అల్లూరి సీతారామరాజు |
తెలుగు సాహిత్యంలో అల్లూరి సీతారామరాజు | Alluri Sitaramaraju in Telugu literature free Pdf Book !
సీతారామరాజు చరిత్ర ఒక తెలుగు వీర గాధ. ఒక భారత స్వాతంత్ర్య సమరవీరుడి పోరాట కధ. అటువంటి వీరుడిపై సాహిత్య రూపాల్లో అనేక ప్రక్రియలు వెలువడ్డాయి. స్వాతంత్ర్య భావ చైతన్యము ఆంధ్ర జాతికే కాదు, అఖిల భారత జాతికి ఆదర్శప్రాయము, మార్గదర్శకము.
ఆయన జీవితం, పోరాటం, పీడిత మానవాళికి నిరంతరం అత్యంత స్ఫూర్తిదాయకం.నవతరానికి అట్టి స్ఫూర్తి నిచ్చెందుకు తోద్పడుతుందని అల్లూరిపై రచనలు చేసిన రచయితల నమ్మకం. బహుముఖమైన ప్రతిభాపాటవాలు, ఇంతటి ఘన చరిత్ర కలిగిన అల్లూరి వారిపై దాదాపు అన్ని ప్రక్రియల్లో విస్సృతమైన, విలక్షణమైన రచనా వ్యాసంగం జరిగింది. దీన్ని సమగ్రంగా పరిశీలించడం నా సిద్ధాంత గ్రంధ రచనా సదుద్దేశ్యం. ప్రధానంగా జీవిత చరిత్రలు, కవిత్వం, నాటకాలు, నవలలు, బుర్రకథలు, వ్యాసాలు, సినిమాలాంటి అంశాల్లో సీతారామరాజును అక్షరీకరించిన తీరుతెన్నుల్ని ఒక క్రమపద్ధతిలో విశ్లేషించాను.