Raksha Bandhan |
రక్షా బంధన్
శ్రావణ పౌర్ణమినాడు ‘రక్షా బంధన్’ పండుగ జరుగుతుంది. ఈ పండుగను ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఎంతో వైభోవపెతంగా జరుపుకుంటారు. అయితే కాలంతో పాటూ మారూతూ వస్తున్న సంప్రదాయపు మార్పులతో ఇప్పుడు దేశమంతా ఈ పండుగ జరుపుకుంటున్నారు.
దీన్ని రాఖీ పౌర్ణమి అనీ, జంధ్యాల పౌర్ణమి అనీ కూడా అంటారు. పిల్లలందరికీ రాఖీ పండుగ పేరు చెబితే ఎంతో సబరం. అన్నాచెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ల పటిష్టమైన మమతానుబందానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ రోజు అన్నకుగాని, తమ్మునిగాని అన్నదమ్ముల వరస అయిన వారికి గానీ అక్కచెల్లెళ్ళు రాఖీ కడతారు.
రాఖీ అనగా ‘రక్షణ’ అని అర్థం. ‘రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ సూత్రం కట్టడం అని అర్థం. సన్నటి దారాలతో ఎర్రటి తోరణంతో రాఖీని తయారు చేసి, ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగూ విజయం వైపే పదాలని కోరుకుంటూ, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు ఎదగమని కోరుకుంటూ మణికట్టుకు ఆ రాఖీని కడుతుంది. హారతి ఇస్తుంది. మంగళ తిలకం నుదుట అద్దుతుంది. ఆ ప్రేమకు బదులుగా అన్న కూడా తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆమెకు వివిధ రకాల కానుకలు ఇస్తాడు.
శ్రావణ పౌర్ణమికి భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ పర్వంగా పిలవబడే ఈ పండుగను సావనీ అనీ, సలోనా అనీ కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో నారీకేళ పౌర్ణమి అనీ, అవనీ అవిత్తమ అనీ అంటారు. మధ్య భారతదేశంలో కజరీ పౌర్ణమి అనీ, గుజరాత్లో పవిత్రోపనా అనీ పిలుస్తారు.
మహారాష్ట్రలో రక్షాబంధన పర్వం నరాళి పూర్ణిమ గా జరుగుతుంది. మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే జాలరి జాతి ఉంది. వీరు వరుణదేవుని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్బంగా వీరు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరేస్తూ వరుణదేవుని పూజిస్తారు. ఒకరి నుదిటిపై మరొకరు సంపదలకు ప్రతీక అయిన సిందూరాన్ని రాసుకుంటారు. పశ్చిమ బెంగాల్, ఒడిసాలలో ఈ పండుగ ఘూలాన్ పూర్నిమగా జరుగుతుంది. శ్రీక్రుష్ణునికీ, రాధకు ప్రార్థనలు, పూజలు జరిపిన తర్వాత ఆడపిల్లలు తమ సోదరులకు రాఖీలు కడతారు.
ఈ పండుగను భారతదేశం, నేపాల్ దేశాల్లోనూ సార్వత్రికంగాను, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న హిందువులు, జైనులు, సిక్కు మతస్తులూ జరుపుకుంటారు.
Raksha Bandhan |
రాఖీ – పౌరాణిక ప్రాధాన్యం
భవిష్య పురాణంలో చెప్పబడిన ఒక కథ ప్రకారం, ఆకాశానికీ, వర్శానికీ, పిడుగులకీ ప్రభువైన ఇంద్రునికి, మహాబలశాలి అయిన దానవ చక్రవర్తి బలికి మధ్య వైరం రాగులుకున్నది. ఆ సమస్య పరిష్కారం కోసం ఇంద్రుని పత్ని శచీదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్తుంది. విష్ణుమూర్తి ఆమెకు ఒక నూలుదారంతో పేనిన తోరం ఇచ్చి, ఆ జయ సూత్రాన్ని ఇంద్రునికి కట్టమంటాడు. శచీదేవి దాన్ని ఇంద్రుని మణికట్టుకి కడుతుంది. తర్వాత జరిగిన దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు దానవులపై విజయం సాధించి అమరావతిని తిరిగి దక్కించుకున్నాడు.
ఈ కదా పవిత్రసూత్ర బలాన్ని తెలియజేస్తుంది. తర్వాతి కాలంలో మానవ చరిత్రని ఈ కథ ఎంతో ప్రభావితం చేసింది. పూర్వకాలంలో తమ కుటుంబాల నుంచి యుద్ధ భూమికి సాగాబోయే వీరులకు ఆడపడుచులు, వీరవనితలు ఈ సూత్రాన్ని కట్టేవారు. ఈ సూత్రబంధన ఆ రోజుల్లో అన్నాచెల్లెళ్ళకు పరిమితమైన బంధంగా మాత్రమే లేదు. గణేశునికి శుభ, లాభ అనే ఇద్దరు పుత్రులున్నారు. రక్షాబంధన దినాన వినాయకుని సోదరి ఆయన చేతికి రాఖీ కట్టింది. అయితే గణేశుని ఇద్దరు పుత్రులూ రక్షాబంధన జరుపుకునేందుకు తమకి సోదరి లేనందుకు కినుక వహించారు. తమకి కూడా ఒక సోదరి కావాలని వాళ్ళిద్దరూ తండ్రిని కోరారు. గణేశుడు ఏమీ తోచని దశలో ఉండగా, నారదుడు ప్రత్యక్షమై, గణేశుడు, ఆయన ఇద్దరు తనయులూ సంతోషించేలా ఒక కుమార్తెని సృష్టించమని, ఆమె సకల సమృద్ధికీ, కారణమవుతుంది అని సలహానిచ్చాడు. ఆ విధంగా గణేశుని ఇద్దరు భార్యలైన రిద్ధి (అత్యంత ఆశ్చర్యం), సిద్ధి (పరిపూర్ణత) దివ్యాగ్నుల నుంచి సంతోషిమాత ఆవిర్భవించింది. అప్పుడు శుభ, లాభాలు కూడా సంతోషీమాతతో కలిసి వేడుక జరుపుకున్నారు.
రాఖీ – ఇతిహాస వైశిష్ట్యం
శ్రీ కృష్ణుడు శిశుపాలునితో జరిగిన ఒక యుద్ధంలో గాయపడతాడు. అతని చేతి వేలికి గాయమైంది. రక్తం బాగా కారుతుంటే, ద్రౌపది తన చీర కొంగును చింపి, ఆయన వేలికి కడుతుంది. అపుడు శ్రీ కృష్ణుడు ఆమెను సోదరీ సమానగా భవించి ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి, తదుపరి కాలంలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి ఆమెను రక్షిస్తాడు.
‘సకల ప్రాణి కోతిని కాపాడు కమలాక్షుడే నిని బ్రోయు, సృష్టిస్థితి లయకారుడే నిను పాలించు, ఆ శ్రీకరుడే నీ శిరము నరయు, కేశవుడే నీ గర్వము బ్రోచు, కమలాక్షుడే నీ కుక్షిగాయు, ఆ అనంతుడైన నారాయణుడే నీ ముఖము, నీ చేతులను, నీ మదిని, నీ ఇంద్రియములను నిలిపుగాక, ఆకసమున నిన్ను హృషీకేశుడు, అవనియండు మహీధరుడు కాచుగాట!’ అని అర్థం వచ్చే రక్షాగీతాన్ని ఆడపిల్లలు పాడి, తమ సోదరులకు తిలకం దిద్ది, స్వహస్తాలతో మధుర పదార్ధం తినిపిస్తారు. సోదరుల చేతుల మీదుగా తామూ తీసుకుంటారు.
“రక్షా బంధన్ రోజు ఉదయమే అన్నాచెల్లెళ్ళు మంగళ స్నానాలు ముగించుకుని, ఆపై ఇష్టదైవాన్ని పూజిస్తారు. తర్వాత కుంకుమ, అక్షతలు పళ్ళెంలో ఉంచి, దీపాహారతిని వెలిగించి, ఆ హారతికి పూజ చేస్తారు. అపుడు చెల్లి అన్న నుదిటిపై కుంకుమ, తిలకం, అక్షతలు కలిపి మంగళ తిలకం తీర్చిదిద్దుతుంది. తర్వాత అన్న కుడి చేతికి పట్టుదారంతో తయారుచేసిన రాఖీని కత్తి, అన్నకి తీపిపదార్థాలు తినిపిస్తుంది. ఈ విధంగా అక్కాచెల్లెళ్ళ చేత రాఖీ కట్టించుకుంటే భూత, ప్రేత, పిశాచబాధల నుంచి అన్నదమ్ములకు రక్ష లభిస్తుంది అని విశ్వాసం. స్వంత అక్కాచెల్లెల్లు లేనివారు సోదరీభావంతో చూసేవారి చేత రాఖీ కట్టించుఒవడం కూడా పరిపాటి. రాఖీ కడుతూ అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ములు సుఖశాంతులతో సమృద్ధిగా ఉండాలనీ, వారు దీర్గాయువుగా జీవించాలని కోరుకుంటారు.”