Rama |
రామాయణ కావ్యం యొక్క ఉపయోగం?
ఏదైనా ఓ పరికరాన్ని తయారు చేస్తే దానిని ఎలా వాడుకోవాలో, ఎలా వాడుకుంటే అది మనకు పూర్తిగా ఉపకరిస్తుందోనన్న అంశాలను తెలియజెప్పేందుకై వివరాలతో కూడిన పుస్తకాన్ని వెలువరిస్తారు. అలానే మానవ జన్మను ఎలా వాడుకుంటే ఇది సారకమౌతుందో, ఎటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే సుఖసంతోషాలతో జీవించవచ్చునో అనే అంశాలను విభిన్న పాత్రలతో మన ముందుంచుతుంది రామాయణం. ఇది వేదంలో బోధించిన మానవుని "జీవన విధానాన్ని” సులభ శైలిలో నిర్దేశించే కమ్మని కావ్యం.
ఆదర్శవంతమైన రామాయణాన్ని కాకుండా కలహాలు, కుట్రలతో నిండిన భారతాన్ని పంచమ వేదమని ఎందుకన్నారు?
రామాయణం ద్వారా మనం నేర్చుకోవలసిన లక్షణాలు, ధర్మసూక్షాలు ఎన్నో ఉన్నాయి. అయితే భారతాన్ని పంచమవేదమనడానికి రెండు కారణాలున్నాయి.
- భక్తితత్వాన్ని ప్రభోధించే శ్రీ విష్ణు సహస్రనామము.
- మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానదాయిని, అమృతవర్షిణి, అద్వైతత్తాను సంధాయిని అయిన "శ్రీమద్భగవద్గీత". ఇవి రెండూ మహాభారత గ్రంధానికి మధ్య నుండుటచే భారతం పంచమ వేదమని శ్లాఘించడమైనది. వేదంలో బోధించిన ఉపాసన, జ్ఞాన మార్గాలను సులభ శైలిలో సర్వమానవాళికి అర్ధమయ్యేలా ఆచరణ యోగ్యమైనదిగా నిర్దేశించిన గ్రంధం.