Devi |
దేవీ నవరాత్రుల పూజా విధానం
అమ్మలఁగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్దియిచ్చు తమహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
- ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు చేసే పూజలను నవరాత్రి పూజలు అంటారు. దీనిని శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు ఈ నవరాత్రి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఎంతటి దరిద్రమైన తొలగించి సుఖసంతోషాలను ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది ఈ పండగ శరత్కాలంలో వస్తుంది కాబట్టి దీనిని శరన్నవరాత్రులు అంటారు శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు.
- చివరి రోజు దశమి తిథి కలుపుకుని మొత్తం పది రోజులు కలిసి దసరా పండగ ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించ లేని వారు చివరి నాలుగు రోజులైనా పూజించాలి మొదటిది మూలానక్షత్రం రోజున ఇది అమ్మవారి జన్మనక్షత్రం కాబట్టి ఆరోజు తల్లిని సరస్వతి దేవి గా పూజిస్తారు.
- రెండవది దుర్గాష్టమి అష్టమి తిథి నాడు అమ్మను దుర్గామాత గా పూజిస్తారు మూడవది మహర్నవమి నవమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మను పూజిస్తారు నాల్గవది దశమి ఆ రోజున అమ్మను శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో పూజిస్తారు.
- విజయ దశమి రోజున సాయంకాలం లో తన కుటుంబీకులకు తనకు తాను చేసే పనిలో విజయం లభించడం కోసం అపరాజితా దేవిని పూజిస్తారు నిత్యం విజయాన్ని ప్రసాదించే ఆ తల్లి అపరాజిత ని పూజించడం వల్ల విజయదశమి అనే పేరు వచ్చిందని ప్రతీతి.
మన పురాణాల్లో కూడా విజయదశమి గురించి చెప్పారు శ్రీరామచంద్రుడు అమ్మవారిని ఆరాధించి విజయదశమి రోజున రావణాసురుని సంహరించాడని అర్జునుడు అజ్ఞాతవాసంలో తన ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచుతాడు తరువాత ఉత్తర గోగ్రహణ సమయంలో జమ్మి చెట్టు మీద నుంచి తన గాండీవాన్ని తీసి కౌరవులపై విజయం సాధించిన రోజు కూడా విజయదశమి అని చెబుతారు.
శ్రీ మాత్రే నమః