Understanding of Cosmic sexual energy |
శృంగార శక్తిపై సరైన అవగాహన:
ఈ శృంగార శక్తిని సరిగా అర్థం చేసుకోవాలి మనం. శృంగారం ని సరిగా అర్థం చేసుకోకుండా దుర్వినియోగం చేయడాన్ని ఆపలేం. మనం దాని విషయంలో తప్పు చేస్తూనే ఉంటే, అది అతి భయంకరమైన అగ్ని పర్వతంలా మారి మనలోని శక్తులను కాల్చివేస్తుంది. సమస్త మానవాళి దీని చుట్టూ తిరుగుతూ ఉంది. శృంగార శక్తి పరిధికి బయట ప్రపంచంలో ఏం లేదు. సంస్కృతి మొత్తం స్త్రీతో మొదలైంది. శృంగార శక్తి గురించి ఏదో ఒక రూపంలో చర్చించబడని గ్రంథం ఏది!? కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, మతపరమైన పుస్తకాలు మాత్రమే కాదు, మనిషి యొక్క మొత్తం జీవితం - తత్వశాస్త్రం శృంగారం పై ఆధారపడి ఉంటుంది. ఎందుకు!? ఎందుకు అంటే జీవితంలో దాని కంటే ముఖ్యమైన అంశం ఏదీ లేదు. మనిషి మొత్తం ఆత్మలో శృంగారం ఇమిడి ఉంది. ఈ శృంగారం పాత్ర చాలా ఉంది. సంయమనం కలిగిన వ్యక్తికి శృంగారం దుర్వినియోగం గురించి తెలుసు. శృంగారం యొక్క శక్తిని అధ్యయనం చేసిన వారికి తెలుసు. కష్టమైన విషయం కాదు. రహస్యం కూడా కాదు. ఈ విషయం లో విచక్షణతో ఉండేవాడు సరైన దిశలో దీని జ్ఞానాన్ని పొందిన వారు చాలా మంది ఉన్నారు.
మోహంలో ఆకర్షణ ఉంది, ఆ ఆకర్షణ మనల్ని రెండు భాగాలుగా ఆకర్షణ చేస్తోంది. అందులో "అహం" 'నేను' అనే మార్గం ఉంది, అది నేను మాత్రమే!
రెండవ మార్గం "అహం" లేకుండా 'నేను' లేకుండా ఆకర్షణ. ఈ రెండు మార్గాలను సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే! లేక అర్థం చేసుకున్న వ్యక్తి, యోగ మార్గము లేక తంత్ర మార్గంలో నడవడమే మంచిది అని నిర్ణయానికి వస్తాడు. ఎందుకు!? ఎందుకు అంటే 'అహం" లేని చోట కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది. నిరంతరం చలించే సమయం ఎక్కడో వదులుకున్నట్లైతే, అక్కడ మాత్రమే 'సమాధి' స్థితి ఆవిష్కృతం అవుతుంది. ఈ స్థితి యోగాలో లేక తంత్ర మార్గంలో లేక లైంగిక ఆనందం యొక్క ఆఖరి క్షణంలో లభిస్తుంది. సరైన విధంగా శృంగారాన్ని ఆస్వాదించే వ్యక్తి ఆ క్షణంలోనే తక్షణమే ఆనందాన్ని పొందుతాడు...సమాధి కూడా లభిస్తుంది.
శృంగారాన్ని ఆస్వాదించే విషయం లో ఇదే చాలా ముఖ్యమైన క్షణం, ఇందులో చాలా సహజమైన అనుభూతి ఉంటుంది. పైగా దీనికి మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు శృంగారం గురించి సరైన అవగాహన లేకపోవడం బాధాకరం.
చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తులు ఆ ఆఖరి ముఖ్యమైన క్షణంలో కూడా దేన్నీ కూడా పూర్తిగా అనుభవించలేరు. ఎందుకు అంటే వారు ఆనందానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదో కక్కుర్తి పడ్డట్టు ఆ సమయంలో కూడా హడావుడి... బలవంతపు శృంగారం... సేద తీర్చే వస్తువు గా దానిని చూడటమే. ఇది సరైన శృంగారం కాదు. అహంకారం ఎక్కడ నాశనం అవుతుందో అక్కడ సమాధి ప్రత్యక్షం అవుతుంది. మనకు ప్రకృతి ప్రసాదించిన విలువైన వాటిలో శృంగారం ఒకటి...అతి సహజంగా...సమాధి...ఆనందం పొందే ఏకైక మార్గం.. ఆ ఆఖరి క్షణంలో కాలచక్రం ఆగిపోయి ఆనంద కాంతి ఉబికి వస్తుంది. దాన్ని మనలోకి అనుమతించకుండా చూసేది అహంకారం. అహం లేని మార్గం లో జ్ఞానం ఉంది. కాంతి ఉంది. ఆనందం ఉంది. దివ్వశక్తి ఉంది! ఆ మార్గంలో దానిని చూసిన వ్యక్తి ఆత్మను కూడా చూడగలడు. సమాధి లో, పరమాత్మతో ముఖాముఖి ఉంటుంది. దీనిని మోక్షం అనండి లేక ఏ పేరు అయినా పెట్టండి పర్వాలేదు. మొత్తంగా చూస్తే లైంగిక శక్తిని సరైన దారిలో ఉపయోగించండి అని మాత్రమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
By : Shiva Rudra