Organ donation |
అవయవ దానం అంటే ఏమిటి?
చనిపోయే దశలో ఉన్న వ్యక్తికి అవయవ మార్పిడి పునర్జన్మను బహుమతిగా ఇస్తుంది.
అవయవ దానంలో రకాలు ఏమిటి?
అవయవ దానం రెండు రకాలు:
- బ్రతికి ఉన్న దాత అవయవ దానం: తన జీవితంలో ఒక వ్యక్తి ఒక మూత్రపిండంను దానం చేయవచ్చు(రెండవ మూత్రపిండం దాత శరీర విధులు నిర్వహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది), క్లోమం యొక్క భాగం, (సగం క్లోమ విధులకు సరిపోతుంది) మరియు కాలేయం యొక్క భాగంగా (కాలేయం యొక్క భాగాలు గ్రహీత మరియు దాత ఇద్దిరిలోనూ కొంత కాలం తర్వాత పునరుత్పత్తి అవుతాయి).
- చనిపోయిన దాత అవయవ దానం: ఒక వ్యక్తి (బ్రెయిన్-స్టెమ్ / హృదయ) మరణం తర్వాత చాలా అవయవాలు మరియు కణజాలాలను దానం చేయవచ్చు. అతని/ఆమె అవయవాలను మరో వ్యక్తి శరీరంలో జీవించి ఉంటాయి.
అవయవ దానానికి వయస్సు పరిమితి ఉందా?
అవయవ దాన వయసు పరిమితి బ్రతికి ఉన్న దాతలకు మరియు చనిపోయిన దాతలకు వేరుగా ఉంటుంది; బ్రితికి ఉన్న దాత, ఉదాహరణకు, వయస్సు 18 సంవత్సరాలకంటే ఎక్కువ ఉండాలి, మరియు మరణించిన దాత అవయవాల శారీరక స్థితి ముఖ్యం, వయసు కాదు. ప్రత్యేక ఆరోగ్య నిపుణులు కేసుకును బట్టి అవయవాల మార్పిడి పై నిర్ణయం తీసుకుంటారు. వారు 70 మరియు 80 లో ప్రజలు నుండి అవయవాలు మరియు కణజాలం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా మార్పిడి చేశారు. కణజాలాలు మరియు కళ్ళ విషయంలో, వయస్సు సాధారణంగా పట్టింపు లేదు.
మరణించిన దాత సాధారణంగా అవయవాలు & కణజాలంలో దానం చేయడానికి వయస్సు పరిమితి:
- మూత్రపిండాలు, కాలేయం: 70 సంవత్సరాల వరకు
- గుండె, ఊపిరితిత్తులు: 50 సంవత్సరాల వరకు
- క్లోమం, పేగు: 60-65 సంవత్సరాల వరకు
- కార్నియా, చర్మం 100 సంవత్సరాల వరకు
- గుండె కవాటాల: 50 సంవత్సరాల వరకు
- బోన్: 70 సంవత్సరాల వరకు
ఎవరు దాత కావచ్చు?
జీవించి ఉన్న దాత: 18 సంవత్సరాలు నిండిన ఏవరైనా వ్యక్తి స్వచ్ఛందంగా చికిత్సా ప్రయోజనాల కోసం అతని లేదా ఆమె జీవితకాలంలో తన అవయవాలు మరియు/లేదా కణజాలాల తొలగించడానికి అనుమతించవచ్చు.
మరణించిన దాత: ఎవరైనా, వయస్సు , జాతి లేదా లింగం సంబంధం లేకుండా అతని లేదా ఆమె మరణం (బ్రెయిన్‌స్టెమ్/కార్డియాక్) తర్వాత అవయవాలు మరియు కణజాల దాత కావచ్చు. సమీప బంధువు లేదా మృతదేహం చట్టబద్ధంగా స్వాధీనంలో ఉన్న వ్యక్తి యొక్క సమ్మతి అవసరం. మరణించిన దాత 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కున ఉంటే, అప్పుడు తల్లిదండ్రుల లేదా తల్లిదండ్రుల ద్వారా అధికారం పొందిన సంబంధిత వ్యక్తి సమ్మతి అవసరం. వైద్య సామీప్యాన్ని మరణం సమయంలో నిర్ణయిస్తారు.
నేను ఒక దాతగా ఎలా ఉండాలి, దాత ప్రతిజ్ఞ తీసుకోవడానికి ప్రక్రియ ఏమిటి?
మీరు అవయవ మరియు కణజాలాన్ని దానం చేయాలనుకుంటే దాత ఫాం (ఫాం -7 THOA ప్రకారం) నింపి సంతకం చేసి NOTTOకు క్రింద పేర్కొన్న చిరునామాకు పంపండి :
జాతీయ అవయవ మరియు కణజాల ట్రాన్స్ ప్లాంట్ పునర్వవస్తీకరణ,
4 వ అంతస్తు, NIOP బిల్డింగ్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ ప్రాంగణం
న్యూఢిల్లీ 110029.
మీరు మీ అవయవాల దానం ప్రతిజ్ఞను ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. సైన్ అప్ అవడానికి మరియు దాతగా నమోదుకు చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్కు చేయండి.
Organ donation |
నేను ఎల్లప్పుడూ దాత కార్డును వెంటపెట్టుకో వలసి ఉంటుందా?
అవును, అది ఆరోగ్య నిపుణులు మరియు మీ కుటుంబానికి సహాయకారిగా ఉంటుంది.
నేను ఒకటి కంటే ఎక్కువ సంస్థ లలో నా ప్రతిజ్ఞ నమోదు చేయవలసి ఉంటుందా?
లేదు, మీరు ఇప్పటికే ఒక సంస్థ తో ప్రతిజ్ఞ చేసి దాతగా కార్డ్ అందుకుంటే, మీకు ఏ ఇతర సంస్థ ద్వారా నమోదు అవసరం లేదు.
ఒక వ్యక్తి, కుటుంబం లేకుండా, ప్రతిజ్ఞ కోసం నమోదు చేసుకోవచ్చు?
అవును, మీరు ప్రతిజ్ఞ తీసుకోవచ్చు, కానీ మీరు మీ దగ్గరి వ్యక్తికి తెలియజేయటం అవసరం. దీర్ఘకాల లేదా దగ్గరి సహోద్యోగి, మిత్రుడు వంటివారికి మీ ప్రతిజ్ఞ నిర్ణయం గురించి చెప్పండి. మీ దానం ఆకాంక్ష నెరవేర్చడానికి, ఆరోగ్య నిపుణులు మీ మరణం సమయంలో ఎవరో ఒకరి సమ్మతి కోసం మాట్లాడే అవసరం ఉంటుంది.
నేను ముందు హామీ ఇచ్చి, తరువాత ప్రతిజ్ఞ పై నా మనస్సుని మార్చుకోవచ్చా?
అవును, మీరు NOTTO కార్యాలయానికి కాల్ చేయడం ద్వారా లేదా మీ ఖాతా లాగిన్ ద్వారా NOTTO వెబ్ సైటులో www.notto.nic.in అన్-ప్లెడ్జ్ ను ఎంపిక చెసుకోవచ్చు. అలాగే, మీ కుటుంబానికి మీరు అవయవ దానం ప్రతిజ్ఞ గురించి మీ మనసు మార్చుకున్నట్టు తెలియజేయండి.
దాతల అంటు వ్యాధి ఉంటే దానిని గుర్తిస్తారా?
అవును, అందరు సంభావ్య దాతల నుండి తీసిన రక్తాన్ని HIV మరియు హెపటైటిస్ వంటి వ్యాధుల వైరస్ల పరీక్ష చేస్తారు. దాతల కుటుంబానికి ఈ విధానం తెలియజేయడం అవసరం.
నేను ఇప్పటికే జబ్బు పడి ఉంటే నేను దాత కావచ్చా?
అవును, చాలా సందర్భములలో మీరు దాతగా ఉండవచ్చు. జబ్బు పడి ఉండటం అవయవాన్ని లేదా కణజాలాన్ని దానం చేయడాన్ని నిరోధించలేదు. కొన్ని లేదా అన్ని అవయవాలు లేదా కణజాలం మార్పిడికి అనుకూలంగా ఉన్నాయనే నిర్ణయం మీ వైద్య చరిత్ర పరిగణలోకి తీసుకొని ఒక ఆరోగ్య నిపుణుడు చేస్తాడు.
చాలా అరుదైన సందర్భాలలో, HIV లేదా హెపటైటిస్-సి దాతలు అవయవాలను అదే పరిస్థితిలోని ఇతర రోగులకు ఉపయోగిస్తున్నారు. రెండు పార్టీలు జబ్బుతో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్వహించరు. అందరు దాతలను చాలా తనిఖీలను చెస్తారు.
నేను రక్తదానానికి తిరస్కరించబడ్డాను అయినా నేను అవయవ దాతగా ఉండవచ్చా?
అవును, కొన్ని లేదా అన్ని అవయవాలు లేదా కణజాలం మార్పిడికి అనుకూలంగా ఉన్నాయనే నిర్ణయం ఎల్లప్పుడూ ఒక నిపుణుడి ద్వారా, మీ వైద్య చరిత్ర తీసుకొని తయారు చేస్తారు. రక్తహీనత లేదా రక్త మార్పిడి కలిగి లేదా గతంలో హెపటైటిస్ కలిగి ఉండి లేదా ఆసమయంలో మీ ఆరోగ్యం వల్ల కొన్ని సార్లు రక్త దానం సాధ్యం కాకపోనచ్చు - కొన్నిసార్లు మీకు జలుబు ఉంటే లేదా ఏవైనా మందుల వాడుతూ ఉంటే రక్త దానానికి అనుమతించరు.
మొత్తం శరీర దానం మరియు అవయవ దానానికి బేధం ఏమిటి?
చికిత్సా ప్రయోజనాల కోసం అవయవ దానం మానవ అవయవాలు మార్పిడి చట్టం (THOA 1994) క్రింద ఉంటుంది. మొత్తం శరీరం దానం అనాటమీ చట్టం 1984 కింద ఉంది.
చనిపోతున్న దశలో అవయవ వైఫల్యంతో బాధ పడుతున్న వారికి అతని/ఆమె అవయవాల దానం ద్వారా మరణం తర్వాత ఇతరులకు జీవితం ఇచ్చేదిగా అవయవ మరియు కణజాల దానాన్ని నిర్వచిస్తారు.
శరీర దానం వైద్య పరిశోధన మరియు విద్య కొరకు మరణం తరువాత శరీరాన్ని ఇవ్వడంగా నిర్వచిస్తారు. ఆ దానం శవాల శరీర నిర్మాణ వైద్యులు మరియు వైద్య విద్యావేత్తలు స్థూల శరీర నిర్మాణాన్ని బోధించేందుకు ఒక ప్రధాన శిక్షణా సాధనం ఉంటుంది.
అవయవాలు దానం చెసిన తర్వాత మృతదేహం వైద్య విద్య లేదా పరిశోధన కోసం ఇవ్వవచ్చా?
లేదు, అవయవాలు దానం చేసిన శరీరాలు లేదా పోస్టు మార్టం నిర్వహిచిన శరీరాలు బోధనా ప్రయోజనాల కోసం అంగీకరించరు. కానీ, కేవలం corneas దానంగా ఉంటే, శరీరం పరిశోధనకు వాడతారు.
మూలం: జాతీయ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ సంస్థ