ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిగిఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవగణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు నక్షత్ర అధిపతి రాహువు కనుక విద్యా వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖసంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు.
ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వ్రత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందర పాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందరిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చినా కూడ ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి జీవితంలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
తరువాతి శీర్షిక » పునర్వసు నక్షత్రము గుణాగణాలు