Health Benefits of Homam |
హోమము వలన కలుగు లాభములు
- హోమ ధూమము కంటి ని కప్పుట వలన కంటి లో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపము లో వెళ్లి పోతుంది.
- హోమాగ్ని సెగ మోకాళ్ళ కు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించు కోవచ్చు.
- గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధల తో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు వస్తాయి.
- రవి:- తెల్ల జిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్ల జిల్లేడు సమిధల తో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి.
- కళ్ళ కు సంబంధించిన అనారోగ్యాలు నయ మవుతాయి.
- కోపము యొక్క తాపము తగ్గుతుంది.
- తల నొప్పి భాధలు ఉండవు.
- ఆయుర్వేదం ప్రకారం తెల్ల జిల్లేడు కు కుష్టు వ్యాధి ని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు.
- చంద్రుడు:- మోదుగ సమిధల తో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.
- ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి.
- సుఖ వ్యాధులు దరి చేరవు.
- మోదుగాకు ను మెత్త గా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు.
- మోదుగ పువ్వులు, గింజలు ఎండ బెట్టి నీటి లో ఒక పావు చెంచా వేసి కాగబెట్టు కొని తాగితే లావుగా ఉన్న వారు సన్న గా అవుతారు.
- వైద్య పరం గా చూస్తే జీర్ణ వ్యవస్థ ను అద్భుతం గా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగ కు వుంది.
- రక్తాన్ని శుభ్ర పరుస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతూ వుంటారు.
- కుజుడు:- చండ్ర సమిధ తో హోమం చేస్తే ఎర్ర రక్త కణాల ఇబ్బందులు, ఎముకల బలహీనత ఇబ్బందులను అరి కడుతుందంటారు.
- పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయని చెబుతారు.
- బుధుడు:- ఉత్తరేణి సమిధ ను హోమం లో ఉపయోగిస్తే చర్మ వ్యాదులు తగ్గుతాయి.
- జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు.
- ఉత్తరేణి పూల్ల తో గాని, వేరు తో గాని రోజూ దంత ధావనం చేసుకుంటే దంత దోషాలు తొలగి పోతాయి.
- ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలం గా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి అన్నది విజ్ఞుల వాక్కు.
- గురువు:- రావి సమిధల తో హోమం చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతున్దంటారు.
- ఈ ధూమము శరీరము లో చేరి భార్యా భర్తల దోషములను తగ్గించు తుందని చెబుతారు.
- రావి చెక్క కషాయాన్ని తేనె లో కలిపి తీసు కుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి.
- నోటి పూత పోతుంది.
- రావి చెక్క కషాయాన్ని రోజు తీసు కుంటే ఆహారం త్వర గా జీర్ణం అవుతుంది.
- కాలేయ సమస్యలు ఉండవు.
- వివిధ కఫ దోషాలను రూపు మాపు తుందని ఆయుర్వేదం లో వుంది.
- శుక్రుడు:- మేడి చెట్టు సమిధల తో హోమం చేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు.
- గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికర మైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు).
- దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మ రూపం లో సుప్రతిష్టితులై ఈ వృక్ష మూలము నందు ఉంటారని అంటారు.
- దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధు మేహ వ్యాధి నివారించ బడుతుంది అని వైద్య శాస్త్రమున చెప్పబడినది.
- దీని విత్తనాలు పొడి చేసి, తేనె తో కలిపి తీసుకున్నా మధుమేహం దరి దాపుల్లో కనిపించ కుండా పోతుందంటారు.
- శని:- జమ్మి సమిధల తో హోమం చేస్తే అప మృత్యు భయం తొలగి పోతుందని శాస్త్ర వచనము.
- దీర్ఘ కాల అనారోగ్యాలు తొలగిపోతాయి.
- జమ్మి చెట్టు గాలి శరీరాని కి కలిగిన ఇబ్బందులు తొలగించు తుంది.
- ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘ కాల అస్వస్థతలు తొలగిపోతాయి.
- రాహువు:- గరికల తో హోమం చేస్తే ఇంటి లో నర దృష్టి తొలగి పోయి సర్ప సంబంద దోషాలు తొలగిపోతాయి.
- గరిక రసాన్ని గజ్జి,చర్మం పైన ఉన్న కురుపుల పై పెట్టిన ఎడల చర్మ రోగాలు నివారించ బడతాయి.
- దెబ్బ తగిలి రక్తం కారి పోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.
- కేతువు:- ధర్భల తో హోమం చేస్తే కాల సర్ప దోషాలు తొలగిపోతాయి.
- మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.