బ్రహ్మ దేవునికి మరియు బ్రహ్మచారులకు గల సంబంధమేమిటి?.
త్రిమూర్తులలోని వాడు , సరస్వతీ నాధుడు అయిన బ్రహ్మదేవునికీ , బ్రహ్మచారికి సంబంధము లేదు. వేద , ఉపనిషత్ .. ప్రతిపాధిత మయిన బ్రహ్మపదార్ధమనే మహాతత్వానికి సంబంధించి ఈ బ్రహ్మచారి అనే శబ్ధాన్ని వాడడము జరిగింది.
ఆ బ్రహ్మపదార్ధాన్ని తెలుసుకొనే అన్వేషణా మార్గములో ఉన్నాడనే అర్ధముతో బ్రహ్మచారి అనే పదప్రయోగము చేశారు.