవాలయాలలో జంతువులు పక్షులు, పాములు వంటివిదర్శనమిస్తాయి.
- ఆడపిల్లలు చిన్నవయస్సులోనే గర్భవతులవుతారు, అలాగే చిన్నవయసు బాలురు తండ్రులవుతారు. యుక్త వయస్సు నాటికి జనులు బలహీనులవుతారు వారి ఆయుప్రమాణము తగ్గిపోతుంది.
- యువకులు ముసలివారుగాను ముసలివారు యువకులుగా(కృత్రిమ వేష ధారణతో) ప్రవర్తిస్తారు.
- భార్యలు నీతి తప్పి భర్తలు బ్రతికి ఉండగానే పరపురుషులతో సంభంధము పెట్టుకొని భర్తలను మోసగిస్తుంటారు.
- ఈ విధముగా క్రమముగా నీతి సన్నగిలిపోవటము జరుగుతుంది అని మార్కండేయ మహాముని ధర్మరాజు మరియు ఇతరులకు వివరిస్తాడు.
- మనము ప్రస్తుత సమాజాన్ని గమనిస్తే అవన్నీ నిజాలే, అక్షరాలా జరుగుతున్నాయని గమనించవచ్చు.
- ప్రస్తుతము మనము కలియుగములోని ప్రధమ పాదములోనే వీటిని గమనిస్తున్నాము.
- యుగధర్మాన్ని అనుసరించి నైతిక విలువలకు అర్ధాలు మారుతున్నాయి
- ద్వాపర యుగాంతానికి కురుక్షేత్ర యుద్ధము జరిగి ధర్మము రక్షింపబడింది.
- అలాగే కలియుగములో కూడాపాపము పెరిగి కలియుగములో నాలుగు పాదాలు పూర్తి ఆయేనాటికి భగవంతుడు మళ్లాఅవతారము ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు అని హిందువుల ప్రగాఢ నమ్మకము
- బ్రహ్మముగారి తత్వాలలో కలియుగ అంతానికి కొన్ని లక్షణాలు చెప్పారు.
- యాగంటిలోని బసవన్న(రాతి విగ్రహము) లేచి రంకె వేస్తుందని, కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పూడకను తాకుతందని ఇలా కొన్ని లక్షణాలను తెలిపాడు ఇంకా ప్రధమ పాదములోనే ఉన్నాము కాబట్టి ఆ లక్షణాలు చూడటానికి చాలా కాలము ఎదురుచూడాలి.