Sri Ananthalwar Gunapam - Crowbar |
అనంతాళ్వార్ శ్రీవారి సేవలో తరించిన భక్తాగ్రేసరుడు. వీరికే ఆనందాళ్వారు అని మరో పేరు. వీరు తిరుమల కొండమీదే నివసించి స్వామికి నిత్యం పూల కైంకర్యం చేసేవారు!
పూలతోటకై బావిని తవ్వే ప్రయత్నంలో తనకి సహకరించబోయిన బాలుని మీద కోపగించారు. ఎందుకంటే స్వామి సేవను తన భార్యతో తప్ప ఎవరితోనూ పంచుకునేందుకు ఆయన మనసంగీకరించలేదు.పదేపదే తను వద్దని వారించినా తన భార్యకు మట్టితట్టలు మోయటంలో సహకరిస్తున్న బాలుని మీదకు తన చేతిలోని గునపాన్ని విసిరారు.తప్పించుకు పారిపోతున్న బాలుని గడ్డానికి తగిలింది.బాలుని వెంట పరిగెత్తిన అనంతాళ్వారునికి బాలుడు గర్భగుడిలోకి పరుగెత్తి మాయమయిన దృశ్యం కనుపించింది!
మరునాడు ఉదయం అర్చకస్వాములు స్వామి గడ్డానికి దెబ్బ గమనించి పుప్పొడి అద్ది పరిచర్యలు చేసారు.అనంతాళ్వారు బాధకు అంతే లేదు.తన భక్తునిసాయానికి వచ్చిన స్వామికి ఇంత అపచారం చేసాను,నాకు ఎలాటి శిక్ష విధించినా సమ్మతమే అని రోదించసాగారు.
స్వామి ప్రత్యక్ష మై అనంతాళ్వారు భక్తికి మెచ్చి తన గడ్డానికి పచ్చకర్పూరం ప్రతిరోజూ అద్దమని ఆ రకంగా అనంతాళ్వారుని భక్తులందరూ తలచేలా జరుగుతుందనీ అర్చకస్వాములకు ఆదేశించారు!దానికి నిదర్శనమే మనం తిరుమలలో స్వామి వారి గడ్డానికి చూస్తున్న పచ్చకర్పూరముద్ద!
ఇక అనంతాళ్వారు తోటనీ,మహాద్వారప్రవేశం దగ్గర ఆయన బావి తవ్వడానికి ఉపయోగించి,స్వామి గడ్డానికి గాయమయిన గునపాన్ని నేటికీ దర్శించవచ్చు
" ఓం నమో వెంకటేశాయ "