దీపారాధన |
దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?
ప్ర : దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God
జ : దీపారాధనకు హైందవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యముంది. సకల సిరులను, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి జ్యోతి స్వరూపిణి. ఏ శుభకార్యం ఆరంభించినా, ముందుగా దీపప్రజ్వలనం చేయడం మన ఆచారం. దీపం వెలిగించేముందు 'దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్' అన్న శ్లోకం పఠిస్తారు. పర్వదినాలు, పండగలు, శుభకార్యాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు, సత్సంగం- దీపసమర్పణకు అనుకూల సమయాలు. శివరాత్రి, పూర్ణిమ, సోమవారం, దీపావళి, కార్తీకమాసంలోని ముప్ఫై రోజులూ, జ్వాలాతోరణ దీపాలు అత్యంత ప్రశస్తమైనవి. దానాలన్నిటికన్న దీపదానం శ్రేష్ఠమైనదని పురాణ కథనం.
- ఆవునెయ్యి ఉత్తమం.
- మంచి(నువ్వుల ) నూనె మధ్యమము.
- ఇప్ప నూనె అధమము.
- వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు.
ఆవు నెయ్యితో వెలి గించిన దీపం ఫలం అనంతము. అష్టైశ్వ ర్యాలూ, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము. ఆముదంతో వెలిగించిన దాంతపత్యసుఖమూ, జీవిత సౌఖ్యమూ లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపమూ అన్నా ప్రీతి.