shiva kesava |
శ్లో. న కార్తిక నమో మాసో - న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం - న దేవః కేశవాత్పరః. ||
తే.గీ. కార్తికము మించు మాసము కనఁగ లేదు.
వేదమును మించు శాస్త్రము లేదు మనకు,
నరయనారోగ్యమును మించు హాయి లేదు,
హరిని మించినదైవంబు నరయ లేడు.
భావాము: కార్తిక మాసముతో సమానమయిన మాసము లేదు. వేదముతో సమానమగు శాస్త్రము లేదు. రోగము లేకుండా ఉన్నదానికి మించిన ఉత్సాహము మరొకటి లేదుకేశవునకు మించిన దైవము మరి లేడు.