ఋషి ! |
వానప్రస్థం అంటే ఏమిటి?
పూర్వం గృహస్థులు వారి సంతతి ఎదిగి, వివాహమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగల స్థితికి చేరుకున్నాక వారికి తమ ఆస్తితోపాటు ధర్మాన్ని, వంశాచారాలను, కర్తవ్యాలను, అప్పజెప్పి వనాలకు వెళ్లి గురువు ద్వారా పొందిన మంత్ర జపానుష్టానములతోను, వేదాంత చింతనతోను, మనోనిగ్రహముతోను గడిపే ఆథ్యాత్మిక జీవన విధానాన్నే వానప్రస్థం అంటారు.
అందరూ వనాలకో, ఆశ్రమాలకో వెళ్లి వానప్రస్థ జీవితం గడపడం కుదరదు కదా?
ఆశ్రమ జీవితం గడపడం సాధ్యం కాకపోతే ఇంటినే ఆశ్రమంగా మార్చుకోవచ్చు. ఇంటిలో ఒక గదిని తమకోసం కేటాయించుకుని అందులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచుకో, 'వాలి. వీలైనంత సమయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలతో, జప అనుష్టానాలతో గడపాలి. రాత్రి సమయంలో తిసుకునే ఆహారం స్వల్పంగాను, సాత్వికంగాను వుండాలి. ఉదయమే మెలకువ వచ్చేలా ఆరోగ్యానికి అవరోధం కలిగించని పండ్లు, పాలు వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తకాలములొ లేచి యోగా, వాకింగ్, ప్రాణాయామం, ధ్యానం వంటివి అలవరచుకోవాలి. నిత్యం ఆలయ సందర్శనం, మంత్ర జప అనుష్టానము, స్తోత్ర పారాయణం వంటి సత్కర్మాచరణలో మనసును లగ్న పరచాలి.