వివాహం |
నాతి చరామి అర్థం ఏమిటి ?
అది నిజానికి ' న అతి చరామి ' అంటే ' నిన్ను దాటి వెళ్ళను ' అని భర్త భార్య తో చెబుతాడు.. వివాహం చేసుకుంటున్నప్పుడు.
ధర్మేచ, ఆర్థేచ, కామేచ…న అతి చరామి అన్నది పూర్తి పాఠం.
ధర్మం పాటించడంలోనూ, సంపాదించడం లోనూ, కోరికలు తీర్చుకోవడంలోనూ ' నిన్ను దాటి వెళ్ళను ' అంటే.. నా ఒక్కడి కోసమే చేయను. నేను చేసే అన్ని ధర్మ బద్ధమైన కార్యాలూ నీ భాగ స్వామ్యం తోనే చేస్తాను. నీవు లేకుండా చేయను. అని అర్థం.
భార్య లేనివాడు ఏ రకమైన కామ్య కారక యజ్ఞాలు చేయరాదు. భార్యకు అంత ప్రాముఖ్యత వేదం నిర్దేశం చేసింది. బ్రాహ్మచారికి శంకుస్థాపన చేసే అధికారం కూడా లేదు. షరా : అక్కడక్కడా ధర్మేచ……మోక్షచ అన్నది కూడా వినపడుతుంది. కానీ ఇది తప్పు. ' మోక్షచ ' అన్నది లేదు. మోక్షం విషయం లో ఎవరి అర్హత వారిదే.