The Concept of Kala or Time in Hinduism |
హిందూ కాలమానం :
కల్పకాలు - మన్వంతరాల లెక్క :
యావత్ చరాచర సృష్టిలో గుర్తించిన కల్పాలు లేదా కల్పకాల లో ప్రస్తుత కల్పం " శ్వేత వరాహ కల్పం ". ప్రతి కల్పం 14 మన్వంతరాలుగా వ్యవస్థీకృతమై ఉంది.. ప్రతి మన్వంతరం 71 మహా యుగాలుగా వ్యవస్థీకృతమై ఉంది. ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉన్నాయి. అవి, కృతయుగం , త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. అంటే ఒక కల్పంలో వెయ్యి మహాయుగాలు ఇమిడి ఉన్నాయి.
- ఒక మహాయుగం నిడివి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు.
- కృతయుగం = 17,28,000
- సంవత్సరాలు,
- త్రేతాయుగం = 12,96,000 సంవత్సరాలు
- ద్వాపర యుగం = 08,64,000 సంవత్సరాలు..
- కలియుగం. = 4,32,000 సంవత్సరాలు...
- ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం. 43,20,000 సంవత్సరాలు..
మన్వంతరాల లెక్క :
ఒక మన్వంతరం = 71 మహా యుగాలు = 43,20,000 × 71 =30,67,20,000 సంవత్సరాలు.
432 కోట్ల సంవత్సరాల ఉదయకల్పంలో సృష్టి అసంఖ్యాక రూపాలతో కనిపిస్తూ ఉంటోంది ...
విశ్వ వ్యవస్థలో ఉదయకల్పం పగలు
- 432 కోట్ల సంవత్సరాల ఉదయకల్పం ముగిసిన తర్వాత 432 కోట్ల సంవత్సరాల పాటు ప్రళయకల్పం ఏర్పడుతోంది.
- ప్రళయకల్పం లో సృష్టి కనిపించదు...
- విశ్వవ్యవస్థలో ప్రళయకల్పం సృష్టి కల్పాలు... రేయింబవళ్ళలా ఉంటాయి.
- పగలు తరువాత రాత్రి , రాత్రి తరువాత పగలు వలె
- ఉదయకల్పం ( సృష్టి కల్పం ), తర్వాత ప్రళయకల్పం, ప్రళయకల్పం తరువాత మళ్లీ ఉదయకల్పం అనాదిగా ఏర్పడుతున్నాయి. అనంతంగా ఏర్పడబోతున్నాయి ....
- ఈ పునరావృత్తికి మొదలు లేదు తుది ఉండబోదు.
ఉదయకల్పం, ప్రళయకల్పం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతూ ఉండడం విశ్వవ్యవస్థ. ఇప్పటికీ ఎన్నిసార్లు ఉదయకల్పం ( సృష్టి కల్పం ) ఏర్పడి ఉందో ఎన్నిసార్లు ప్రళయకల్పం ఏర్పడి ఉందో ఎవరికీ తెలియదు. తెలిసిన వారు బహు తక్కువ. అలాంటి వారు ద్రష్టలు. భవిష్యత్తులో ఎన్నిసార్లు ఉదయకల్పం ఏర్పడుతుందో ఎన్నిసార్లు ప్రళయకల్పం ఏర్పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఇది విశ్వవ్యవస్థలోని కాలం పునరావృత్తం అవుతున్న తీరు ఆది మధ్యాంతరహితమైన కాల గమన పునరావృత్తిని "అఖండ మండలాకారం"గా వేద ఋషులు దర్శించారు ఆవిష్కరించారు.
ఇలా పునరావృత్తం అవుతున్న " కల్పాల " క్రమంలో ప్రస్తుతం " శ్వేతవరాహ కల్పం" నడుస్తోంది. ఈ కల్పంలోని 14 మన్వతరాలలో ఆరు ఇప్పటికి జరిగాయి... ప్రస్తుతం ఏడవదైన "వైవస్వత మన్వంతరం" నడుస్తోంది.... ఈ మన్వంతరంలోని 71 మహా యుగాలలో ఇప్పటికి 27 మహాయుగాలు గడిచి పోయాయి.... 28వ మహాయుగంలో మొదటి మూడు యుగాలు గడిచాయి. నాలుగవదైన కలియుగంలో ప్రస్తుతం 5,125 వ సంవత్సరం నడుస్తోంది . (ఈ కలియుగం 3102 వ సంవత్సరంలో ప్రారంభమైన పాశ్చాత్య శకం లేదా క్రీస్తు శకం ప్రకారం ఇది 2023 వ సంవత్సరం.).
ఇలా ప్రస్తుత శ్వేత వరాహ కల్పం లో ప్రస్తుతం 195,58,85,125 వ సంవత్సరం జరుగుతోంది. ఈ సంవత్సరం పేరు శుభ శోభకృత్....
శ్రీ తంగేడు కుంట హెబ్బార్ నాగేశ్వరరావు