Brahmins |
నేటి సమాజంలో బ్రాహ్మణులపై హిందూ దేవుళ్ళ పై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి, అయినా కూడా ఎందుకు బ్రాహ్మణులు స్పందించడంలేదు, ఇతర కులాల వారు మాత్రమే స్పందిస్తున్నారు?
సమాజంలో అసమానతలు , కుల వివక్ష పోవాలని జరిగిన ఉద్యమాల వెనక బ్రాహ్మణులు ఉన్నారని ఈ విమర్శించే వాళ్లకు తెలుసా? దేశంలో కుల మత విబేధాలు లేకుండా అందరికీ చదువు అందాలని బ్రిటిష్ వారి కాలంలోనే విద్యా హక్కు చట్టం కోసం పోరాడిన గోపాల కృష్ణ గోఖలే బ్రాహ్మణుడే. అది తెలుసా? ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. 73 ఏళ్లుగా అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్న భారత రాజ్యాంగం అమలులో ఉంది. అయినా బ్రాహ్మణుల పై ఏడుపు ఆగడం లేదు. నీకు ఎవడి ద్వారానో కుల వివక్ష ఎదురైంది అంటే దానికి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దేశంలో మను స్మృతి అమలులో లేదు. రాజ్యాంగం అమలు లో ఉంది. నీకు హక్కులు ఉన్నాయి.అసలు రాజ్యాంగం అంటే తెలుసా? అందులో కుల వివక్ష ను నిషేదించే నిబంధన ఉందని తెలుసా? నిన్ను రక్షించడానికి చట్టం ఉంది. నీకు చేతనైతే పోరాడి నీ హక్కులు కాపాడుకోవాలి. అంతేగానీ, అది చేతకాక ఎప్పుడో ఏళ్ల నాటి విషయాలు తవ్వి తీస్తే ఎలా?
ఇంకా వేల ఏళ్ల నాటి పరిస్థితులే ఇప్పుడు దేశంలో ఉన్నాయా? హోటల్ , బస్ , థియేటర్, స్టేడియం, గుడి ..ఇవి రోజూ అందరం తిరుగుతున్న ప్రదేశాలు కదా! ఎవరు ఎవరినైనా మీ కులం ఏది అని అడగడం చూసారా? ఇంత పెద్ద దేశంలోఎక్కడో ఏదో జరిగితే, దానికి బ్రాహ్మణులకు సంబంధం ఏమిటి? బ్రాహ్మణుడు ఇపుడు సమాజాన్ని శాసించే స్థితిలో ఉన్నాడా? ఒక సారి బుద్ధి, జ్ఞానం ఉపయోగించి ఆలోచించాలి.
తెలుగు రాష్ట్రాలే ఉదాహరణ గా తీసుకోండి. 1972 తరువాత ఉమ్మడి రాష్ట్రానికి P V తరువాత ఒక బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి కాలేదు. అంటే గత 50 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని వాళ్ళు పాలించడం లేదు. మాట్లాడే వాడికి ఇది తెలుసా?
2014 తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు కెసిఆర్, ఇటు బాబు, జగన్ ప్రభుత్వాల్లో ఒక్క బ్రాహ్మణుడు కూడా కేబినెట్ మినిస్టర్ గా లేడు. మరి ఏ అధికారం ఉందని బ్రాహ్మణుల మీద విమర్శలు చేస్తున్నారు?
దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు, అంతకు ముందు మొగలు చక్రవర్తులు పాలించారు. తమ మత రాజులు ఉంటే బ్రాహ్మణులు ఏదో చేసి ఉంటారు అనుకోవచ్చు. ఇతర మతాల వారి పాలన లో వారి మాట ఎలా చెల్లుతుంది? వారి కారణంగా వివక్ష ఎలా జరిగింది?
దేశ ఔన్నత్యం బ్రాహ్మణులు ఎప్పుడూ చాటలేదా?
- ఈ దేశానికి తొలి నోబెల్ ప్రైజ్ తెచ్చింది ఒక బ్రాహ్మణుడే. నోబెల్ విజేతల్లో సగం మంది బ్రాహ్మణులే. అక్కడ కూడా కులం చూసే ఇచ్చారా? బ్రాహ్మణులు హాయిగా బతుకుతున్నారు అనుకుంటున్నారా?
- తన కులం వల్ల ఈ రోజు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది బ్రాహ్మణుడే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ లు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ, పౌరోహిత్యం చేసుకుంటూ, ఆర్థికంగా చితికి పోయి, పెళ్లికి వదువు కూడా దొరకక ,పెళ్ళిళ్ళు కాక ఎంత మంది అవస్థలు పడుతున్నారో తెలుసా?
- చదువుకునే విద్యార్థి ని చూడండి.ఏ ఎంట్రెన్స్ exam fee అయినా OC ఎంత చెల్లించాలి? మిగతావారు ఎంత చెల్లించాలి ? ఒక అగ్ర కులం లో పుడితే ఎందుకు ఎక్కువ డబ్బులు చెల్లించాలి? వీరికి ఆకాశం నుండి డబ్బులు ఏమైనా వూడి పడుతున్నాయా?
ఇక తమపై వస్తున్న విమర్శలకు బ్రాహ్మణులు ఎందుకు స్పందించడం లేదు ఇలాంటి చిల్లర విషయాల మీద స్పందించి, తమ స్థాయిని దిగజార్చుకోడం ఇష్టం లేక. మూర్ఖుడి తో ఎందుకు వాదనలు అని చెప్పి వారు దూరంగా ఉంటారు.
Written-by : Deepak - MA. Political Science