Shaneswara | Shanidev |
ఆయన ఒక గ్రహము. పరమేశ్వరుని కింకరుడు ఆయన. "శనైశ్చరుడు" సరి అయిన పదం. చాలా మంది శనీశ్వరుడు అంటారు. అది తప్పు. గ్రహములకు ఈశ్వరుని అంత స్థాయి లేదు. ఈశ్వరుని అనుఙ్ఞ మేరకు గ్రహములు మనని ప్రభావితం చేస్తాయి.
హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' , నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితోసంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.
శనీశ్వరుని తల్లిదండ్రులు:
సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.
ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: (शनये क्रमति सः) అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.
శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు:
నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం,నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.
నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.
శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .
శనిత్రయోదశి
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి.సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు,రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులనుకష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడువరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్నిఅందించేవాడు శనేశ్వరుడు.
శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావంవల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవునా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్లఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతోనిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదుఅని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు,మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథివచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానంచేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢవిశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు . శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
- తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాతభోజనాదులను చేయటము.
- ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
- వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
- శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండసంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
- వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
- ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
- ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
శని మహత్యం
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శనికోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగావిక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి,పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక,నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా,విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలోదేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలువర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తిభక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు.అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడినిఅక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు.శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమనిశనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవనిఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదేపదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడనిపురాణాలు తెలుపుతున్నాయి.
శనీశ్వర జపం
శనీశ్వరుడి జప మంత్రాలు
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరుని వలె శనీశ్వరుడు కూడా భక్తుల కోరికలును తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శని గ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని ప్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః - అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చే వారు జనార్దనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట. ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిన నాటి శని ఆరంభమైనట్టే.శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుని అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
శని శింగణాపూర్
అహమద్ నగర్ జిల్లాలో, షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని "స్వయంభు"(సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన అని అర్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు, గురించి స్తలపురాణం ప్రకారం:
పూర్వం, ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని, ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్ర్హాంతి చెంది, భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్వరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట, ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ, ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల, దోంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్వర స్వామిని, గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును.ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!!!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడి నిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.
శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటింది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.
దేవనార్
దేవనారు లోని శని దేవాలయం:
ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం (ముంబై-పూణే-బెంగుళూరు) ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద గోవండి, దేవనార్-చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ ప్రామంతానికి అసలు పేరు "దేవనవరు" అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు శనీశ్వర స్వామి: అందమైన, శక్తివంతమైన, గుబురు మీసాలతో కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం గల భక్తులు, లేదా శని మహర్దశ, ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనె ను అత్యంత భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికి సమర్పించుకుని, శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.
ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో, పూజారి మహా హారతి ఇచ్చిన వెంటనే, పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా, ఆలయంలోవాతావరణం మారుతుంది. పూనకం అంటే మామూలుగా వుండే అరుపులు, ఆర్భాటలు వుండవు. ఆయన కళ్ళు మూసుకుని తన్మయత్వం లోకి (ట్త్రాన్స్) లోకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్కంటభరిత భరిత వాతావరణాన్ని అక్కడ వున్న ప్రతి ఒక్కరు చూడవచ్చు.అనుభవించవచ్చు. ఆ అలయంలోని మిగతా వారు మెల్లగా 'స్వామి ని నడిపించుకుంటూ ' 'మొనలు తేలిన, పదునైన, పొడవాటి మేకులతో చేయబడిన కుర్చీపై కూర్చో పెడతారు . కాళ్ళు మరియు చేతులు ఆనించే స్తలంలో కూడా ఆ కుర్చీకి పదునైన మేకులు బిగించి ఉంటాయి.
స్వామి శరీరంపైకి శనీశ్వరుడు వచ్చినపుడు, ఆయన ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని దాదాపు ఆరోజు మొత్తం ఆ కుర్చీ పైనే కుర్చుని ఉంటాడు. కొన్ని శనివారాలలో ఆయన 12 నుండి 13 గంటల పాటు ఏకధాటిగా ఆ కుర్చిపైన కూర్చున్నా ఎటువంటి బాధ కాని, అసౌకర్యము గాని ఆయన ముఖంలో కనిపించదు.
అటు తరువాత భక్తులు 'స్వామి' ముందు నిశ్శబ్దముగా కూర్చుంటారు. వారు ఒక జత నిమ్మకాయలు చేతిలో ఉంచుకుని, క్యూలో వారి వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ వుంటారు. స్వామి ఒకరి తరువాత ఒకరిని వంతుల వారిగా తన వద్దకు రమ్మని సైగ చేయుగానే, జనం తమ వద్ద ఉన్న పసుపుపచ్చ నిమ్మకాయల జతను ఆయన ముందు ఉంచుతారు. ఆయన వారి సమస్యలు, వేదనలు లేదా క్షోభ లేదా మరేదైనా సరే వారు చెప్పేది ఓర్పుతో వింటారు. ఆ తరువాత ఆయన వారి వేదన/సమస్య/క్షోభలకు గల కారణాలను విసిదీకరించి వివరిస్తారు.. అది వారి 'ప్రారబ్ధం' కావచ్చు, గతంలో చేసిన కర్మలు (పనులు) ప్రస్తుత జన్మలోనకి మోసుకు రాబడి వుండవచ్చు లేదా స్వామి వివరించినట్టుగా, వారి సమస్యలు ఈ జన్మలోనే అతను (లేదా ఆమె) చేసిన పనులు లేదా కర్మల యొక్క ఫలితం కావచ్చు. కొన్ని సందర్భాలలో అది వారి శత్రువులు లేదా చెడు కోరుకునేవారిచే చేయబడిన వామాచార ప్రయోగం కూడా కారణం కావచ్చు.
ఈ శని దేవాలయ ప్రాంగణములో హనుమంతుడు, జగదీశ్వరుడు, సాయిబాబా, మరియు మాత విగ్రహాలేకాక నవగ్రహ మండపం కూడా ఉంది. గర్భగుడిలో జేష్టాదేవి సమేతుదైన శనీశ్వరస్వామి యొక్క విగ్రహానికి ఎడమవైపున హనుమంతుడు కుడివైపున జగదీశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.
ఇతర శని క్షేత్రాలు
శ్రీ శనైశ్చర దేవాలయం మంగళూరు (0824- 2252573) శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ శనైశ్చర దేవాలయంలోని గర్భ గుడిలో గణేశ, దుర్గామాత మరియు శనైశ్చర స్వామి మూర్తులు ప్రతిష్టించ బడివున్నాయి.
శనిగ్రహం దీర్ఘాయువు, దుర్భాగ్యము, దుఃఖము, వృద్ధాప్యం మరియు చావు, క్రమశిక్షణ, నియమం, బాధ్యత, కాలయాపనలు, గాఢమైన వాంఛ, నాయకత్వము, అధికారం, నిరాడంబరత, చిత్తశుద్ధి, అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం, కాదనుట, అనురాగం లేకపోవుట, ఆత్మ స్వరూపత్వం, కష్టించి పనిచేయుట, సంవిధానం, వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది. అసమానమైన లక్షణాలు: అపారమైన శక్తి, చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు..
శ్రీ శనీశ్వర కోవెల తిరునల్లార్:
పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం వుంది. శివుని అవతారమైన దర్బరన్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో, శనీశ్వరుడు, ఒక గోడ గూటిలో కొలువున్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు, శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి భక్తులు ఈ గుడిని దర్శించి, ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి, ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే, శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు, తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు, ఇక్కడి కొలనులో స్నాం చేసి, గుడిలో పూజ చేసిన తరువాత, శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడింది.
శని ధామ్:
శనిధామ్, అని పిలువబడే ఈ ఆలయం చత్తర్ పూర్ కు సమీపమంలో, కుతుబ్ మినార్ నుండి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ, 21 అడుగుల ఎత్తుగల అష్టధాతు మరియు ప్రకృతి సిద్ధమైన రాతితో చేయబడిన శననీస్వరుడి నిలువెత్తు విగ్రహం వుంది. శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు,శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే, కాలసర్పం, సాడేసాతి మరియు దయాళిడికి(శివుడికి)ముఖ్య పూజలు చేస్తారు.
వడ తిరునల్లార్ శనీశ్వర కోవెల:
చెన్నైలో, మాంబళంలో ఉంది.ఇక్కడ శనీశ్వరుడు, సతీ(జేష్టాదేవిని ఇక్కడ నీలాంబికగా పిలవ బడుతూంది)సమేతుడై వెలిశాడు. విగ్నేశ్వరుడు, దుర్గ మరియు పంచముఖ హనుమాను ఉన్నారు.
కుచనూరు:
మదురై దగ్గరలో, కుచనూరులో శనీశ్వరుడు, స్వయంభు సిందూరం రంగు విగ్రహం. కుబ్జుడు అన్నది,శనీశ్వరుడి నామల్లో ఒకటి. తమిళబాషానుసారంగా కుబ్జన్ ఉన్న ఊరు కుబ్జనూర్, కాలాంతరంలో కుచ్చానూర్ అయింది. తూర్పు ముఖంగా గురుభగవానుడి ఆలయంతో బాటు క్రొత్తగా నిర్మింపబడిన ఆంజనేయ స్వామి ఆలయం వుంది. ఇక్కడ ప్రసాదం ముందుగా కాకులకు సమర్పించి ఆతరువాత భక్తులకు పంచుతారు. ఒకవేళ కాకులు ప్రసాదమున తిరస్కరిస్తే, మళ్ళీ కొత్తగా ప్రసాదం చేసి, శనికి నివేదించి, కాకులకు మళ్ళీసమర్పిస్తారు.
పాయలేబర్ శనీశ్వర కోవెల సింగపూర్,
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
- శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
- శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
- శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
- శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
- శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
- శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
- శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
- శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
- శ్రీ శనీశ్వర దేవాలయం, karol bagh, new ఢిల్లీ (near karol bagh hanuman temple).
- శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
- శ్రీ శని దేవాలయం, మడివాల,బెంగుళూరు
- శ్రీ శనైశ్వర దేవాలయం,హాస్సన్
- శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
- శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
- శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి.
- శ్రీ శని దేవాలయం, హత్ల, జాంనగర్ జిల్లా, గుజరాత్
- శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
- శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెం కి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.(ఇది పురాతన ఆలయము)
- శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
- శ్రీ శనీశ్వర దేవాలయం, కన్మంగళ, శ్రీ సత్యసాయి ఆశ్రమం, వైట్‌ఫీల్డ్, బెంగుళూరు.
- శ్రీ శనీశ్వర దేవాలయం, సమేతహళ్లి, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో,బెంగళూరు.
- శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, బస్సు స్టాండ్ దగ్గర.
- శ్రీ శనీశ్వర దేవాలయం, కాంగ్ర, హిమాచల్ ప్రదేశ్.
- శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
- శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్‌ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
- శ్రీ అభయ శనీశ్వర దేవాలయం, రామ్మూర్తినగర్, హైదరాబాద్.
- శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు.
- శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాళ్, (ఫ్లైఓవర్ క్రింద) బెంగుళూరు.
- శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై.
- శ్రీ శనైశ్కర దేవాలయం - కోరమంగళ, బెంగళూరు.
- శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్.
- శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు.
పురాణాలలో శనీశ్వరుడు
శని భగవానుడి జీవిత కథ శ్రీ శనిమహాత్మ్యం॥श्री शनिमहात्म्यं॥ అనే అతి ప్రాచీన గ్రంథంలో తెలుపబడింది. ఈ గ్రంథంలో శని దేవుడిని ప్రార్తించి, మెప్పించి ఆయన కృపను, ఆశీస్సులు పొందుటకు ఎంత కష్టమో,ఎంతటి భక్తి శ్రద్ధలు అవసరమో వివరించబడింది. శ్రీ శని మహాత్మ్యం ఇతర గ్రహాల యొక్క ప్రాముఖ్యత, వాటి బలాబలాలను గూర్చి వివరిస్తూ ప్రారంభమవుతుంది. మొట్ట మొదటగా ఈ విషయాలను విశ్లేషించిన ఘనత ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆస్థాన పండితులకు దక్కుతుంది.
హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.
శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడి ని ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.
దశరథ మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను. ఈ విషయంలో నీకు ఋష్యశృంగ మహర్షి సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని శని దీవీంచాడట. ఆతరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తె 'శాంత'దేవిని ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు. (ఇది తప్పు- ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకున్నది అంగ రాజ్యాధిపతి రోమపాదుడు. ఆరోజులల్లో ఆ దేశములో కరువుకాటకాలు గురయిన రాజ్యం అంగదేశం. కరువుకాటకాల నివారణకు గాను రోమపాదుడు తన కూతురైన శాంత ను విభండక మహర్షి కుమారుడయిన ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు)
జ్యోతిష్యశాస్త్రంలో శని స్తానం
వేదసంబంధమైన జ్యోతిష శాస్త్ర ప్రకారం, శని భగవానుడు నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలలో ఒకడు. శని అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావములు కలుగచేయువానిగా, మరియు సహనము, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా; మరియు ఆంక్షలను, నియమాలను విధించేవాడుగా పరిగణింపబడ్డాడు. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉన్నచో ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయములు సానుకూలముగా ఉండును. నిజానికి, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే ప్రతి హిందూ మతస్థుడు తన జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, ఎందుకనగా మరి ఏ ఇతర 'గ్రహం' అనుకూలమైన స్థానంలో ఉన్నా కుడా శని ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు "ప్రతికూల" స్థానంలో ఉన్న శని, పై విషయములన్నింటిలో సమస్యలు సృష్టించును.
శని ప్రతికూల స్థానములో ఉన్నచో కలిగే "దుష్ఫలితాలు" చాలా తీవ్రముగా ఉండుటచే, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే హిందువులు శని అనగా మిక్కిలి భయపడతారు. ఏమైనప్పటికీ, శని ఒక వ్యక్తి అనుభవించే సుఖాలు లేదా కష్టాలకు కారణభూతుడుగా భావించబడుతున్నాడు, శని "ఉనికి"ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క కర్మ ఫలితాలుగా గుర్తించబడినవి. కావున "ప్రతికూల స్థానం"లో ఉన్న శని ఒక వ్యక్తి యొక్క చెడు కర్మల ఫలితాలకు కారణభూతుడుకాగా, అనుకూల స్థానంలో ఉన్న శని మంచి కర్మల ఫలితాలు కారణభూతుడు ఔతాడు. ఆరోగ్యపరంగా చూస్తే క్షీణత, బిగుసుకుపోవడం, క్షీణించిన రక్త ప్రసరణ, కృశించిపోవడం, మొదలైన అనారోగ్యాలు, మరియు సరిగా ఆలోచించలేకపోవుట, అసమత్వ బుద్ధి కలిగుండటం వంటి మానసిక సమస్యలు శని భగవానుని ప్రభావముచే కలుగును. ఈ రొగములన్నీ జాతకచక్రంలో శని ఉపస్థితను అనుసరించి నిర్ణయించబడతాయి.
శని గ్రహం ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించటానికి 30 సంవత్సరాలు పడుతుంది, అనగా ఈ 30 సంవత్సరాలలో ఇది 12 రాశులు లేదా సంపూఋణ సూర్యభ్రమణం చేయుటకు పట్టు కాలం. కావున ప్రతి రాశి లేదా చంద్ర రాశులలో శని భగవానుడు సగటున రెండున్నర సంవత్సరాలు గడుపును. రాశుల గుండా శని యొక్క ఈ ప్రయాణానికి హిందూ జ్యోతిష్యశాస్త్రంలో మరియు భవిష్యత్తును చెప్పుటలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏలిన నాటి శని యొక్క ప్రభావం వారి యొక్క జన్మ రాశికి ముందు రాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమై జన్మరాశి తరువాత రాశిలోనికి ప్రవేశించడంతో ముగుస్తుంది. మొత్తము ఈ 7.5 సంవత్సరాల(2.5 సంవత్సరాలు×3) కాలాన్ని సాడెసాతి లేదా "ఏల్నాటి శని"గా పరిగణిస్తారు, ఇది జీవితంలో అత్యంత కష్ఠ కాలం. శని మహాదశ లోనికి ప్రవేశించే ముందు ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలు చాల ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో శని రాజును కూడా దరిద్రునిగా మార్చగలడని చెప్పబడింది.
శని మకర (కాప్రికార్న్) మరియు కుంభ (అక్వేరియస్) రాశులను పాలించువాడుగా, తుల(లిబ్రా)లో ఉన్నతమైన వాడుగా మరియు మేషరాశి (ఏరిఎస్)లో నిస్త్రాణుడుగా ఉండును. బుధుడు, శుక్రుడు, రాహు, కేతులు శనికి స్నేహితులుగా, సూర్యుడు, చంద్రుడు మరియు అంగారకుడు శత్రువులుగా పరిగణింపబడ్డారు. గురు లేదా బృహస్పతి శనితో తటస్థ వైఖరిని అవలంబించును. శని పుష్యమి, అనురాధ, మరియు ఉత్తర భాద్రపద నక్షత్రాల, చంద్రభావనాల అధిపతి.
శని భగవానుని వర్ణన పురాణాలు మరియు జ్యోతిషశాస్త్రంలో ఇలా వర్ణించబడి ఉంటుంది. ఆయన వర్ణం నలుపు లేదా ముదురు నీలం, లోహం ఇనుము మరియు రత్నం నీలం. ఈయన మూలసూత్రం లేదా తత్త్వం వాయువు, దిక్కు పడమర (సూర్యుడు అస్తమించి చీకటి ప్రారంభమయ్యే చోటు) మరియు అన్ని ఋతువులను పాలించును. నువ్వులు, మినుములు, నల్లని ధాన్యాలు శని యొక్క సంప్రదాయ ఆహారపదార్థాలు, ఈయన పుష్పం ఉదారంగు మరియు అన్నీ నల్లని జంతువులు ఇంకా అన్నీ పనికిరాని మరియు అసహ్యమైనవాటిగా పరిగణించబడే వృక్షములతో జోడించబడ్డాడు.
శని సమూహములను పరిపాలించును. వారివారి జాతకాలలో శనిగ్రహం అనుకూల స్థితిలో లేకున్న జన సమూహం పాలించడం అనేది చాలా కష్టం. వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని ప్రాబల్యం (లేదా లగ్నం) ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి జన సమూహమందు మంచి నాయకునిగా గుర్తింపు మరియు కీర్తిని పొందును. అంతేకాక, అటువంటి వ్యక్తులు తమ చేతిలో ఉన్న కార్యము పట్ల మిక్కిలి అంకితభావం మరియు పట్టు కలిగివుంటారని చెప్పబడింది. మరోవైపు, వ్యక్తి జాతకచక్రంలో శని బలహీనునిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి 'కర్మ' బలహీనమై తన బాధ్యతల పట్ల అంకితభావం మరియు పట్టు లేకపోవడంచే బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమగును. అందుచే వ్యక్తి జాతకంలో శనీశ్వరుని దీవెనలు లేనిదే 'మోక్షం' లభించుట కష్టం.
శనీశ్వర భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో ఖచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.
శని భగవానుడు తన చెడు ప్రభావములకంటే కూడా దీవెనలకు ప్రసిద్ధుడు. దీవెనలు అందించుటలో మరి ఏ ఇతర గ్రహాన్ని శనితో పోల్చలేము. తన దశ చివరిలో ఆయన దీవెనల వర్షం కురిపించును. ప్రజాపతి ఈయన అది-దేవత కాగా యముడు ప్రత్యాది-దేవత. శనిదేవుడు వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించును, చిరాకులను మరియు జాప్యాన్ని కలుగచేయుటచే మన అధర్మమైన పనులను సరిదిద్దును. చివరిలో మనం చేసే తప్పులను తెలుసుకొనే జ్ఞానమును ప్రసాదించును. ఆయన శిక్షించడం ద్వారా అంతరంగములో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టును, జీవి లేదా వ్యక్తి ఆత్మను పరిపూర్ణం చేయుటద్వారా వ్యక్తి లోపలినుండి రాగి నుండి బంగారముగా మారును అనగా అతను జీవిత సత్యాలను, తాను అజ్ఞానముచే చేసిన పనుల నిరర్థకతను అర్థంచేసుకుంటాడు. శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు. ఇదంతా మానవులపై దేవతలు కర్తలుగా, పవిత్ర స్వరూపం చేయించును. శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 8వ సంఖ్యలో జన్మించినవారు శనిదేవునిచే పాలింపబడతారు. ఏ నెలలోనైనా 8, 26 తేదిలలో జన్మించిన వారు జీవితంలో కష్టాలను ఎదుర్కుంటారు అనేది రుజువు చేయబడిన యదార్థం. ఈ కష్టాలకు కారణం ఉంటుంది, ఇంకా ఆ కారణాన్ని వారి జీవిత కాలంలో గుర్తించటం ముఖ్యం. చెడు పనులకు బాధ్యత వహించటం, ఆత్మవిమర్శ మరియు కష్టించి పనిచేయుట వంటివి శనిదేవుని శాంతింపచేయుటకు మార్గాలు. శనివారాలలో నీలపు వస్త్రాన్ని దానం చేయటం మరియు పేదవారిని సేవించటం కూడా సహాయపడును.
శని శోదశనామ స్తోత్రము :
కోన శనైస్చరో మందః చ్చాయా హృదయానందనయా మార్గాంధజ సుధాసౌరీ నీలవస్త్రాన్ జనాద్యుతిః అబ్రాహ్మనాః
క్రూరాక్రూరా కర్మాతంగి గ్రహనాయకా క్రిష్ణోధర్మానుజః శాంతః శుష్కోధరా వరప్రదాః దశరథ ||
శని స్తోత్రము :
కోనంతకో రౌద్ర యమాతః బబ్రుః క్రిష్ణః శనిః పింగళ మందః శౌరీః నిత్య స్మ్రుత్యో హరతే చ పీడః తస్మై నమః శ్రీ రవినందనయా॰
సురా అసురా కింపురుష రాజేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
నర నరేంద్ర పశవో మృగేంద్ర వన్యాశ్చ యే కీట పతంగ బ్రింగాః పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
దేశాచ దుర్గాని వనాని యత్ర శేనానివేశ పుర పట్టణాని పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
తిలైర్యవైర్మశా గుదాన్నదానై అయోహీన నీలాంబర దానతోవా ప్రీనతి మన్త్రైర్నివాశరేచ తస్మై నమః శ్రీ రవినందనయా॰
ప్రయాగ కూలే యమునా తటేచ సరస్వతీ పుణ్యజలే గుహాయం యో యోగినం ధ్యానగతోపి శూక్ష్మాశ్ తస్మై నమః శ్రీ రవినందనయా॰
అన్య ప్రదేశాత్ స్వగృహం ప్రవిష్తాశ్ తదీయవరేశా నర సుఖేశాత్ గృహద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనయా॰
స్రష్ట స్వయంభూర్ భువన త్రయస్య త్రత హరీశో హరతే పినాకీ ఏకాస్ త్రిధా రిగ్ యజుః సామ వేదాః తస్మై నమః శ్రీ రవినందనయా॰
కోనస్తో పింగళ బబ్రుః క్రిష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః
ఏతాని దశ నామాని నిత్యం ప్రాధయ పటే శనైశ్చర కృత పీడా న కదాచిద్ భవిష్యతి దశరధ ప్రోక్త ||
శని స్తోత్రము
నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయచ నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ
నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక నమః
పౌరుష గాత్రాయ స్థూల రోమాయతే నమః నమో నిత్యం క్షుదార్తాయ నిత్య తృప్తాయతే నమః
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర
నమో స్తుతే నమస్తే ఘోర రూపాయ దుర్నిరీక్ష్యాయతే నమః
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వతే అభయ దాయినే అధో దృష్టే నమస్తే-స్తు సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయచ జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే తుష్టోదదాసి రాజ్యం త్యం క్రుద్ధో హరపి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే బ్రహ్మాశక్రో యమశ్చైవ మునయస్సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతం తీహ తవ దృష్ట్యావలోకితాః త్వయావలోకితాస్తే-పి నాశయాంతి సమూలతః ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వ మర్ధితః ||
లంకలో హనుమంతుడు చేసిన ప్రతి పనీ రావణాసురుని వినాశానికి కారణమైంది. ఈ క్రమంలో లంకలో గాఢాంధకారంతో కూడిన ఒక గదిలో శనైశ్చరుడు బంధింపడి ఉన్నాడు. హనుమంతుని పాదం శనైశ్చరుడు ఉన్న గది గోడమీద పడటంతోనే అది కాస్తా కూలిపోయింది. హనుమ ద్వారా విషయం తెలుసుకున్న శనీశ్వరుడు లంకను ఓ చూపు చూశాడు. శనైశ్చరుడి చూపునకు విభీషణాది వైష్ణవి భక్తుల గృహములు తప్ప, తక్కిన లంకంతయూ నాశనమైపోయింది. తర్వాత శనైశ్చరుడు హనుమంతునకు వరమిస్తూ “ఆంజనేయా అచిరకాలములోనే లంక సమస్తము నాశనమైపోతుంది. నీ ప్రయత్నం అంతా సఫలమౌతుంది” అని వెళ్ళిపోయాడు. తద్వారా శనైశ్చరునకు ముక్తి కలుగుటతో లంక అంతయూ భస్మీభూతమయింది. అది చూసి హనుమంతుడు తన తోకను శీతలము చేయదలచి సముద్రములోకి దారితీశాడు. స్నానము చేసి మరోసారి సీతామాతను చేరి చూడామణి తీసుకుని, నమస్కరించి తిరుగు ప్రయాణమవుతాడు. ఇలా శనీశ్వరునికి విముక్తి కలిగించడంతో హనుమంతుడు శనిచూపు లేకుండా తప్పించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంకా హనుమంతుని భక్తులను శనీశ్వరుడు తన గ్రహదోషం పేరిట ఎలాంటి హాని చేయబోడని, నవగ్రహదోషాల నుంచి విముక్తులు కావాలంటే హనుమంతుడిని పూజిస్తే సరిపోతుందని పురోహితులు చెబుతున్నారు.
దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.
ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు. కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు. అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .
శనివార వ్రత విధానం
ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి.
శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .
‘’ మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’
శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది .
సాధారణం గా శని బాధ తట్టు కోవటం చాలా కష్టం .అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు .అయితే పేద వారు చేయ లేరు కదా .నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండక పోవచ్చు .ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శని వారం ఉదయం ,సాయంకాలం పఠిస్తేశని దేవుని అనుగ్రహం పొంద గలరు .ఖర్చు లేని పని .ఇప్పుడు ఆ సర్గ లో ఉన్న విషయాన్ని తెలుసు కొందాం
ఆంజనేయుడు లంక లో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో తోక తో చంపి పారేస్తున్నాడు .రావణుడు పంపిన అక్ష కుమారుణ్ణి ససైన్యం గా హతమార్చాడు .చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ‘’ఇంద్ర జిత్ ‘’అనే బిరుదు పొందిన తన పుత్ర రత్నం మేఘ నాదుడిని సైన్యం తోడూ ఇచ్చి హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.పంపిస్తూ కొడుకు తో ఇలా చెప్పాడు ‘’నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇద్రు డిని సునాయాసం గా గెలిచి రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు .బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు .నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడ లేరు .మూడు లోకాల్లో నిన్ను జయించ గల మగాడు లేడు .నీ చేత ఓడిమ్పబడని వాడూ లేడు .నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది .ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో నీకు బాగా తెలుసు .నీకు యుద్ధం లో అసాధ్యమైనది లేదు .సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి కార్య సాధన చేయ గల సర్వ సమర్దుడవు .నీ భుజ ,వీర్య ,తపో బలాలు నాతో సమాన మైనవి .యుద్ధ సమయం లో నేను నిర్ణ యించిన పని చిటికెలో నువ్వు చేయ గల వాడివి .నువ్వు అండగా ఉండ బట్టే నేను ఇంత నిక్షేపం గా లంకా రాజ్య పాలన చేస్తున్నాను .ఎవడో కోతి మన మహా వీరు లందర్నీ అశోక వనం దగ్గర ఉండి మట్టు పెడు తున్నాడు .అక్షయ కుమారుడిని చంపేశాడు .జంబుమాలి ,పంచ సేనాగ్ర నాయకులు వాడి చేతి లో మరణించారు . .మన సైన్యం దాదాపు అంతా క్షీణించి పోయింది .నువ్వే ఇప్పుడు లంకా రాజ్యాన్ని రక్షించ గల ఏకైక వీరుడివి .ఎంత మంది సైనికుల్ని పంపినా ఆ కోతి సునాయాసం గా చంపేసి భయం కల్గిస్తున్నాడు .వారి వల్ల ఇక కార్యం సాను కూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చాడో ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో .దాన్ని బట్టి నీ దగ్గ ర ఉన్న సర్వశాస్త్రాలను ధైర్యం గా ప్రయోగించు .వాడిని వదించటం తక్షణ కర్తవ్యం .నువ్వే తగిన వాడివి .నిన్ను పంపటం నాకు సుత రామూ ఇష్టం లేక పోయినా తప్పని సరి గా పంపువలసి వస్తోది .లంకా రాజ్య భవిష్యత్తు అంతా నీ చేతి లో ఉంది .విజయం సాధించి తిరిగి రా .నా ఆశీస్సులు ,లంకా వాసుల ఆశీస్సులు నీకు లభించు గాక ‘’అని చెప్పి ఉత్సాహ పరచి ఇంద్ర జిత్ ను పంపాడు
రెట్టించిన ఉత్సాహం తో ,ఉప్పొంగిన పరాక్రమం తో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయల్దేరాడు .ఉప్పొంగే సముద్రం లా ఉన్నాడు .గరుత్మంతుని వేగం తో కదిలాడు .నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు .సుశిక్షితు లైన విలుకాన్ద్రను వెంట బెట్టు కొన్నాడు .హనుమ ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరాడు .అప్పడు పది దిక్కుల్లో దుశ్శకునాలు కలిగాయి క్రూర మృగాలు అరిచాయి .వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు ,సిద్ధులు ,సాధ్యులు దేవతలు అందరు ఆకాశవీధి లోఉత్కంథ గా చేరి చూస్తున్నారు .
ఇంద్ర జిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టన్కారం చేశాడు .హనుమ ఇంద్ర జిత్తులు యుద్ధం ప్రారంభించారు .అతి వేగం గా ఇంద్ర జిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు .మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తున్నాడు .ఆకాశ మార్గం లో సంచరిస్తూ అతనికి అంద కుండా అసహనాన్ని కల్గిస్తున్నాడు .ఎన్నో రకాల శరాలను లాఘవం గా సందిస్తున్నాడు రావణ పుత్రుడు .వాటిని అతి తేలిక గా తప్పించు కొంటున్నాడు వాయు పుత్రుడు .అతని బాణ ధ్వని ,రాధ ధ్వని భేరీ ల ధ్వని విని ఆకాశం లోకి అంద నంత ఎత్తు కు యెగిరి తప్పించు కొంటున్నాడు మారుతి .ఒకరి కొకరు తీసి పోకుండా యుద్ధం చాలా సేపు చేశారు .ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్ధం కాలేదు .అతని అతి శక్తి వంత మైన బాణాలన్ని వ్యర్ధమే అయ్యాయి .హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయ లేక పోయాయి .హనుమ ను వోడించటం అసాధ్యం అని ఇంద్రజిత్ నిర్ణయానికి వచ్చాడు .మరి ఉపాయం ?బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమ ను బంధించాలి అని నిశ్చయించు కొన్నాడు .
మంత్ర పూతం గా బ్రహ్మాస్త్రాన్ని హనుమ పై ఇంద్ర జిత్ ప్రయోగించాడు .అరి వీర భయంకరుడైన హరి వీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింప బడ్డాడు .ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం .అయితే అది తను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది .నమస్కరించి బద్ధుదయాడు .,బంధుడు అయాడు .ఈ బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని ,రావణుడిని చూసే ఆవ కాశం కలుగు తుందని ,దానితో అతని పరాక్రమం ,వ్యూహం తెలుసు కొ వచ్చునని భావించాడు .రాక్షసులు బలాత్కారం గా పట్టి లాగుతున్నా ,ఏమీ మాట్లాడ లేదు .తప్పించు కొనే ప్రయత్నమూ చేయ లేదు .అతని నిర్వి చేష్టతను గమనించి రాక్షసులు హనుమ ను గొలుసు లతో నార వస్త్రాలతో కట్టే శారు .బ్రహ్మ వరం పని చేసింది .బంధింప బడ గానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచి పోయింది .వేరే బంధం ఉంటె బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు .అది హనుమ కు మాత్రమే తెలుసు .ఈ విషయం ఇంద్ర జిత్ అర్ధం చేసు కొన్నాడు .తను కష్ట పడి బంధించింది అంతా వ్యర్ధమైనదని దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని ఊహించాడు .ఏమీ చేయ లేక మౌనంగా తండ్రి దగ్గరకు ,సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తుంటే చేరాడు .విషయాన్ని అంతటిని తండ్రికి వివ రించాడు .హనుమ ను చూసి రాక్షసు లందరూ ‘’చంపండి ,నరకండి ‘’అని అరుస్తున్నారు .
హనుమ రావణ సింహా సనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరి పార జూశాడు .రావణుడు మంత్రులతో ‘’ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసు కొండి ‘’అని ఆజ్ఞా పించాడు .వారు హనుమను వివరాలు అడిగారు .అప్పుడు హనుమంతుడు ‘’నేను రామ బంటును .హనుమ నామ దేయుడిని .సుగ్రీవుని మంత్రిని .సీతా మాత శ్రీ రాముని ఇల్లాలు .నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెదికిఆమె జాడ తెలుసు కోమని దక్షిణ దిక్కు కు పంపితే ఇక్కడ ఉందని తెలుసు కొని లంక చేరాను. దుస్తర మైన సముద్రాన్ని ఆవ లీల గా దాటాను .ఇది నా శక్తి కాదు శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..’’అని చెప్పాడు –కనుక శని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండ లోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తీ తో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు.
గ్రహాల్లో శని బాగా పీడిస్తాడనీ,శని పట్టుకుంటే చెప్పనలవికాని బాధలు పడవలసి వస్తుందని జనానికి చచ్చేటంత భయం.అందు చేత తమ జోలికి రాకుండా ఉండేందుకు శని త్రయోదశినాడు శనికి తైలాభిషేకాలు, తిల దానాలు ఇచ్చి.తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నమందపల్లి క్షేత్రంలో తైలాభిషేకం,శని పూజ చేయించి తమకు శని పట్ల ఉన్న భయ భక్తుల్ని అలా తెలియపరచుకుంటూ ఉంటారు.
ఒకసారి శివుడు శనిని తన దగ్గరకు పిలిచాడు.
శని అపరిమితమైన భయంతో ఒణికిపోతూ,శివునికి పాదాభివందనం చేసి మహప్రభో! ఏమిటి?నన్ను పిలిపించారు?అని అడిగాడు.అప్పుడు శివుడు "ఏరా! నువ్వు మా దొడ్డ గ్రహమట కదా! ఎలాంటి వాళ్ళనైనా పట్టుకునిపీడించి ఏడిపిస్తావట కదా! ఏదీ! నన్ను పట్టుకుంటావా?అని అడిగాడు. శని నమస్కరిస్తూ,"అయ్యో! ఏంత మాట తమరి అనుగ్రహం ఉండాలే కాని,నేను తమ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతానా? "అని వినయంగా అన్నాడు.అంత శివుడు "సరే! నీ సామర్ధ్యం ఏమిటో చూస్తాను,నువ్వు ఎల్లుండి మధ్యాహ్నం లోగా నన్ను పట్టుకో! "అన్నాడు.శని వినయంగా తల పంకించి తమ చిత్తం అని సగౌరవంగా వెళ్ళిపోయాడు.
అంత శివుడు దుర్గమారణ్యంలో పెద్ద మర్రి చెట్టు తొర్రలో చిన్న రూపంతో ప్రవేసించి దాదాపు 2రోజులు శనికి దూరంగా ఉండాలని అక్కడే గడిపాడు.ఆయన గడువు దాటగానే బయటకు వచ్చాడు.వెంటనే ఎదురుగా నిలబడి నమస్కరిస్తున్న శనిని చూచి "ఏరా! ఏదీ? నన్ను పట్టుకుంటానన్నావుగా?నేనిచ్చిన గడువు దాటి పోయిందిగా? నువ్వు పట్టుకోలేదే?"అని నవ్వుతూ ప్రశ్నించాడు.అంత శని విజయ గర్వంతో నమస్కరిస్తూ,"స్వామీ! తమరు అప్రతిహత ప్రభావంగల మహాదేవులు. కైలాసంలో నవరత్నాలు స్థాపించిన బంగారు సింహాసనం మీద పార్వతీ దేవితోనూ, విఘ్నేశ్వరునితోను, కూర్చుండి, చుట్టూ బ్రహ్మ,విష్ణు,ఇంద్ర,సూర్యచంద్రాద్రులు, నారదాది మహర్షులు,సేవిస్తూ ఉండగా ప్రమధ గణం
"హర నమ:పార్వతీ పతయే హర హర మహాదేవ" శంభో శంకరా!
అని జయ జయ ధ్వానాలు సాగుతూ,అఖండ వైభవోపేతంగా కొలువు దీరి ఉండే దేవదేవుడవై ఉండవలసిన మీరు!ఎవరూ చొరరాని ఈ కీకారణ్యంలో,ఈ మర్రి చెట్టు చిన్నితొర్రలో చిన్న రూపంతో, భయం భయంగా దాక్కుని 2రోజులు బిక్కు బిక్కుమంటూ గడపడం,ఎవరి ప్రభావం వల్లనంటారు?మహప్రభో? అని సవినయంగా ప్రశ్నించాడు.
అంత పరమేశ్వరుడు "ఓరి నీ అసాధ్యం దొంగలు తోలా! నీ దుంప తెగా! ఎంత పని చేశావురా? నువ్వు నన్నే పట్టుకుని ఇంతపని చేసినవాడవు! ఇంక సామాన్యులను ఎవరిని వదలి పెడతావు కనక? అని ప్రశంసా పూర్వకంగా అతని వంక చూడగానే,శని ఉబ్బితబ్బిబ్బయి పోయి చిరునవ్వు నవ్వుతూ,అయ్యా!అయ్యా!తమరి దయ!అన్నాడు.వెంటనే రుద్రుడు కళ్ళెర్రచేసి "ఇదిగో! నాది ఒక మాట చెప్తున్నాను. గుర్తుంచుకో! ఎప్పుడూ నన్ను స్మరిస్తూ,నా నామ సంకీర్తనం చేస్తూ,నిత్యం నా అభిషేకం చేస్తూ ఉండే భక్తుల్ని మాత్రం నువ్వు పట్టుకోకూడదు.తెలిసిందా?"అనిహెచ్చరించాడు. వెంటనే,శని భయంతో ఒణికి పోతూ, బిక్కమొహం వేసుకొని "చిత్తం! చిత్తం!"అని నమస్కరించి తల వంచుకున్నాడు.ఉత్తర క్షణంలో పరమ శివుడు అంతర్ధాన మయ్యాడు. చూశారా!శని ఆ ఈశ్వరుణ్ణి కూడా వదల్లేదు.అలాంటి అంత గొప్పవాడైన ఆ శనైశ్చరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే,
ఓంశనైశ్చరాయ విద్మహే,
ఛాయాపుత్రాయ ధీమహి,
తన్నో మందఃప్రచోదయాతు!
ఈ మంత్రాన్ని స్మరిస్తూ ప్రతి శనివారం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి,బెల్లం నువ్వులు కలిపి చేసిన నువ్వుల ఉండను నివేదన చేస్తే శనైశ్చరుడు ప్రీతి చెందుతాడని,ఏలినాటి శనిబాధ నుండి కొంత ఊరట లభిస్తుందని మన పురాణాలు చెపుతున్నాయి.మిత్రులు ఆ విధంగా శని దోషాన్ని పరిహరించుకోవలసినదిగా కోరుకుంటున్నాను.
ఈశ్వరునిమీద ఆదిశంకరుల శ్లోకం
కదా వా కైలాసే కనకమణిసౌధే సహ గణై
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ||
శనీశ్వరుడికి శనివారం పాలాభిషేకం చేయిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. శనిదేవుని వలన బాధలు అనుభవిస్తున్న వారు, శనివారం నాడు శనీశ్వరాలయాల్లో గానీ, నవగ్రహమండపంలోని శ్రీ శనీశ్వరునికి గానీ అభిషేకం చేయడం మంచిది. అంతేకాకుండా నల్లని వస్త్రం, నల్లని నువ్వులు, నువ్వుల నూనె, మేకులు, ఇనుము, దర్భలు, బూరగదూది వంటివాటిని దానమివ్వడం మంచిది.
ఇవన్నీ చేయలేనివారు శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి, నువ్వులనూనెను శనీశ్వరుని విగ్రహానికి అభిషేకంగా పోసి, నల్లని వస్త్రమును శనీశ్వరుడిపై ఉంచి, పిడికెడు నల్లని నువ్వులను స్వామివారి ముందుంచి ప్రదక్షిణలు చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే శ్రీ శనేశ్వర షోడశనామస్తోత్రం
కోణశ్శశైశ్చరోమంద: ఛాయాహృదయ నందన:
మార్తాండజస్తథా సౌరి: పాతంగీ గ్రహ నాయక:
అబ్రాహ్మణ: క్రూరకర్మా నీల వస్త్రాంజన ద్యుతి:
కృష్ణోధర్మానుజ : శాంత : శుష్కోదర వర ప్రద:
షోడశైతాని నామాని య: వఠేచ్చ దినేదినే
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తన్యజాయతే. ||
ఈ శ్లోకాన్ని ప్రతిదినం పఠించినట్లైతే శనీశ్వరుడి బాధలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తులో కూడ బాధలు కలుగవని పురాణాలు చెబుతున్నాయి.