Mrigasira nakshatra |
మృగశిరా నక్షత్రము గుణగణాలు - Mrigasira nakshatra :
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంస్థలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు.
అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మముగా న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. సైనికపరమైన, ఆయుధ సంబందిత, విద్యాసంబంధిత ఉద్యోగావ్యపరాలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో రాణిస్తారు. తల్లి తండ్రుల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానమందు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.
తరువాతి శీర్షిక » ఆరుద్ర నక్షత్రము గుణగణాలు