Lord Shani |
అవును, స్వయంగా శని దేవుడే ఈ స్తోత్రాన్ని అందించినట్టుగా పురాణం గడలు చెబుతున్నాయి.
క్లుప్తంగా: పూర్వం రాజ్యభ్రష్టుడైన నలమహారాజు బాధపడుతుండగా, శనిదేవుడు నలమహారాజు కలలో కనిపించి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అది పాటించిన నలమహరజుకు తాను కోల్పోఇనా పూర్వ వైభవం తిరిగి పొందాడు. కాబట్టి శని దేవుని అనుగ్రహాన్ని అతి త్వరగా పొందటానికి, చాల విలువైన స్తోత్రంగా దీన్ని పరిగనిస్తారు. దీన్ని పాటించిన యెడల శని పీడనుంచి విముక్తి కాగలుగుతారు. ఈ శ్లోకం/మంత్రం క్రింది విదంగా ఉంది.
“ క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి "
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
“ శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే "
ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో పాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.